వీకెండ్ లో విషాదం.. 25మంది టూరిస్టుల గల్లంతు
By V KRISHNA
On
దేశంలో వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. ఇటీవల గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలి 265 మంది ప్రాణాలు కోల్పాయారు. తాజాగా మహారాష్ట్రలోని పూణెలో ఘోర విషాదం చోటుచేసుకుంది. పూణెలోని ఇంద్రయాణి నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 25 నుంచి 30 మంది టూరిస్టులు నీళ్లలో కొట్టుకుపోయినట్లు సమాచారం అందుతోంది. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెన కుప్పకూలింది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలను ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు ఆరుగురిని సురక్షితంగా కాపాడినట్లు సమాచారం. మరి కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
Related Posts
Latest News
03 Jul 2025 18:06:16
భవిష్యత్ కార్యాచరణ ప్రకటించిన మాజీ సీఎం జగన్
వచ్చే ఎన్నికల్లోగా మరోసారి ప్రజల్లోకి
జగన్ ఫార్ములా మళ్లీ వర్కవుట్ అవుతుందా..?