అసిస్టెంట్ ఎస్పీలతో సమావేశం అయిన డీజీపీ జితేందర్

On
అసిస్టెంట్ ఎస్పీలతో సమావేశం అయిన డీజీపీ జితేందర్

IMG-20250702-WA0094హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న అసిస్టెంట్ ఎస్పీలతోనూ, ప్రొబేషనరీ అసిస్టెంట్ ఎస్పీలతోనూ రాష్ట్ర డిజిపి డాక్టర్ జితేందర్ ఐపిఎస్ బుధవారం నాడు డిజిపి కార్యాలయంలో  సమావేశమయ్యారు.  రాష్ట్రవ్యాప్తంగా పలు సబ్ డివిజన్లకు ఇంచార్జిలుగా పనిచేస్తున్న వీరి నుండి ఆయా  ప్రాంతాల్లోని శాంతిభద్రతల పరిస్థితిపై డిజిపి అడిగి తెలుసుకున్నారు. గత 32 సంవత్సరాలకు పైగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేసిన అనుభవంతో డిజిపి డాక్టర్ జితేందర్ ఐపిఎస్ అసిస్టెంట్ ఎస్పీలకు తగు సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.... అసిస్టెంట్ ఎస్పీలు, ప్రొబేషనరీ అసిస్టెంట్ ఎస్పీలు తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లలో తనిఖీలు నిర్వహించాలని సూచించారు. తద్వారా పోలీస్ స్టేషన్ లోకి వచ్చే బాధితుల పట్ల పోలీస్ సిబ్బంది వ్యవహరించే తీరు   తెలుసుకోవచ్చని డిజిపి అన్నారు. అదేవిధంగా కేసుల దర్యాప్తులో నైపుణ్యం సంపాదించవచ్చని సూచించారు. పనితీరును సమర్థంగా నిర్వహిస్తే  దాదాపు మరో 30 సంవత్సరాల పాటు ఐపీఎస్ అధికారులుగా ఈ అనుభవం ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఐపీఎస్ అధికారులను ప్రజలు ఇతర ఏజెన్సీలు గమనిస్తుంటాయని ప్రజాస్వామ్య వ్యవస్థ లో ప్రజా సంక్షేమమే పరమావధిగా పనిచేయాలన్నారు. అసిస్టెంట్ ఎస్పీలు క్రమశిక్షణతో, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించాలని స్పష్టం చేశారు. కమ్యూనికేషన్ వ్యవస్థ మెరుగైనందున తన పరిధిలోని పోలీస్ స్టేషన్ల తనిఖీ సులభం అవుతుంది అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి  లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.  నిందితులను పట్టుకున్నప్పుడు ముఖ్యమైన నేరస్థులు ఎవరో తెలుసుకోవడం ద్వారా డ్రగ్స్ ను పూర్తిగా నిర్మూలించవచ్చని అన్నారు. అసిస్టెంట్ ఎస్పీలు చురుగ్గా పనిచేస్తే నేరాలు తగ్గుముఖం పడతాయన్నారు. గ్రామ స్థాయి పోలీస్ అధికారులను నియమించుకోవాలని సూచించారు. కళాశాలలు ప్రారంభం కానుండడంతో యాంటీ ర్యాగింగ్ కమిటీ లను ఏర్పాటు అయ్యే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అసిస్టెంట్ ఎస్పీలు అనుమానాస్పద మరణాల విషయంలో 194 BNSS (174 CRPC ) నిస్పాక్షిక దర్యాప్తు జరిగేలా పర్యవేక్షించాలన్నారు.సమీక్ష సమావేశంలో అడిషనల్ డిజిపి మహేష్ ఎం భగవత్ మాట్లాడుతూ.... పోలీస్ స్టేషన్ లకు తనిఖీలకు వెళ్లినపుడు క్రింది స్థాయికి సిబ్బందికి తగు సూచనలు అందజేయాలని అన్నారు. కేసుల దర్యాప్తులో జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. క్రిమినల్ గ్యాంగుల పట్ల, దొంగతనాలు, దోపిడీల అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాలన్నారు. మానవ అక్రమ రవాణా అసలు నేరస్తులను పట్టుకోవాలని అన్నారు. మల్టీ జోన్ ల ఐజిపీలు  ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, తఫ్సీర్ ఇక్బాల్ ఐపీఎస్, ఏఐజి రమణ కుమార్, అసిస్టెంట్ ఎస్పీలు శివం ఉపాధ్యాయ,  అవినాష్ కుమార్, ఎస్ శేషాద్రిని రెడ్డి, కాజల్, ఎస్ .చిత్తరంజన్, బి. చైతన్య రెడ్డి, పి. చేతన్ నితిన్, విక్రాంత్ కుమార్ సింగ్,  శుభం ప్రకాష్, రాజేష్ మీనా తదితరులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

Advertisement

Latest News