Hyderabad: హైదరాబాద్‌‌ లో ఇదో కమర్షియల్ బిజినెస్.. హైడ్రా నిద్రపోతోందా..?

By PC RAO
On
Hyderabad: హైదరాబాద్‌‌ లో ఇదో కమర్షియల్ బిజినెస్.. హైడ్రా నిద్రపోతోందా..?

భాగ్యనగరంలోని భవనాల్లో ఏళ్లుగా సాగుతున్న బాగోతం

పక్కా కమర్షియల్ గా మారిపోతున్న బిల్డింగ్ ఓనర్స్

హైడ్రా రంగంలోకి దిగకుంటే అంతే సంగతులు

By. V. Krishna kumar
TPN Special Desk

హైడ్రా (Hydra) ఈ పేరు వింటే హైదరాబాద్ (Hyderabad) శివారు ప్రాంతాల్లో వణుకు పుడుతుంది. ఎప్పుడు.. ఏ సమయంలో.. హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడతాయో ఎవరికీ తెలియదు. అందుకే ఇటీవల భాగ్యనగరంలో స్థలం కొని సొంత ఇల్లు కట్టుకునేకంటే అద్దె ఇల్లే బెటర్ అనే పరిస్థితి వచ్చింది. అందుకేనేమో ఇదే చాన్స్ అని  ఇంటి యజమానులు తెగ అద్దెలు పెంచి మరీ దోచేస్తున్నారు. ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, బఫర్ జోన్లు, ఎఫ్టిఎల్ ఏదైనా సరే కూల్చేస్తాం అనే హైడ్రా బాస్ రంగనాథ్ ఒకసారి సిటీలో కమర్షియల్ కాంప్లెక్స్ ల మీద కూడా దృష్టి పెడితే బాగుంటుంది అని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు. 

సిటీ, శివారు ప్రాంతం ఎక్కడ చూసినా ప్రధాన రహదారుల్లో కమర్షియల్ భవనాలు కుప్పలు తెప్పలుగా నిర్మాణం జరుగుతున్నాయి. భవనం ఏదైనా సెల్లార్ లు మాత్రం పార్కింగ్ కేటాయించాలని నిబంధన ఉంది. పర్మిషన్ తీసుకునే ముందు మ్యాప్ లో పార్కింగ్ చూపించే నిర్మాణదారులు భవనం పూర్తయ్యాక నిబంధనలు గాలికి వదిలి డబ్బే ప్రధానంగా అందులో కూడా షెట్టర్స్ ఏర్పాటు చేసి అద్దెకు ఇస్తున్నారు. భవనాల ముందు వుండే రోడ్లపైనే పార్కింగ్ అనే సరికి ప్రధాన రోడ్లపై వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

వాస్తవానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ అనే డిపార్ట్మెంట్ ఉంటుంది. సెల్లార్, భవన నిర్మాణాల విషయంలో రూల్స్ పాటిస్తున్నారా లేదా అనే విషయాలు వారే చూడాలి, రూల్స్ పాటించక పోతే కట్టడాలకు నోటీస్ ఇచ్చి కూల్చివేయాలి. బట్ టౌన్ ప్లానింగ్ అంటేనే "కాయా పియా చల్దియా" అనే సామెతలా ఉంది. ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే అంటే మామూళ్లు ఇస్తే వారికి సలాం చేసి గులాం అవుతారని, లేదంటే బాసిజం చూపిస్తారన్న ఆరోపణలు అనేకం ఉన్నాయి.

ఇదిగో ఈ వీడియోలో కనిపించే దృశ్యాలు ప్రత్యక్ష సాక్ష్యాలు. పనామా గోదాం నుండి వనస్థలిపురం వెళ్లే ప్రధాన రహదారిలో నిత్యం వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు ఉంటాయి. ఇక్కడ ప్రధాన రహదారికి ఇరువైపులా కమర్షియల్ భవనాలు అనేకం. బట్ ఏ ఒక్కదానికి సెల్లార్ లేదు. అంత రోడ్లపైనే పార్కింగ్. అధికారులు సైతం ఈ రోడ్లపై నుండే నిత్యం కార్యాలయాలకు వెళ్తుంటారు. అయినా వారికి కనిపించక పోవడం విడ్డూరం అని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

కేవలం పనామా ప్రాంతమే కాదు సిటీ, శివారులో ఇదే పరిస్థితి.  ప్రస్తుతం టౌన్ ప్లానింగ్ అధికారులు నిద్రమత్తులో వున్నారు కాబట్టి హైడ్రా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అని జనం కోరుతున్నారు. ముఖ్యమంత్రి దీనిపై స్పందిస్తే వాహనదారులే కాదు దాని పక్కనే వుండే కాలనీ వాసులకు సైతం ఇబ్బంది తొగించివారు అవుతారని కోరుతున్నారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేస్తేనే స్పందిస్తారా లేదా ఇలా వచ్చే ఫిర్యాదులపై కూడా స్పందిస్తారో లేదా వేచి చూడాలి.

 

Advertisement

Latest News