Category
అన్నమయ్య
ఆంధ్రప్రదేశ్  Featured  అన్నమయ్య  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత, సిట్ ఏం చేయబోతోంది?

మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత, సిట్ ఏం చేయబోతోంది? లిక్కర్ స్కామ్ లో ఏ4 గా మిథున్ రెడ్డిమాస్టర్ మైండ్ ఆయనేనని లూథ్రా వాదనలుమిథున్ రెడ్డి విచారణకు సహకరించలేదన్న లూథ్రాముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ లో ఏ4 గా ఉన్న మిథన్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో గతంలో మద్యం సరఫరా వ్యవస్థ,  లిక్కర్ ఆర్డర్లన్నీ ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా పారదర్శకంగా సాగేవని.. వైసీపీ ప్రభుత్వం హయాంలో మాన్యువల్‌ విధానాన్ని తెచ్చారని.. ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదించారు. అంతేకాకుండా అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలన్నీ మిథున్ రెడ్డి నియంత్రలో పెట్టుకుని.. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారని.. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల నష్టం జరిగిందని లూథ్రా హైకోర్టుకు తెలిపారు.   ఈ కేసులో ఆయనే మాస్టర్ మైండ్ అని పలువురు సాక్షులు తమ వాంగ్మూలంలో చెప్పారని.. అయితే మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సహకరించడం లేదన్నారు. ఆయనపై 8 కేసులు ఉన్నాయని.. ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కొట్టేయమని లూథ్రా వాదనలు వినిపించారు. అటు మిథున్‌రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి.. ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానంతో తన క్లైంట్ కు సంబంధం లేదని ఆయనకు షరతులతో కూడి బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిసిన వెంటనే తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. లిక్కర్ కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే మిథున్ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో అరెస్ట్ తప్పదన్న ప్రచారం మరింత జోరందుకుంది. 
Read More...
ఆంధ్రప్రదేశ్  క్రైమ్   Lead Story  అన్నమయ్య 

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9కి చేరిన మృతుల సంఖ్య!

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 9కి చేరిన మృతుల సంఖ్య! అన్నమయ్య జిల్లాలో ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతుల సంఖ్య 9కి చేరింది. ప్రమాదంలో ఐదు మంది మహిళలు, నలుగురు పురుషులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నేడు తొమ్మిది మంది మృతదేహాలకు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నారు. మృతులు అందరూ రైల్వే కోడూరు మండలం...
Read More...
ఆంధ్రప్రదేశ్  Featured  అన్నమయ్య  ఆంధ్రప్రదేశ్ మెయిన్  

రాయచోటిలో 'అల్‌ ఉమ్మా' ఉగ్రవాదులు.. పేలుళ్లకు కుట్ర భగ్నం

రాయచోటిలో 'అల్‌ ఉమ్మా' ఉగ్రవాదులు.. పేలుళ్లకు కుట్ర భగ్నం * ఇద్దరు అల్-ఉమ్మా ఉగ్రవాదుల భార్యలు అరెస్ట్‌ * నిందితుల ఇళ్లలో భారీగా పేలుడు పదార్థాలు* 14 రోజుల రిమాండ్.. కడప జైలుకు తరలింపు
Read More...
ఆంధ్రప్రదేశ్  అన్నమయ్య 

తలకోనలో తలదించుకునే పనులు

తలకోనలో తలదించుకునే పనులు అన్నమయ్య జిల్లా రాజంపేట పరిధిలోని అడవుల్లో అసాంఘిక కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. సహజ అందాలకు తలమానికంగా వున్న తలకోన ఫారెస్ట్‌ ఏరియాలోని నిషేధిత ప్రాంతాల్లో మందుబాబులు విందులతో చిందులేస్తున్నారు. నిజానికి తలకోన ఫారెస్ట్‌ను సందర్శించాలంటే పక్కాగా అధికారుల అనుమతి తీసుకోవాలి. మద్యం సేవించడం, గుమిగూడడం వంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. కానీ ఇటీవల కొంత కాలంలో...
Read More...
ఆంధ్రప్రదేశ్  అన్నమయ్య 

వీరబల్లి అటవీ ప్రాంతంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు..!

వీరబల్లి అటవీ ప్రాంతంలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు..! అన్నమయ్య జిల్లా వీరబల్లి అటవీ పరిధిలో 8 మంది ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 12 ఎర్రచందనం దుంగలతోపాటు ఒక మోటారు సైకిల్‌ను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్‌ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడి ఆదేశాల మేరకు, టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో.. డీఎస్పీ బాలిరెడ్డి...
Read More...
ఆంధ్రప్రదేశ్  వైఎస్ఆర్ కడప   అన్నమయ్య 

కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!

కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..! ఈదురు గాలుల దాటికి నేలరాలిన అరటి...మామిడి వడగండ్లతో తడిచిపోయిన ధాన్యం పులివెందుల నియోజకవర్గంలోనే రూ.10 కోట్ల మేర నష్టం గాలుల బీభత్సానికి కొట్టుకుపోయిన షెడ్లు
Read More...
ఆంధ్రప్రదేశ్  క్రైమ్   అన్నమయ్య 

వికారాబాద్ జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత

వికారాబాద్ జిల్లాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టివేత వికారాబాద్ జిల్లా టాస్క్‌ఫోర్స్ పోలీసులు యాలాల్ మండలంలోని బాగాయిపల్లి చౌరస్తాలో భారీగా నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. వ్యవసాయ భూమిలో అనుమానాస్పదంగా కనిపించిన ప్లాస్టిక్ సంచులను తనిఖీ చేయగా, వాటిలో నకిలీ విత్తనాలు ఉన్నట్లు గుర్తించారు. వెంటనే వాటిని యాలాల్ పోలీసులకు అప్పగించారు.ఈ మేరకు వ్యవసాయ అధికారి ఏవో శ్వేత రాణి అందించిన సమాచారం...
Read More...

Advertisement