తళ్లీ కూతుళ్లకు ఒక్కడే ప్రియుడు.. కూతురు పెళ్లైన నెలరోజులకు ఊహించని ట్విస్ట్.. రఘువంశీ కేసును తలదన్నే స్టోరీ

By PC RAO
On
తళ్లీ కూతుళ్లకు ఒక్కడే ప్రియుడు.. కూతురు పెళ్లైన నెలరోజులకు ఊహించని ట్విస్ట్.. రఘువంశీ కేసును తలదన్నే స్టోరీ

ఏపీలో మరో రాజా రంఘువంశీ తరహా ఘటన

పెళ్లైన నెలరోజులకే భార్య చేతిలో యువకుడి హతం

ప్రియుడితో కలిసి ఘాతుకానికి ఒడిగట్టిన భార్య

ఇటీవల మేఘాలయాలో జరిగిన రాజా రఘువంశీ హత్య కేసు (Raja Raghuvansi Case) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. పెళ్లైన 10 రోజులకే హనీమూన్‌ కు తీసుకెళ్లిన భర్తను భార్యే దగ్గరుండి ప్రియుడి సాయంతో అత్యంత దారుణంగా హత్యచేయించింది. అలాంటి ఘటనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో చోటు చేసుకుంది. ప్రియుడిపై మోజుతో ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్న భర్తనే మట్టుబెట్టిందో భార్య. చివరికి పాపం పండి పోలీసులకు దొరికిపోయింది. వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణ (Telangana) లోని గద్వాలకు చెందిన గంటా తేజేశ్వర్ ప్రైవేట్ సర్వేయర్ గా పనిచేస్తున్నాడు. కర్నూలు జిల్లా కల్లూరుకు చెందిన ఐశ్వర్య బ్త్యూటీషియన్ గా పనిచేస్తోంది.  ఈ ఏడాది ఫిబ్రవరిలో వీళ్లిద్దరికీ పెళ్లి కుదిరింది. ఆ తర్వాత సంబంధం నచ్చకపోవడంతో తేజేశ్వర్ కుటుంబ సభ్యులు పెళ్లిని క్యాన్సిల్ చేశారు.

ఐతే అప్పటికే ఆమెతో ప్రేమలో ఉన్న తేజేశ్వర్.. పట్టుబట్టి తల్లిదండ్రులను ఒప్పించి మే 18న ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఈనెల 17న ఇంట్లో నుంచి బయటకు వెళ్లి ఎంతకూ తిరిగిరాలేదు. ఆ తర్వాతి రోజున తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఈనెల 21న నంద్యాల జిల్లా పాణ్యం మండలం పిన్నాపురం సమీపంలో గాలేరు-నగరి  కాలువలో తేజేశ్వర్ మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మిస్సింగ్ కేసును హత్య కేసుగా మార్చి దర్యాప్తు చేయగా.. సంచలన విషయాలు వెలుగులోకి వచ్చింది. జరిగినదంతా తెలుసుకోని షాక్ అవ్వడం పోలీసుల వంతైంది. 

ఈ కేసులో తేజేస్వర్ భార్య ఐశ్వర్య తల్లి సుజాత.. కర్నూలులోని ఓ బ్యాంకులో స్వీపర్ గా పనిచేస్తోంది. ఈ క్రమంలో బ్యాంక్ మేనేజర్ తిరుమలరావుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కొన్నాళ్లకు తిరుమలరావు ఐశ్వర్యతో కూడా అక్రమ సంబంధం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో తేజేశ్వర్ ను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా ఐశ్వర్య ప్రియుడితో ఫోన్లో మాట్లాడుతుండేది. ఈ విషయమై ఇరువురి మధ్య గొడవలు జరిగాయి. దీంతో ప్రియుడితో తన సుఖానికి భర్త అడ్డొస్తున్నాడని భావించి అతడ్ని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. ఈ విషయాన్ని ప్రియుడితో చెప్పగా ఆమె తల్లి కూడా సరేనంది. 

దీంతో తేజేశ్వర్ ను చంపేయాలని స్కెచ్ వేసిన ముగ్గురూ..  తేజేశ్వర్ కు స్నెహితులతో ఫోన్ చేయించి ల్యాండ్ సర్వే చేయాలని చెప్పించారు. అనంతరం అతడిని కారు ఎక్కించుకొని కత్తితో గొంతుకోసి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని కాలువలో పడేసి పరారయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు సెల్ ఫోన్ సిగ్నల్స్, సీసీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేసి తిరుమలరావు, ఐశ్వర్య, ఆమె తల్లి సుజాత ఈ ఘాతుకానికి పాల్పడ్డట్లు నిర్ధారించారు. తేజేశ్వర్ తో పెళ్లయిన తర్వాత ఐశ్వర్య తన ప్రియుడితో ఏకంగా 2000 సార్లు ఫోన్లో మాట్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో చేరింది. ఈ హత్యలో మరికొందరి హస్తం ఉన్నట్లు భావిస్తున్న పోలీసులు మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నారు. 

Advertisement

Latest News

ఆ పసివాడిది గట్టి గుండె..! అమ్మ కోసం ఏం చేశాడంటే..! ఆ పసివాడిది గట్టి గుండె..! అమ్మ కోసం ఏం చేశాడంటే..!
'బతుకు బండి'ని నిలబెట్టిన పదేళ్ల బాలుడు కలెక్టర్‌ను కదిలించిన పసివాడి జీవనపోరాటం అమ్మ చనిపోదామంటోందంటూ జరిగినదంతా వెల్లడి పోషణ భారమైన కుటుంబానికి పెద్దదిక్కులా నిలబడిన యశ్వంత్
ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం