ట్రంప్ కు షాక్.. ఎలన్ మస్క్ కొత్త పార్టీ ఇదే..!

By PC RAO
On
ట్రంప్ కు షాక్.. ఎలన్ మస్క్ కొత్త పార్టీ ఇదే..!

* అమెరికాలో కొత్త పార్టీ అవసరమంటున్న ఎలన్ మస్క్
* ఎలన్ మస్క్ పార్టీతో ప్రయోజనం ఉండదన్న ప్రచారం
* మస్క్ జన్మ:తహా అమెరికన్ కాకపోవడం మైనస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ మధ్య వైరం అంతకంతకూ పెరుగుతోంది. మొన్నటి వరకు ఎంతో సన్నిహితంగా మెలిగిన ఈ ఇద్దరి మధ్య ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్ విభేదాలకు కారణమైంది. ఒకవేళ అమెరికా సెనేట్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమని మస్క్ ప్రకటించారు. 

బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమలులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహన సబ్సిడీలు రద్దవుతాయి. ఇప్పటికే ఎలన్ మస్క్ తన టెస్లా కంపెనీ ద్వారా తీసుకువస్తున్న  ఈవీ కార్లకు పెద్ద దెబ్బ అని భావిస్తున్నారు. అందుకే మస్క్ ఇలా ఎదురుదాడి చేస్తూ ట్రంప్ ను మస్క్ బెదిరిస్తున్నారన్న ప్రచారం ఉంది.. గతంలో సొంత పార్టీపై ఎక్స్ లో పోల్ నిర్వహించినపుడు 80 శాతం మంది కొత్త పార్టీ పెట్టాలన్నారు. దీంతో అప్పుడు ఎలన్ మస్క్ ఆ పార్టీ పేరు 'ది అమెరికా పార్టీ' అని ప్రతిపాదించారు.

అయితే అమెరికాలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం అనేది అంత సులవైన విషయం కాదు. అది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. దీనికితోడు ద్విపార్టీ వ్యవస్థ ఆధిపత్యాన్ని కొత్తగా ఏర్పాటు చేయబోయే పార్టీ ఎదుర్కోవడం అంత సులువేం కాదు. ఒకవేళ కుబేరుడైన మస్క్ చెప్పినట్టే పార్టీ పెట్టి... అమెరికన్లు ఆయన పార్టీని స్వాగతించినా.. జన్మ:తహా ఎలాన్ మస్క్ అమెరికన్ కానందువల్ల అధ్యక్షుడు అయ్యే అవకాశం లేదు.  

Advertisement

Latest News