భూదాన్ భూముల్లో ప్రహరీ నిర్మాణం.. కోర్టులో దిక్కరణ పిటిషన్ దాఖలు
హైదరాబాద్: ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భూముల
వ్యవహారంలో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. హైకోర్టు స్టే విధించినా ప్రహరీగోడ నిర్మిస్తున్నారంటూ బిర్ల మల్లేశ్ అనే వ్యక్తి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. రంగారెడ్డి కలెక్టర్తోపాటు ప్రతివాదులుగా ఉన్న ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది.మహేశ్వరం మండలం నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూదాన్ భూములను ఆక్రమించారంటూ పిటిషన్ దాఖలు కాగా.. ఆయా భూములకు సంబంధించి లావాదేవీలు జరపొద్దని, వాటిని నిషేధిత జాబితాలో చేర్చాలని హైకోర్టు ఆదేశించింది. కోర్టును ఆదేశించినా ప్లాట్ల చుట్టూ ప్రహరీగోడ నిర్మిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవా కోర్టుకు ఫొటోలను అందించారు. దీనిపై నివేదిక ఇవ్వాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ను హైకోర్టు ఆదేశించింది.