బ్రతుకు దెరువు కోసం బస్సెక్కాడు.. కానీ అదే బస్సు కిందపడి..

By PC RAO
On
బ్రతుకు దెరువు కోసం బస్సెక్కాడు.. కానీ అదే బస్సు కిందపడి..

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో విషాదం

స్కూల్ బస్సు కింద పడి క్లీనర్ మృతి

సూళ్లూరుపేట పట్టణంలోని షార్ బస్టాండ్ సమీపంలో సోమవారం ఉదయం విషాదకర ఘటన చోటుచేసుకుంది. టైనీ టాట్స్ అనే ప్రైవేట్ పాఠశాల బస్సు ప్రమాదవశాత్తూ అదే బస్సులో పని చేస్తున్న క్లీనర్ కొమ్మల చంద్రయ్య  అదే బస్సు కింద పడటంతో, తీవ్ర గాయాల వల్ల చికిత్స పొందుతూ ఆయన మృతిచెందాడు. తడ మండలంలోని బోడిలింగలపాడు గ్రామానికి చెందిన చంద్రయ్య బస్సు దగ్గర విధులు నిర్వర్తిస్తున్న సమయంలో, డ్రైవర్ మలుపు తీసే క్రమంలో ఆయన అకస్మాత్తుగా బస్సు నుంచి జారిపడినట్లు తెలుస్తోంది. దీంతో ముందు చక్రం ఆయన కాళ్ళ పై నుంచి వెళ్లిపోయింది. తలకు తీవ్ర గాయాలు, కుడి కాలికి ఎముకలు విరిగినట్లు సమాచారం.

తక్షణమే ఆయనను సుల్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమంగా ఉండటంతో నెల్లూరులోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చంద్రయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యంగా వాహనం నడిపిన విషయమై సీసీటీవీ దృశ్యాల్లో స్పష్టంగా కనిపించినట్లు వారు చెబుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

ఈ ప్రమాదం పట్ల పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. "ఈ ప్రమాదం పిల్లలకు జరిగి ఉంటే పరిస్థితి ఎలా ఉండేది?" అనే ప్రశ్నలతో స్కూల్ యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం తరఫున డ్రైవర్లకు సరైన అవగాహన లేకపోవడం, నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Latest News

ఆ పసివాడిది గట్టి గుండె..! అమ్మ కోసం ఏం చేశాడంటే..! ఆ పసివాడిది గట్టి గుండె..! అమ్మ కోసం ఏం చేశాడంటే..!
'బతుకు బండి'ని నిలబెట్టిన పదేళ్ల బాలుడు కలెక్టర్‌ను కదిలించిన పసివాడి జీవనపోరాటం అమ్మ చనిపోదామంటోందంటూ జరిగినదంతా వెల్లడి పోషణ భారమైన కుటుంబానికి పెద్దదిక్కులా నిలబడిన యశ్వంత్
ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం