ప్రభుత్వ హాస్టల్లో కలకలం.. 16 మంది విద్యార్థులకు అస్వస్థత

By PC RAO
On
ప్రభుత్వ హాస్టల్లో కలకలం.. 16 మంది విద్యార్థులకు అస్వస్థత

శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో కలకలం

ఫుడ్ పాయిజన్‌తో విద్యార్థులకు అస్వస్థత

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు

తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి బీసీ బాలుర హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. 16 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం యథావిధిగా హాస్టల్లో టిఫిన్ చేసి పాఠశాలకు వెళ్లిన విద్యార్థులు వాంతులు చేసుకున్నారు. దీంతో వారిని శ్రీకాళహస్తి ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం మాజీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు అంజూరు తారక శ్రీనివాసులు,  వైసీపీ నేత వడ్ల తాంగల్ బాలాజీ రెడ్డి చిన్నారులను పరామర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న చికిత్స గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గ వైయస్సార్సీపి యువజన సంఘం అధ్యక్షుడు శ్రీవారి సురేష్, ఉమ్మడి చిత్తూరు ప్రధాన కార్యదర్శి బాలిశెట్టి విజయ్ శేఖర్, పెరుమాళ్ చౌదరి మరియు విద్యార్థి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Advertisement

Latest News