ఆ పసివాడిది గట్టి గుండె..! అమ్మ కోసం ఏం చేశాడంటే..!

By PC RAO
On
ఆ పసివాడిది గట్టి గుండె..! అమ్మ కోసం ఏం చేశాడంటే..!

'బతుకు బండి'ని నిలబెట్టిన పదేళ్ల బాలుడు

కలెక్టర్‌ను కదిలించిన పసివాడి జీవనపోరాటం

అమ్మ చనిపోదామంటోందంటూ జరిగినదంతా వెల్లడి

పోషణ భారమైన కుటుంబానికి పెద్దదిక్కులా నిలబడిన యశ్వంత్

బడికెళ్లడం...ఆడుకోవడం మాత్రమే తెలిసిన పదేళ్ల పసి వయసు. కానీ, అందరి పిల్లల్లా కాకుండా పోషణే భారంగా గడిచే ఆ కుటుంబానికి పెద్ద దిక్కయ్యాడు. తల్లి చెప్పిన విషయాలన్నీ తెలుసుకుని ఒంటరి పోరాటం మొదలుపెట్టాడు. గుంటూరు జిల్లాలో ప్రతి సోమవారం కలెక్టర్ నాగలక్ష్మి నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికకు తాను స్వయంగా వెళ్లి తన సమస్యను విన్నవించి పరిష్కరించుకున్నాడు. ఇటీవల ట్రాఫిక్ సమస్యలు, రోడ్డు విస్తరణ కారణాలతో నగరపాలక సంస్థ అధికారులు జీజీహెచ్ వద్ద ఉన్న వాళ్ల టిఫిన్ బండి తొలగించారని, కొంతమంది ప్రజాప్రతినిధుల సిఫారసుతో బండ్లను మళ్లీ ఏర్పాటు చేసేకున్నారని, వారికి మాత్రం అనుమతి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని కలెక్టర్ ముందు వాపోయాడు. 

తనకు గుండె జబ్బు ఉందని, 16 ఏళ్ల తర్వాతే ఆపరేషన్ చేస్తారని..తన మందులకే నెలకు రూ.6వేలు కావాలని కష్టాలను చెప్పి పెంచిన తల్లి మాటలను యథాతథంగా కలెక్టర్ ముందు మొరపెట్టుకున్నాడు. బాలుడి విజ్ఞాపన కదిలించడంతో కలెక్టర్ నాగలక్ష్మి బాలుడు అడిగిన చోటే బండి ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. కష్టపెట్టకపోయినా పర్వాలేదు ప్రతి ఒక్కరూ పిల్లలని తమ కష్టాల్ని తెలిసేలా పెంచడం అవసరం. కాదంటారా?

Advertisement

Latest News