విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

On
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ

  • విద్యావ్యవస్థ కోసం తక్షణమే రూ. 20కోట్ల నిధులకు డిమాండ్
    అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖ
    విద్యను వ్యాపారం చేసే ప్రజాప్రతినిధులకు పోటీ అవకాశం ఇవ్వొద్దు
    సీఎంపై వత్తిడి చేయండి.. విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని డిమాండ్

Screenshot_20250701_120111_Samsung Notesప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం తక్షణమే 20 వేల కోట్లు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ.. మావోయిస్టు తెలంగాణ కమిటీ డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వాలు కనీస చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల సమయంలో చాలా హామీలు ప్రకటిస్తూ పాలనలోకి రాగానే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్య అంగట్లో సరకు అయినది. పేద ప్రజలకు విద్య కొనుగోలు వస్తువుగా మారింది. జనాభా పెరుగుదలకు తగినట్లుగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను పెంచకపోవడం వలన విద్య ప్రైవేట్ రంగం ద్వారా కొనుక్కోవలసిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ విద్యను పాలకులు ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారని లేఖలో మండిపడ్డారు. విద్యా వ్యాపారాన్ని అభివృద్ధి చేయడానికి రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి. రాజకీయ నాయకులు సొంతంగా పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేస్తూ పెద్దఎత్తున వ్యాపారం చేస్తున్నారు. విద్యా వ్యాపారం చేస్తున్న వారికి ప్రజాప్రతినిధులుగా పోటీ చేసే అవకాశం ఉండకూడదు. ప్రభుత్వ వసతి గృహాలన్ని అరకొరవసతులతో ఉన్నవి. ప్రభుత్వ వసతి గృహాలలో మొత్తం విద్యార్థులలో 5% విద్యార్థులకు కూడా వసతి సౌకర్యంలేదన్నారు. ప్రైవేట్ విద్యా సంస్థలు వ్యాపారం చేసుకోవడానికి ఫీజ్ రియంబర్స్మెంట్ ను ఏర్పాటు చేసి ప్రభుత్వ విద్యాసంస్థలను కనుమరుగు చేస్తున్నారు. ఫీజ్ రియంబర్స్మెంట్ సదుపాయం కాకుండా విద్యార్థుల అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ విద్యా సంస్థలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, పీజీ విద్యాసంస్థలకు తక్షణమే ప్రభుత్వం నూతన భవనాలు నిర్మించి శాస్త్రీయ, ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు ఉపయోగపడే కొత్త కోర్సులతో పాఠ్యాంశాలు రూపొందించాలి, 

ప్రభుత్వ విద్య 80% గా, ప్రభుత్వ నియంత్రణతో కూడిన ప్రైవేట్ విద్య 20% మించకూడదు. ప్రస్తుతం ప్రభుత్వ విద్యావకాశాలు పొందుతున్న వారు 31% కాగా ప్రైవేట్ విద్యావకాశాలు పొందుతున్నవారు 69% ఉన్నారు. వృత్తివిద్యా కోర్సులన్నీ ప్రభుత్వ విద్యాసంస్థలలోనే ఉండాలి,  ప్రభుత్వ విద్యాసంస్థలలో చదువుకున్న వారికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేటప్పుడు కనీసం 25% అదనంగా సదుపాయం కల్పించాలి. భారతదేశంలో ఇప్పటికీ ఆదివాసి, గిరిజనులలో 22% మాత్రమే అక్షరాస్యత ఉన్నది. ఇది పాఠశాల విద్య, ఉన్నత విద్యలో 5% మించలేదు. దళితులలో ఇప్పటికీ అక్షరాస్యత సుమారు 41% గా ఉన్నది. ఇది పాఠశాల విద్యలో 8% మించలేదు. ఒకటి రెండు రాష్ట్రాలలో తప్ప అన్ని రాష్ట్రాలలో దాదాపు ఇదే పరిస్థితి ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లో విద్యారంగానికి చాలా తక్కువ బడ్జెట్ కేటాయిస్తున్నది. అత్యంత ప్రాధాన్యతా రంగాలైన విద్య, వైద్య, సంక్షేమ, వ్యవసాయ రంగాలకు ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారు. విద్యారంగ నిపుణులు ఎంత మొత్తుకుంటున్నగాని బడ్జెట్ లో 5% మాత్రమే విద్యకు కేటాయిస్తున్నారు. కనీసం 20% కేటాయించాలని విద్యార్థులు, బుద్ధిజీవులు డిమాండ్ చేస్తున్నారు. మాతృభాషా బోధనతో పాటు ఇంగ్లీష్ బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలి. RSS BJP మనువాదుల NEP ప్రతిపాదనలను ఎండగట్టాలి మరియు రద్దు చేసుకునే వరకు ఉద్యమాలు చేయాలి. అధ్యాపక, అధ్యాపకేతర ఖాళీలను వెంటనే భర్తీ చేయాలి. నూతనంగా ప్రారంభించిన మోడల్, కస్తూర్భాగాంధీ, సోషల్ వెల్ఫేర్ మరియు అన్ని రకాల గురుకులాలలో నియామకమైన కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, గెస్ట్ ఫ్యాకల్టీ సిబ్బందిని వెంటనే పర్మినెంట్ చేసి విద్యార్థులకు పూర్తిస్థాయిలో బాధ్యతగా వృత్తి ధర్మాన్ని నిర్వహించే చేయాలని డిమాండ్ చేశారు. 
ఆకునూరి మురళి, ప్రో. కొదండరాం, అద్దంకి దయాకర్, డా. మహమ్మద్ రియాజ్ మీరందరూ ముఖ్యమంత్రికి సలహాలు, సూచనలు ఇస్తూ సంప్రదింపులు చేసి ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని జగన్ డిమాండ్ చేశారు.

Advertisement

Latest News

ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై...
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం