పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.

On
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.

  • ఓ పథకం ప్రకారం ఆమెకు దగ్గరైన
    నమ్మకం కోసం కేటిఆర్, కవిత, సంతోష్ కుమార్ ని కల్పించా
    అలా నాలుగేళ్లు ఆమెతో వున్నాను..
    చనిపోతా అంటే నచ్చినట్లు చేయమన్న
    పూర్ణచందర్ రావు రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు..

20250701_102928By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్.
యాంకర్ స్వేచ్ఛ సూసైడ్ కేసులో అనేక విషయాలు వెలుగు చూశాయి. నిందితుడు పూర్ణచందర్ రావు రిమాండ్ రిపోర్ట్ లో పోలీసులు  కీలక అంశాలను పొందు పరిచారు. స్వేచ్ఛ భర్త దూరమైన విషయం తెలుసుకున్న పూర్ణ పథకం ప్రకారం ఆమెకు దగ్గరయ్యాడు. తనని పెళ్లి చేసుకుంటా అని, ఆమె కూతురిని చక్కగా చూసుకుంటా అంటూ వాగ్దానాలు చేశాడు. తనపై నమ్మకం కలిగేలా స్వేచ్ఛను తన మిత్రులు, ఆఫీస్ స్టాఫ్, కల్వకుంట్ల కవిత,  కేటిఆర్ కి, ఎంపీ సంతోష్ కుమార్ అలా చాలామందికి  పరిచయం చేశాడు. దీనితో పూర్ణచందర్ రావుపై ఆమెకు కొద్దిగా నమ్మకం కుదిరింది.  అలా ఆమెను నమ్మించి దగ్గరై నాలుగేళ్ళ పాటు సంబంధం కొనసాగించాడు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేసినప్పుడు పూర్ణ తప్పించుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాడు. ఆమెను చూసిచూడనట్లు వ్యవహరించడం, కాల్స్ కట్ చేయడం వంటివి చేశానని నిందితుడు పోలీసుల ఎదుట వాగ్మూలం ఇచ్చాడు. అవసరం తీరాక పూర్ణ మోసం చేయడంతో తట్టుకోలేక స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకుంది.  చనిపోయే ముందు కూడా ఆమె తనకు కాల్ చేసి అరగంటలో ఇంటికి రాకపోతే తానే ఆఫీసుకి వస్తా అని చెప్పడంతో వద్దని వారించానాని, ఇన్ని సంవత్సరాలు మమ్మల్ని వదలకుండా ఉన్నావు, పెళ్లి చేసుకుంటానని,  నన్నూ నా కూతురినీ చూసుకుంటానని చెప్పావు. ఇప్పుడు నీవు పెళ్లి చేసుకోకపోతే మాకు చనిపోవడం తప్ప మార్గం లేదు అని చెప్పిన   తానుస్పందించలేదని  "మీకేం చేయాలనిపిస్తే చేయండి, చనిపోవాలనుకుంటే చచ్చిపోండి" అని అనడంతో  ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లిందని పూర్ణ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. తరువాత స్వేచ్చ తండ్రికి కాల్ చేసి పిలిపించుకుంది. స్కార్ప్స్, పాపకు బుక్స్ కొనిచ్చి రాత్రి 8 గంటలకు  ఇంటి గేటు ముందు దింపి ఆమె తండ్రి వెళ్ళిపోయాడు. ఆతరువాత స్వేచ్ఛ తలుపులు తీయడం లేదని వాచ్ మెన్ మరో వ్యక్తి తలుపు బద్దలు కొట్టి చూసేసరికి ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. స్వేచ్ఛ సూసైడ్ చేసుకునేందుకు పూర్ణ ప్రోత్సహించినట్లు, ఆమెను మోసం చేయడంతో చనిపోయినట్లు పోలీసులు దృవీకరీంచారు. నిందితుడి నేరాంగీకార పత్రాన్ని కోర్ట్ లో సమర్పించారు.

Advertisement

Latest News

ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు ఆ అధికారుల ఫొటోలు ట్యాంక్ బండ్ మీద పెట్టండి.. హైకోర్టు
హైదరాబాద్: అక్రమ నిర్మాణాలపై అధికారుల తీరు పట్ల తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు  చేసింది. అక్రమ నిర్మాణాల పట్ల చర్యలు తీసుకోని అధికారుల ఫోటోలను ట్యాంక్ బండ్‌పై...
విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం