తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత..!

By TVK
On
తీన్మార్ మల్లన్న వర్సెస్ ఎమ్మెల్సీ కవిత..!

* తెలంగాణలో బీసీల చుట్టూ రాజకీయం
* కవితపై తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల దుమారం
* ఆగ్రహంతో ఆఫీసులపై జాగృతి కార్యకర్తల దాడి
* కాల్పులు జరిపిన మల్లన్న గన్ మెన్
* రక్తసిక్తమైన మల్లన్న కార్యాలయం
* మండలి చైర్మన్ కు మల్లన్నపై కవిత ఫిర్యాదు

ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న మరోసారి తన నోటిదురుసు వ్యాఖ్యలతో తెలంగాణ రాజకీయాల్లో రచ్చకు కారణమయ్యారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై మల్లన్న చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఓ మీటింగ్ లో మల్లన్న మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తోందని.. ఈ విషయంలో ఎమ్మెల్సీ కవితకు ఏం సంబంధమని ప్రశ్నించారు. ఆమె బీసీనే కాదు.. మరి ఆమెకు బీసీలతో 'కంచం పొత్తు ఉందా..? మంచం పొత్తు ఉందా?' అంటూ మల్లన్న వ్యాఖ్యానించారు. 

నిజానికి మల్లన్న చట్ట సభల్లో ప్రతినిధిగా ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా అభ్యంతరకరం. ఒక మహిళా నాయకురాలిని ఉద్దేశించి ఇంత దారుణంగా వ్యాఖ్యానించడం తప్పు. అసలే మల్లన్నపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న తెలంగాణ జాగృతి కార్యకర్తలు, కవిత అనుచరులు హైదరాబాద్‌ మేడిపల్లిలోని మల్లన్న చానల్ ఆఫీసుపై దాడికి దిగారు.  గట్టిగా నినాదాలు చేస్తూ కార్యాలయ గేట్లు ధ్వంసం చేసి లోపలికి చొచ్చుకుపోయారు. కార్యాలయంలోని ఫర్నిచర్‌ ధ్వంసం చేశారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో తీన్మార్ మల్లన్నకు సెక్యూరిటీగా ఉన్న గన్‌మెన్ ఐదు రౌండ్ల కాల్పులు జరపడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దాడి ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గన్ మెన్ కాల్పులతో కార్యాలయం రక్తసిక్తమైంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. మల్లన్న గన్‌మెన్ కాల్పుల అంశాన్నీ పరిశీలిస్తున్నట్టు సమాచారం. 

తన వ్యాఖ్యలను సమర్థించుకున్న మల్లన్న
మరోవైపు దాడి ఘటనపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న స్పందించారు. హత్యాయత్నాలతో బీసీ ఉద్యమాన్ని అణచలేరన్నారు. కవిత కుటుంబం మాపై హత్యాయత్నానికి పాల్పడిందని మల్లన్న ఆరోపించారు. ఇక నుంచి మేం కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. మీరో, మేమో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. తెలంగాణలో కంచం-మంచం అనేది ఊతపదం అన్నారు. తాను చేసిన వ్యాఖ్యలకు ఇంకా కట్టుబడే ఉన్నానని.. ఏం తప్పు మాట్లాడానో ప్రజలు నిర్ణయిస్తారన్నారు. ఇలా రౌడీల్లా దాడి చేయడమే కాకుండా.. నామీదే కేసు పెట్టారు. నా ఆఫీస్‌లో నా రక్తం కళ్లజూశారు. ఈ రక్తం మరకలతోనే ప్రజల్లోకి వెళ్తామని మల్లన్న ప్రకటించారు. కవిత అనుచరుల దాడిలో తన చేతికి గాయమైందని.. గన్‌మెన్‌ నుంచి తుపాకీ లాక్కుని కాల్పులు జరిపేందుకు వారు ప్రయత్నించారని మల్లన్న ఆరోపించారు.  

మండలి చైర్మన్ కు కవిత ఫిర్యాదు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై చేసిన వ్యాఖ్యలపై శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన కవిత మల్లన్నపై ఫైర్ అయ్యారు. మల్లన్న బీసీ అయినంత మాత్రాన ఏదైనా మాట్లాడతానంటే కుదరదని కవిత హెచ్చరించారు. నన్ను బయట తిరగనివ్వను అనటానికి మల్లన్న ఎవరని ఆమె ప్రశ్నించారు. ఆడబిడ్డలు అనుకుంటే మల్లన్న ఇంట్లో నుంచి బయటకురాడని హెచ్చరించారు. పరుష పదజాలాన్ని తెలంగాణ ప్రజలు క్షమించరని.. వెంటనే తీర్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు. మల్లన్నపై జాతీయ మహిళా కమిషన్ కు కూడా ఫిర్యాదు చేస్తామని.. మండలి చైర్మన్ మల్లన్నను ఎమ్మెల్సీగా డిస్ క్వాలిఫై చేయాలన్నారు. తనపై చేసిన వ్యాఖలకు ఆవేశం వచ్చిన కొందరు జాగృతి కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపితే.. కాల్పులు జరుపుతారా? అని కవిత ప్రశ్నించారు.

Advertisement

Latest News

దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..! దంచికొట్టిన వాన.. హైదరాబాద్ అతలాకుతలం..!
నగరాన్ని ముంచెత్తిన వానఆరెంజ్‌ అలర్ట్‌ ఇచ్చిన వాతావరణశాఖభారీ నుంచి అతిభారీ వర్షం పడే ఛాన్స్రోడ్లపైకి వరద నీరు.. భారీగా ట్రాఫిక్‌ ట్రాఫిక్ కష్టాలతో జనజీవనం అస్తవ్యస్తం  
వేల ఎన్ కౌంటర్లు..వందల మంది హతం..తప్పు చేస్తే అక్కడంతే!
మిథున్ రెడ్డికి సుప్రీం కోర్టు షాక్.. మద్యం కేసులో అరెస్టుకు రంగం సిద్ధం!
దేశవ్యాప్తంగా బిల్లులు బెంబేలెత్తిస్తుంటే అక్కడ మాత్రం ఫ్రీ కరెంట్!
తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!