టాలీవుడ్‌లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత

By TVK
On
టాలీవుడ్‌లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత

తెలుగు చిత్రసీమలో రెండు రోజుల క్రితం విలక్షణ నటుడు కోటాశ్రీనివాసరావు మరణం వార్త మర్చిపోకముందే మరో విషాదకర సంఘటన జరిగింది. హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు. కొంత కాలంగా వ‌యోభారం, అనారోగ్య స‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డుతున్న రాజగోపాల్ రాజు హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో మరణించారు. రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు. హీరో రవితేజ పెద్ద కుమారుడు. రెండో కుమారుడు భరత్‌. ఆయన  2017లో కారు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మరో కుమారుడు రఘు నటుడిగా పలు సినిమాల్లో కనిపించారు.

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేటలో జన్మించిన రాజగోపాల్‌ రాజు ఫార్మాసిస్ట్‌గా పనిచేసేవారు. ఉద్యోగరీత్యా ఉత్తర భారతదేశంలోనే ఎక్కువకాలం పనిచేశారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు రాకముందు రవితేజ కూడా జైపుర్‌, దిల్లీ, ముంబయిల్లో ఉన్నారు. రవితేజ తండ్రి మరణంపై టాలీవుడ్ లోని పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు.

Advertisement

Latest News