చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!

By TVK
On
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!

  • రేవంత్ రెడ్డీ.. నాపై డ్ర‌గ్స్ కేసు న‌మోదైందా..?
  • ద‌మ్ముంటే ఆధారాలు బ‌య‌ట‌పెట్టమని కేటీఆర్ సవాల్
  • నిరాధార ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలి
  • మిమ్మల్ని కోర్టుకు లాగుతానని కేటీఆర్ హెచ్చరిక

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో తనపై విచారణ జరుగుతోందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి ఆధారాలేంటో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.  తనపై ఎక్కడైనా కేసు నమోదైందా? కనీసం కొంతైన రుజువులున్నాయా? సీఎంకు దమ్ముంటే ఆధారాలు చూపించాలని సవాల్ విసురుతున్నానని ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి మీడియా చిట్‌చాట్ పేరుతో తనపైనా, ఇతరులపైనా విషం చిమ్మడం ఇది తొలిసారి కాదని.. సీఎం కార్యాలయానికి గౌరవం ఇచ్చి సంయమనంతోఉన్నట్టు కేటీఆర్ తెలిపారు.

హైదరాబాద్‌లో తనతో చర్చకు వచ్చే దమ్ములేక ఢిల్లీ వెళ్లి మరీ నాపై బురద జల్లుతున్నారని.. కేవలం చట్టం పరిధి నుంచి న్యాయస్థానాల పరిధి నుంచి తప్పించుకోవడానికే రేవంత్ రెడ్డి చిట్‌చాట్‌ పేరుతో దొంగచాటు మాటలు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ అసత్యపూరిత, దురుద్దేశపూర్వక నిందలకు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని..  నిరాధార ఆరోపణలకు వెంటనే క్షమాపణ చెప్పాలి. లేదంటే రేవంత్‌రెడ్డి.. మిమ్మల్ని కోర్టుకు లాగుతా. క్షమాపణ చెప్పకపోతే పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కేటీఆర్ హెచ్చరించారు. 

Advertisement

Latest News

నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!  నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
66 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు చైర్మన్లుజనసేనకు 9, బీజేపీకి 4  చైర్మన్ల పదవులుబీసీలకు 17, ఎస్సీ 10, ఎస్టీ 5, మైనారిటీలకు 566 మార్కెట్ కమిటీ చైర్మన్లలో...
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?
కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం
రాయుడు హత్య కేసులో రూ.30లక్షల ఆఫర్.. పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు..? రాయుడి చెల్లెలు ప్రశ్నలు
అడవిని మింగేస్తున్న బొగ్గు బట్టీలు..! తగ్గిపోతున్న వృక్ష సంపద
బాలయ్య స్క్విడ్ గేమ్ ఆడితే..అంతా దబిడిదిబిడే!