రేవంత్ రెడ్డికి వాస్తు భయం.. కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో చర్చకు సిద్ధమా?
* రేవంత్ పై ఎమ్మెల్సీ కవిత ఫైర్
* వాస్తు భయంతోనే సెక్రెటేరియట్ కు వెళ్లడం లేదన్న కవిత
* ఇప్పటికే సీఎం చాంబర్ లో మార్పులు
సీఎం రేవంత్ రెడ్డికి వాస్తు భయం పట్టుకుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆరోపించారు. వాస్తు భయంతోనే రేవంత్ రెడ్డి సచివాలయానికి రావడం లేదని.. మీడియా ముందు మాత్రం సవాళ్లు విసురుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో కవిత విమర్శించారు. రేవంత్ రెడ్డి ఒక్కసారైనా 'జై తెలంగాణ' అన్నారా అని ప్రశ్నించారు. సెక్రటేరియట్ వాస్తు బాగలేదని, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులతో, అధికారులతో సమావేశాలు పెడుతున్న సీఎంను అడుగుతున్నారు. మహిళలకు ఇచ్చిన హమీలపై పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే చర్చ పెడుదామని, నిజంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేస్తే చర్చకు సిద్దపడాలని కవిత సవాల్ విసిరారు.
నిజంగానే రేవంత్ కు వాస్తు భయమా?
రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నపుడు కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కానీ కేసీఆర్‌ని, బిఆర్ఎస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం రేవంత్ రెడ్డికి వాస్తు భయాలు మొదలైనట్టు కనిపించాయి. అందుకే తెలంగాణ సచివాలయంలో వాస్తురీత్యా మార్పులకు రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సెక్రెటేరియట్ లోకి సీఎం ఎంట్రీ రూట్ కూడా మార్చారు. సెక్రటేరియట్‌లోని సీఎం కార్యాలయం 6వ అంతస్తు నుంచి 9వ అంతస్తుకు మారింది.
అయినా రేవంత్ రెడ్డిలో భయం పోయిన్నట్టు లేదు. ఇప్పటికీ బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ నే తన శాఖలపై సమీక్షలతోపాటు సెంటర్‌లోనే మంత్రులు, అధికారులతో అధికారిక సమావేశాలు నిర్వహిస్తున్నారు. వందల కోట్లు ఖర్చు చేసి కొత్తగా నిర్మించిన సచివాలయంలో రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో కీలకమైన సమావేశాలు నిర్వహిస్తుండటం గమనిస్తే వాస్తు భయం ఉందన్న ప్రచారం నిజమేనన్న వాదన ఉంది.