తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!

By Dev
On
తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!

ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రోత్సహించడం కోసమే ప్రభుత్వాలు అమ్మఒడి, తల్లికి వందనం పేర్లతో అమ్మల ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నాయి. ప్రతి పథకంలో రాజకీయం ఉన్నప్పటికీ..ఉద్దేశం ఏదైనా లక్ష్యం మంచిదే. కానీ, తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి బిడ్డకు రూ.13వేలు సమకూరుతుండడంతో తల్లిదండ్రులు ప్రభుత్వ స్కూళ్లు కాకుండా ప్రైవేట్ వైపు దారి మళ్లుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇంట్లో ఉన్న పిల్లలు ఎంత మంది ఉన్నా డబ్బులు ఇస్తుండడంతో అందరినీ  ఫీజులు ఇంకొంచెం కష్టపడి మరికొంత కట్టుకునైనా కార్పొరేట్ స్కూళ్లలో చదివించాలనుకునే తల్లిదండ్రుల సంఖ్య ఎక్కువవుతోంది. తద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా తగ్గుతోంది. బడులకు వెళ్లే విద్యార్థులు భారీగా బారులు తీరుతున్నారని ప్రభుత్వం చెప్పుకుంటున్న విషయం వాస్తవమే కానీ, వారంతాప్రభుత్వ బడులకు వెళ్లటం లేదన్నది అంతే నిజం.

క్షేత్రస్థాయి పరిశీలనలు చూస్తే, తాజా గణాంకాలు చెబుతున్నదేంటంటే 32.50 లక్షల మంది విద్యార్థులుండగా , ఈ ఏడాది వారి సంఖ్య 29.65 లక్షలు మాత్రమే. అంటే దాదాపుగా 3 లక్షల మంది విద్యార్థుల సంఖ్య తగ్గుదల ఈ ఏడాది నమోదైంది. రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 43,922 పాఠశాలల్లోనూ ఇదే పరిస్థితి. మరో వైపు గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ప్రస్తుత కూటమి ప్రభుత్వం  చేపడుతున్న తరగతుల విలీనం కూడా విద్యార్థుల సంఖ్య తగ్గడానికి కారణంగా కనబడుతోంది. 3,4,5 తరగతులను కిలోమీటర్ల దూరం ఉన్న పాఠశాలలకు పంపడం వలన అక్కడ 1,2 తరగతుల విద్యార్థుల సంఖ్య 10 నుంచి 15 లోపే ఉండడంతో ఏకోపాధ్యాయ పాఠశాలలుగా మిగులుతున్నాయి. దీంతో అలాంటి పాఠశాలలకు పంపేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు సుముఖంగా లేరన్నదీ వాస్తవం. అవసరమైతే ఇంటి ముందుకే పాఠశాల బస్సును పంపే ప్రైవేటు బడివైపే మొగ్గు చూపడం కూడా సహజం. 

అమ్మఒడి, తల్లికి వందనం పథకాలు ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు కూడా అమలు చేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య అమాంతంగా పడిపోతుందన్నది క్షేత్రస్థాయి పరిశీలన. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య ప్రతి ఏటా పెరుగుతోంది. మరోపక్క 4,750 ప్రభుత్వ బడుల్లో ఒక్క విద్యార్థి చేరలేదంటే పరిస్థితులెలా ఉన్నాయో తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న వారు 29.65  లక్షల మంది విద్యార్థులు కాగా, ప్రైవేట్ స్కూళ్లల్లో 38.90 లక్షల మంది చదువుతున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  2021-22 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో 45.60 లక్షలుగా ఉన్న విద్యార్థుల సంఖ్య నాలుగేళ్లలో 29.65 లక్షలకు పడిపోయింది.

lokesh

యువ నాయకుడు నారా లోకేశ్ ఇప్పటికే విద్యాశాఖపై ప్రత్యేక దృష్టి సారించి మంచి సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే పద్ధతిలో ప్రభుత్వ బడుల్లో పిల్లల సంఖ్య తగ్గకుండా చూసేందుకు తగిన సమాలోచనలు చేయాలి. ప్రభుత్వ బడుల్లో చదివే వారికే తల్లికి వందనం ఇవ్వాలని అనేవారు లేకపోలేదు. కానీ, దాని వల్ల రాజకీయంగానూ చిక్కుముడులు ఉంటాయి. మెగా డీఎస్సీతో టీచర్ల సంఖ్యను పెంచేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. అదే విధంగా ప్రభుత్వ బడుల్లో కనీస వసతులు, అడ్వాన్స్డ్ కోర్సులు, ప్రస్తుత తరాలు కోరుకునే రోబోటిక్స్, ఇంగ్లీష్ ల్యాబ్, క్రాఫ్ట్ డిజైనింగ్, మ్యూజిక్, స్పోర్ట్స్, అమ్మాయిలు తమను తాము రక్షించుకునే తరహాలో కరాటే వంటి శిక్షణలను ప్రభుత్వ బడుల్లోనూ నేర్పించాలి. తద్వారా ప్రైవేట్ లో దొరికేవన్నీ ప్రభుత్వ బడుల్లో ఉన్నాయని తల్లిదండ్రులకు అవగాహన కలిగించినపుడు ప్రైవేట్‌ను దీటుగా ఎదుర్కొని ప్రభుత్వ బడుల్లో చిన్నారులు చదువుకునేందుకు ఆసక్తి చూపించే సంస్కరణలు చేపట్టడం అవసరం.

Advertisement

Latest News

తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం! తల్లికి వందనం..'ప్రైవేటు'కు వరం..ప్రభుత్వ బడులకు విద్యార్థులు దూరం!
ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ప్రోత్సహించడం కోసమే ప్రభుత్వాలు అమ్మఒడి, తల్లికి వందనం పేర్లతో అమ్మల ఖాతాలకు నగదు బదిలీ చేస్తున్నాయి. ప్రతి పథకంలో రాజకీయం ఉన్నప్పటికీ..ఉద్దేశం ఏదైనా...
బీఆర్‌ఎస్‌కు దూరమవుతున్నట్టేనా?
నామినేటెడ్ పదవుల జాతర.. 66 మంది చైర్మన్లు వీళ్లే ..!
చిట్‌చాట్ పేరుతో విషం చిమ్మితే కోర్టుకు లాగుతా..!
ఫోన్ ట్యాపింగ్ కేసు - కేంద్రమంత్రి బండి సంజయ్ ఏం చెప్పబోతున్నారు?
కరవు వస్తే గడ్డి తెచ్చి పశువులను కాపాడిన పార్టీ తెలుగుదేశం
రాయుడు హత్య కేసులో రూ.30లక్షల ఆఫర్.. పవన్ ఎందుకు సైలెంట్ అయ్యారు..? రాయుడి చెల్లెలు ప్రశ్నలు