సిటీలో పలుచోట్ల ఎక్సైజ్ దాడి.. నా పెయిడ్ లిక్కర్ స్వాధీనం..

హైదరాబాద్: ఎక్సైజ్ శాఖ చేపట్టిన స్పెషల్ ఎండిపిఎల్ నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మూడు కేసుల్లో ఎస్ టి ఎఫ్ ఎక్సైజ్ సిబ్బంది 56 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్ పరిసరాల్లో తిరుమలగిరి ప్రాంతంలో ఎస్టిఎఫ్ సిఐ నాగరాజు ఎస్సై జ్యోతి కలిసి పనరమణ అనే వ్యక్తి వద్ద 20 సిగ్నేచర్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఇదే ఎస్టిఎఫ్డి టీం సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో కేఎస్ఆర్ బెంగళూరు, రాజధాని ఎక్స్ ప్రెస్ నుండి వచ్చిన ప్రయాణికులను తనిఖీ చేస్తున్న సమయంలో అజయ్ సింగ్ అనే వ్యక్తి వద్ద మద్యం బాటిళ్లను తీసుకువెళ్తుండగా సీజ్ చేశారు.
ఇక గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు వెస్ట్ మారేడ్పల్లి ప్రాంతంలో ఎస్టిఎఫ్బి టీం సిఐ భిక్షా రెడ్డి ఎస్సై బాలరాజు ఎస్సై సంధ్యా, టీం లీడర్ ప్రదీప్ రావులు కలిసి నిర్వహించిన దాడిలో రునీత్, ఆదిత్య అనే ఇద్దరు వ్యక్తుల ఇంట్లోంచి 13 గ్రాముల ఓజి కుష్ గంజాయితోపాటు, గోవా మణిపూర్ ఢిల్లీ ప్రాంతాల నుంచి తీసుకువచ్చిన 32 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం బాటిళ్ల విలువ రెండున్నర లక్షల మేరకు ఉంటుందని అంచనా వేశారు.
Latest News
