మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
- ఈ సారి మొయినాబాద్ లో హంగామా
- బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో గోలగోల
- మేనేజర్ పై బూతులు..దాడికి యత్నం
సినీనటి కల్పిక మరోసారి రెచ్చిపోయింది. ఈ సారి ప్లేస్ మార్చింది. మొయినాబాద్ కనకమామిడి బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో హంగామా చేసింది మేనేజర్ ని దుర్భాషలాడి కొట్టబోయింది. అదేమంటే తనపట్ల దురుసుగా ప్రవర్తించారు అంటూ కవర్ చేసుకుంటోంది. మధ్యాహ్నం మూడు గంటలకు క్యాబ్లో సింగిల్ గా వచ్చిన కల్పిక. రిసార్ట్ రిసెప్షన్ లోకి రాగానే మేనేజర్ కృష్ణ పై దురుసుగా ప్రవర్తించింది. మెను కార్డు విసిరేయడం, రూమ్ కీస్ మొహంపై విసిరేసి బూతు పురాణాలతో రెచ్చిపోయింది. సిగరెట్స్ కావాలంటూ బ్రౌన్ టౌన్ రిసార్ట్స్ సిబ్బందిపై దుర్భాషలు ఆడి 40 నిమిషాలు రిసార్ట్ లో న్యూసెన్స్ క్రియేట్ చేసింది. కల్పిక ప్రవర్తనపై ఆశ్చర్యానికి గురైన రిసార్ట్ సిబ్బంది ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కాని పరిస్థితిలోకి లోనైనారు. అయితే బ్రౌన్ టౌన్ రిసార్ట్ లో జరిగిన హంగామా పై కల్పిక రెస్పాన్స్ ఇచ్చింది.
క్యాబ్ ఫెసిలిటీ లేదు, వైఫై ఫెసిలిటీ లేదు, సిగరెట్ తీసుకురమ్మంటే తీసుకురాలేదు. ఎన్నిసార్లు చెప్పినా సిబ్బంది స్పందించక పోవడంతో తాను బూతులు తిట్టాల్సి వచ్చిందని చెప్పింది. బ్రౌన్ టౌన్ రిసార్ట్ సిబ్బంది నా పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు వివిధ కేసులో నా వెంట పడుతున్నారని నేను రిసార్ట్ కి వచ్చాను అని చెప్తోంది. రెస్ట్ కోసం వెళ్లిన కల్పిక మరో వివాదంలో చిక్కుకుంది. ఆమె చేసిన హంగామా వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమెకు మానసిక స్థితి సరిగా లేదు.. ఎవరైనా మంచి డాక్టర్ కి చూపించండి అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు. ఏదిఏమైనా కల్పిక ఈమధ్య హంగామా చేస్తూ సోషల్ మీడియా స్టార్ గా మారిందని చెప్పుకోవచ్చు.