కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత

వేగవంతమైన పాస్ పోర్ట్ సేవలకు రాష్ట్రంలోనే అగ్ర స్థానం

On
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత

కడప జులై 28:

వై.ఎస్.ఆర్ కడప జిల్లా పోలీస్ శాఖ ఘనతల పరంపరకు మరో కలికితురాయిని జతచేసింది.  జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారి నేతృత్వంలో స్పెషల్ బ్రాంచ్ విభాగం వివిధ వృత్తులు, ఉపాధి, విద్య కోసం ఇతర దేశాలకు వెళ్లేవారికి సకాలంలో, వేగవంతంగా పాస్ పోర్ట్ సేవలందించినందుకు రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2024  ఏప్రిల్ నుండి 2025 మార్చి వరకూ 46,532 పాస్ పోర్ట్ దరఖాస్తులను కేవలం 3 రోజుల వ్యవధిలోనే విచారణ పూర్తిచేసి రాష్ట్రంలోనే అత్యుత్తమ పనితీరు కనబరచి గొప్ప విజయాన్ని జిల్లా పోలీస్ శాఖ అందుకుంది. విజయవాడ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రాంతీయ పాస్ పోర్ట్ అధికారి శ్రీ శివహర్ష గారి చేతుల మీదుగా జిల్లా పోలీస్ విభాగం తరపున జిల్లా ఎస్.బి విభాగం డి.ఎస్.పి ఎన్.సుధాకర్ అవార్డు అందుకోవడం జరిగింది.

ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి శ్రీ ఇ.జి అశోక్ కుమార్ ఐ.పి.ఎస్ గారు స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, ఎస్.బి ఇన్స్పెక్టర్ లు దారెడ్డి భాస్కర్ రెడ్డి,ఆర్. పురుషోత్తమ్ రాజు, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ యూనిట్ కానిస్టేబుల్ జి.సుబ్బరాజు మరియు ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. జిల్లా ఎస్.పి గారు  మాట్లాడుతూ పాస్ పోర్ట్ దరఖాస్తుల విచారణ ప్రక్రియను వేగవంతంగా, సమర్ధవంతంగా నిర్వహించడం జిల్లా పోలీసుల అంకితభావానికి, కృషికి దక్కిన గౌరవమన్నారు. ఇదే స్పూర్తితో మున్ముందు జిల్లా ప్రజలకు సేవలందించేందుకు పునరంకితమవ్వాలని జిల్లా ఎస్.పి గారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, ఇన్స్పెక్టర్లు దారెడ్డి భాస్కర్ రెడ్డి, ఆర్.పురుషోత్తం రాజు, పాస్ పోర్ట్ వెరిఫికేషన్ యూనిట్ కానిస్టేబుల్ జి.సుబ్బరాజు  పాల్గొన్నారు.

Advertisement

Latest News

ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి.. ఫణిగిరికాలనీలోని మూసీనదిలో మొసలి..
హైదరాబాద్:- ఎల్బీనగర్ నియోజకవర్గం చైతన్యపురి డివిజన్ ఫణగిరికాలనీ ఆనుకొని ఉన్న మూసినది ఒడ్డున ఉన్న శివాలయం వద్ద ముసలి కలకలం రేగింది. మూసినది ఒడ్డున సంచరించే నాలుగు...
ఛీ..ఛీ.. ఇదేం దందారా నాయనా..
మళ్లీ రెచ్చిపోయిన సినీనటి కల్పిక..
కడప జిల్లా పోలీస్ శాఖ ఘనత
అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..
అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు..
శ్రీరాముడు స్థాపించిన శివలింగం..ఆ చరిత్ర మీకోసం..