ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్

On
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్

కుత్బుల్లాపూర్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని గాజులరామరంలో ప్రేమ పేరుతో ఓ యువకుడు వీరంగం సృష్టించాడు. ఓ యువతిని ప్రేమ పేరుతో రెండేళ్ల నుంచి వేధిస్తున్నాడు వినయ్(21)అనే యువకుడు. యువకుడి వేధింపులు తాళలేక హైదరాబాద్ కి మకాం మార్చింది యువతి కుటుంబం.ఓ సూపర్ మార్కెట్ లో పనిచేస్తున్న అమ్మాయి ని వెతుక్కుంటూ వచ్చి.. అదే మార్కెట్ లో కత్తిని కొని యువతి పై దాడికోసం వేచిచూస్తున్నాడు. పరిస్థితిని గమనించిన యువతి స్టోర్ రూంలోకి వెళ్లి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. దీంతో సూపర్ మార్కెట్ కు చేరుకున్న కుటుంబ సభ్యులు, స్టోర్ సిబ్బంది సహాయంతో యువకుడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. గత రెండేళ్లుగా వేధింపులకు పాల్పడుతుండటంతో తమ కూతురికి ప్రాణహాని ఉందని పోలీస్ స్టేషన్ లో నిందితుడిని అప్పగించి ఫిర్యాదు చేశారు.యువతి ఫిర్యాదుతో వినయ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి నుంచి కత్తి స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

Advertisement

Latest News

దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి.. దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి..
చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు పాటించాలని సూచనదోమలు రాకుండా తలుపులు, కిటికీలను తెరలతో కప్పివేయాలన్న వైద్య ఆరోగ్య శాఖవడకాచిన నీటిని మాత్రమే తాగాలన్న వైద్య ఆరోగ్య...
ఒరిస్సా టు హైదరాబాద్ గంజాయి రవాణా.. ఇద్దరి అరెస్ట్..
సినీనటుడు రాజీవ్ కనకాలకు నోటీసులు ఇచ్చిన పోలీసులు..
ప్రేమ పేరుతో యువతికి వేధింపులు.. నిందితుడి అరెస్ట్
 ఘనంగా మ‌హాల‌క్ష్మి- మ‌హిళ‌ల  ప్ర‌యాణ వేడుక‌లు..
మత్తుతో వ్యాపారం.. కోట్లు కొల్లగొట్టిన వైనం..
మరోసారి రికార్డ్ బద్దలు కొట్టిన సైబరాబాద్ పోలీసులు