అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు..
By V KRISHNA
On
- సిటీ శివారులో గంజాయి ముఠాను పట్టుకున్న ఈగల్ టీమ్
మహారాష్ట్రా టు రాజమండ్రీ టు హైదరాబాద్ చైన్ బ్రేక్ చేసిన పోలీసులు
పండ్ల రవాణా మాటున గంజాయి రావాణా..

Tpn: స్పెషల్ డెస్క్
ఈగల్ టీమ్ (నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో) మరో బిగ్ రాకెట్ ను ఛేదించింది. సుమారు 5కోట్ల రూపాయల విలువ చేసే గంజాయిని స్వాధీనం చేసుకుంది. ఇటీవలే కొండాపూర్, మాదాపూర్ ప్రాంతంలో డెకాయ్ ఆపరేషన్ నిర్వహించి 24 మంది సాఫ్ట్ వేర్, ఐటీ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న ఈగల్ తాజాగా సిటీ శివారు ప్రాంతంలో మాటువేసి గుట్టుగా రవాణా అవుతున్న గంజాయి రావాణాను అరికట్టింది. ఈ ముఠా అచ్చం పుష్పా సినిమా తరహాలో ఎవ్వరిని అనుమానం రాకుండా గంజాయిపై ఫ్రూట్స్ ఏర్పాటు చేసి పండ్లరవాణా అంటూ చెక్ పోస్టులు దాటినా ఈ గల్ వ్యూకి అడ్డంగా బుక్కయ్యారు. దీనిపై దాదాపు మూడురోజులపాటు కష్టపడి చివరకు ఫలితం సాధించామని అధికారులు తెలిపారు. మహారాష్ట్రా టు ఆంధ్రమీదుగాా తెలంగాణకు సాగుతున్న ఈ మాఫియా బిజినెస్ కి ఎట్టకేలకు చెక్ పెట్టారు.
మహారాష్ట్రా సతారా ప్రాంతానికి చెందిన పవార్ కుమార్ బాడు ఈ నెట్ వర్క్ కి కింగ్ పిన్. ఇతనితో పాటు, సమాధాన్ కాంతిలాల్ భీష్ (డ్రైవర్), వినాయక్ బాబాసాహెబ్ పవార్, ఈ వ్యాపారానికి లోజిస్టిక్స్ అసిస్టెంట్, రవాణా మరియు ఎస్క్రార్ట్ బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ ముఠా ముందుగా మహారాష్ట్రా నుండి డిసిఎం వాహనంతో బయలు దేరి రాజమండ్రి చేరుకుంటారు. అక్కడ గంజాయి లోడ్ చేసి పైన పలు రకాల పండ్లను ఏర్పాటు చేసుకుని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ కి సప్లయ్ అంటూ చెక్ పోస్టులు దాటిస్తారు. ఈ ట్రక్ ఎంత దూరం వెళ్లిన బాబాసాహెబ్ పవార్ కారులో ఎస్కార్ట్ గా గమనిస్తూ సిటీకి వస్తాడు. అలా వచ్చిన సరుకును పలువురు వ్యాపారులకు అమ్మకాలు సాగిస్తుంటారు.
ఇలా ఈ వ్యాపారం గత కొన్ని సంవత్సరాలుగా సాగుతోంది. చెక్ పోస్టులో గాని, పోలీసులకు గాని అనుమానం రాకుండా సాగుతోంది. ఈ విషయం తెలుసుకున్న ఈగల్ టీం హయత్ నగర్ బాటాసింగారం వద్ద మాటు వేసింది. వెంటనే తమ వాహానాలను అచ్చం సినిమా స్టైల్ లో రోడ్డుపై అడ్డగా పెట్టి తనిఖీలు నిర్వహించింది. ఇంకేముంది నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించిన పట్టుకుని తమ వాహానాల్లోకి ఎక్కించారు. డిసిపిఎం పరిశీలిస్తే కళ్లు తిరిగే రీతిలో అయిదు కోట్ల రూపాయల విలువ చేసే 935.611 కిలోల గంజాయి పట్టుబడింది. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు గంజాయి రవాణాకి ఉపయోగించిన వాహానాలు, వారి వద్ద సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన అంతర్ రాష్ట్ర ముఠాను విచారిస్తున్నారు. ఒక పక్కన ఎక్సైజ్ అధికారులు, హెచ్ న్యూ, లా అండ్ ఆర్డర్, ఈగల్ టీమ్ లు నిరంతరం సోదాలు చేస్తున్న ఈ ముఠాలు మాత్రం పుష్పా సినిమా తరహాలో తెలంగాణకు ముఖ్యంగా హైదరాబాద్ కి గంజాయి రావాణా చేస్తూనే ఉన్నారు.
సిటీలో వీకెండ్ కల్చర్ విఫరీతంగా పెరిగిపోయిన నేపధ్యంలో గంజాయికి గిరాకీ పెరిగిందని, అందుకే ఏజెన్సీ నుండి కొత్త కొత్త ముఠాలు పుట్టుకు వచ్చి ఈ వ్యాపారం మొదలు పెట్టారని ఈగల్ టీమ్ అధికారులు చెబుతున్నారు. పక్క రాష్ట్రాంలో చెక్ పోస్టుల వద్ద నిఘా సరిగా లేక పోవడం కూడా ఓ ప్రధాన కారణమని, ఇందు కోసం ఏ.పి పోలీసులతో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. ఇలాంటి ముఠాలు ఇంకా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు మొదలు పెట్టారు.
Related Posts
Latest News
28 Jul 2025 18:42:23
సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్..దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు..ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చే యువతీ యువకులే వీరి టార్గెట్..డబ్బు ఆశ చూపి...