శ్రీరాముడు స్థాపించిన శివలింగం..ఆ చరిత్ర మీకోసం..

On
శ్రీరాముడు స్థాపించిన శివలింగం..ఆ చరిత్ర మీకోసం..

By. V. Krishna Kumar

Ton: స్పెషల్ డెస్క్..

శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వికారాబాద్ లోని అనంతగిరి పల్లెలో వెలసింది.IMG-20250728-WA0114  వికారాబాద్ నుండి 5 కిలోమీటర్లు మరియు హైదరాబాద్ నుండి 95 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చాలా పురాతనమైన ఆలయం, దీనిని త్రేతా యుగంలో శ్రీ రాముడు ప్రతిష్టించాడని చరిత్ర చెపుతుంది.ఈ యొక్క పవిత్ర స్థలాన్ని  ఆలయాన్ని సందర్శిస్తే అన్ని పాపాలు పోతాయి అని అక్కడ ప్రజలు విస్మసనియ నమ్మకం  ఈ ఆలయo శ్రీరాముడు లంక రాజు రావణుడిని చంపి సీతాదేవితో కలిసి రామేశ్వరానికి తిరిగి వచ్చిన తర్వాత, అగస్త్య మహా ముని మరియు ఇతర ఋషులు బ్రాహ్మణుడైన రావణుడిని చంపినందుకు తపస్సు చేయమని సలహా ఇచ్చారని రామేశ్వరంలో జ్యోతిర్లింగాన్ని ప్రతిష్టిస్తే బ్రాహ్మణుడైన రావణుడిని చంపిన పాపం తొలగిపోతుందని ఋషులు ప్రకటించారు. రాముడు అక్కడ జ్యోతిర్లింగాన్ని ప్రతిష్టించాడoతో శివలింగనీ ప్రతిష్టించాలనే తపనతో, ఆయన అనంతగిరి దట్టమైన అడవులకు వచ్చి ఇప్పుడు అనంతగిరి పల్లె అని పిలువబడే ఈ ప్రదేశంలో శివలింగాన్ని ప్రతిష్టించాడని శివలింగానికి అభిషేకం  పూజకు అవసరమైన నీటి కోసం, ఆయన పక్కనే ఉన్న ప్రదేశంలో భూమిలోకి బాణం వేశాడoతో ఆ ప్రదేశం నుండి బుడగ రూపంలో నీరు బయటకు రావడంతో ఆయన ఆ నీటిని ఉపయోగించి ఇక్కడ ప్రతిష్టించిన శివలింగాన్ని పూజించడoతో ఈ నీరు నేటికీ శివగంగా పుష్కరిణి అనే కోనేరు నుండి ఆలయ చెరువులోకి నిరంతరం ప్రవహిస్తూనే ఉంది. ఇక్కడి నుండి వచ్చే నీరు, చెరువును పొంగిపొర్లుతూ ముసి నదికి మూలం , ఆ తరువాత కొండల నుండి ప్రవహిస్తుంది. ఈ చెరువు నీరు అనేక ఔషధ ప్రయోజనాలను కలిగి ఉందని భావిస్తారు. ఆలయాన్ని సందర్శించే భక్తులు పుష్కరిణిలో స్నానం చేసి, తమ పాపాల  నుండి తమను తాము శుద్ధి చేసుకుని, ఔషధ ప్రయోజనాలు మరియు అద్భుత నివారణలను పొంది,  ఆశీర్వాదాలు మరియు కోరికల నెరవేర్పు కోసం శివుని ఆలయాన్ని సందర్శించాలని సూచించారు. శ్రావణమాసం అన్ని రోజులు నిత్య అన్నదానం నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ చైర్మన్ ఆత్మ లింగం తెలిపారు.

Advertisement

Latest News

అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్.. అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..
సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్..దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు..ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చే యువతీ యువకులే వీరి టార్గెట్..డబ్బు ఆశ చూపి...
అచ్చం పుష్పా సినిమాను సేమ్ టు సేమ్ దింపేశారు..
శ్రీరాముడు స్థాపించిన శివలింగం..ఆ చరిత్ర మీకోసం..
సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధ్యం-ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి 
ఇదెక్కడి ఘోరం.. మద్యం తాగించి మరీ మర్డర్ ప్లాన్ చేసింది...
ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు
వీకెండ్ పార్టీ అంటూ పరుగులు పెట్టారు..చివరకు బోర్లా పడ్డారు..