సమిష్టి కృషితో గ్రామాభివృద్ధి సాధ్యం-ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి
By MAHESH ARN
On
సూళ్లూరుపేట నియోజకవర్గం ట్రూపాయింట్ న్యూస్ రిపోర్టర్
ప్రజాప్రతినిధులు,అధికారుల సమిష్టి కృషితోనే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని నాయుడుపేట ఎంపీపీ కురుగొండ ధనలక్ష్మి అన్నారు.ఆదివారం నాయుడుపేట ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.రానున్న వర్షాలను దృష్టిలో పెట్టుకుని మండలంలోని 19 పంచాయితీల్లో పారిశుద్ధ్యన్ని మెరుగుపరచాలని అన్నారు.అలాగే తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. గ్రామపంచాయతీలో మౌలిక వసతులు మెరుగుపరిచేందుకు ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాయుడుపేట జడ్పిటిసి సభ్యులు కట్టా జ్యోతి రెడ్డి,నాయుడుపేట ఎంపీడీవో కె.సురేష్ బాబు, నాయుడుపేట తహసిల్దార్ ఎం. రాజేంద్ర,పలువురు ఎంపీటీసీ సభ్యులు,సర్పంచులు, కార్యదర్శులు,తదితరులు పాల్గొన్నారు.
Latest News
28 Jul 2025 15:41:03
By. V. Krishna Kumar
Ton: స్పెషల్ డెస్క్..
శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం వికారాబాద్ లోని అనంతగిరి పల్లెలో వెలసింది. వికారాబాద్ నుండి 5...