వీకెండ్ పార్టీ అంటూ పరుగులు పెట్టారు..చివరకు బోర్లా పడ్డారు..

On
వీకెండ్ పార్టీ అంటూ పరుగులు పెట్టారు..చివరకు బోర్లా పడ్డారు..

  • కొండాపూర్ లో వీకెండ్ పార్టీని భగ్నం చేసిన ఎక్సైజ్ పోలీసులు
    భారీగా డ్రగ్స్.. గంజాయి స్వాధీనం..
    పక్కరాష్ట్రానికి చెందిన 9 మంది యువకుల అరెస్ట్..
    మరో ముగ్గురి కోసం గాలింపులు ముమ్మరం..

By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
వీకెండ్ పార్టీ.. రేవ్ పార్టీ... పేరు ఏదైనా పార్టీ ఒక్కటే... పోలీసుల భయం లేదు... డ్రగ్స్ దొరకదన్న దిగులు లేదు.. జస్ట్ బుక్ చేసుకోండీ.. చాలు.. డ్రాపింగ్.. పికప్ అంతా మేమే చూసుకుంటాం.. రెండు రోజులు మందు, మగువతే ఏంజాయి చేయండీ.. వీకెండ్ ని ఏంజాయ్ చేయండీ.. అంటూ ఓ ముఠా కొత్త తరహా వ్యాపారం మొదలు పెట్టింది. ఉన్న ప్రాంతంలో పట్టుబడితే పరువు పోతుంది అనుకున్నదేమో.. పక్క రాష్ట్రంలో డోర్లు ఒపెన్ చేసింది. ఇందు కోసం ఓ వెబ్ సైట్ ఓపెన్ చేసి ఆధార్ కార్డు నెంబర్లతో మెంబర్ షిప్ చేసుకుంటే చాలు... ఆ తరువాత అంతా వారే చూసుకుంటారు.. అలా కొంతకాలంగా సాగుతున్న ఈ పార్టీ వ్యాపారం ముగుసును తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్ తెర తేశారు. 11 మందిపై కేసులు నమోదు చేసి 9 మందిని అరెస్టు చేశారు..
విజయవాడ, కాకినాడ, రాజమండ్రీకి చెందిన రాహుల్, ప్రవీణ్ కుమార్, అశోక్ కుమార్, సాయి కృష్ణ, జోసఫ్, తోట కుమారస్వామి, శ్రీదత్, నంద సమతా తేజతో పాటు మరోముగ్గురు కలిసి ఏఐఆర్ బిఎన్ బి అనే ఒక వెబ్ సైట్ రూపొందించారు. అలా తమ వెబ్ సైట్ ను ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా పబ్లిసిటీ చేశారు. తమ వద్ద ఆధార్ నెంబర్ ఆధారంగా మెంబర్ షిప్ తీసుకున్న వారిని కార్లలో తెలంగాణ ప్రాంతానికి తీసుకు వస్తారు. అలా తీసుకు వచ్చిన వారిని కొండపూర్ ప్రాంతంలో ముందుగా తీసుకున్న సర్వీస్ అపార్టమెంట్. జెబిహిల్స్ లోని ఎస్ వి అపార్టుమెంట్ వద్దకు తెచ్చి రెండు రోజులపాటు వీకెండ్ పార్టీ జరిపిస్తారు. తిరిగి సోమవారం ఉందయం ఎవరి ఇండ్ల వద్ద వారిని వదిలేస్తారు. ఇలా కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాపారం సాగుతూనే ఉంది.
లక్షల్లో డబ్బులు వచ్చే సరికి ఇంకేముంది ఈ వ్యాపారం జోరందుకుంది.  ఆంధ్రప్రదేశ్ మారుమూల ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు లక్షల్లో డబ్బులు పెట్టి మెంబర్ షిప్ తీసుకున్నారు. శని ఆదివారాలు వస్తే చాలు ఈ ముఠా కొండాపూర్ ప్రాంతంలో ఈ వీకెండ్ కల్చర్ జోరుగా నిర్వహిస్తోంది. అయితే ఈ అవకాశం కేవలం ఆంధ్రప్రదేశ్ కి చెందిన వారికి మాత్రమే వర్తిస్తుంది. అలా గుట్టుగా సాగుతున్న ఈ పార్టీ కల్చర్ వ్యవహారం తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీం చెవిలో పడింది. అంతే ఆంధ్ర అడ్రస్సుతో మెంబర్ షిప్ అంటూ  లోపలికి అడుగుపెట్టారు. ఆ తరువాత ఇంకేముంది మత్తులో ఊగుతున్న వారందరినీ అదుపులోకి తీసుకున్నారు. 11మందిలో 9 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2.80కేజీల గంజాయి, 50గ్రాముల ఓజీ కుష్ ఆయిల్, 11.57 గ్రాముల మ్యాజిక్ మష్రూమ్, 1.91 గ్రాముల చెరస్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు.
పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నారు. సర్వీస్ అపార్టుమెంట్ అద్దెకు  ఇచ్చిన యజమానిపై కూడా ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. పార్టీ  అంటూ పరగులు పెడితే ఊచలు లెక్కించేలా చేస్తామని హెచ్చరించారు. తమ ప్రాంతంలో పట్టుబడితే పరువు పోతుందని పక్క రాష్ట్రాంలో ప్లాన్ వేసిన ఈ ముఠా ఆలోచనలు కాస్త తలకిందులు అయ్యాయి. ఇలాంటి ఆంధ్రప్రదేశ్ కి చెందిన ముఠాలు సిటీలో మరో మూడు ముఠాలు వీకెండ్ పార్టీలు చేసుకుంటున్నట్లు ఎక్సైజ్ అధికారులు అనుమానిస్తున్నారు. వారిపై కూడా నిఘా పెట్టినట్లు తెలిపారు. వీకెండ్ పార్టీని భగ్నం చేసిన టాస్క్ ఫోర్స్ బీ టీమ్ ని ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసిం అభినందించారు.
 

Advertisement

Latest News

ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు ఆదాయం కోసం అడ్డదారులు.. గర్భం పేరుతో గలీజ్ పనులు
టెస్ట్ ట్యూబ్ బేబీ పేరుతో మోసాలు..భర్తకు బదులు మరొకరి వీర్యంతో జీవితాలు ఆగం చేసిన నిర్వాహకులు..దేశవ్యాప్తంగా బ్రాంచ్ లు..సికింద్రాబాద్ లో వెలుగు చూసిన యూనివర్సల్ మోసాలు..
వీకెండ్ పార్టీ అంటూ పరుగులు పెట్టారు..చివరకు బోర్లా పడ్డారు..
భారీ వర్షాల ఎఫెక్ట్: పురాతన భవనాన్ని కూల్చివేసిన అధికారులు..
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద భారీ బందోబస్తు
శ్రీ చైతన్య కళాశాల ఇంచార్జ్ పై కేసు నమోదు..
ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్ లో ఇద్దరు డిఎస్పీల మృతి..
హరిహారవీరమల్లు సినిమా సక్సెస్.. అమ్మవారికి ప్రత్యేక పూజలు