దయచేసి ఎవ్వరికి షేక్ హ్యాండ్ ఇవ్వకండి..
- చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు నిల్వకుండా జాగ్రత్తలు పాటించాలని సూచన
దోమలు రాకుండా తలుపులు, కిటికీలను తెరలతో కప్పివేయాలన్న వైద్య ఆరోగ్య శాఖ
వడకాచిన నీటిని మాత్రమే తాగాలన్న వైద్య ఆరోగ్య శాఖ
బయటి వ్యక్తులతో కరచాలనం వీలైనంతగా తగ్గించాలని సూచన
By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్..
తెలంగాణలో రానున్న ఐదు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున, వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు ముఖ్యమైన సూచనలు చేసింది. బయటి వ్యక్తులతో కరచాలనం (షేక్ హ్యాండ్)చేయడాన్ని తగ్గించాలని, శానిటైజర్ ఉపయోగించడం ద్వారా పరిశుభ్రత పాటించాలని కోరింది. వర్షాల వల్ల కంటికి కనిపించని వైరస్ ఉంటుందని అది షేక్ హ్యాండ్ ల వల్ల ఒకరి నుండి ఇంకొకరికి వచ్చే అవశాలు ఉంటాయని తెలిపింది. అందుకే నమస్కారంతో సరిపెట్టాలని సూచించింది. అన్ని స్థానిక ఆసుపత్రులలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. అంతే కాకుండా పరిసర ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు రాకుండా తలుపులు, కిటికీలకు తెరలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. సెప్టిక్ ట్యాంకులు, ఇతర నీటి నిల్వ ప్రదేశాల్లో దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో మెష్‌లను ఉపయోగించి పరిశుభ్రంగా ఉంచాలని తెలిపింది.
ప్రజలు వడపోసిన నీటిని మాత్రమే తాగాలని, భోజనానికి ముందు, తరువాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించింది. కలుషిత ఆహారం కారణంగా ఫుడ్ పాయిజన్ సంభవించే ప్రమాదం ఉన్నందున, వీలైనంత వరకు బయట ఆహార పదార్థాలు తినకూడదని హెచ్చరించింది. వర్షాకాలం ఫ్రిజ్ లో నిల్వ వుండే పదార్థాలకు, హోటల్ లో మంచినీరు, రోడ్ సైడ్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్ ఇలాంటి వాటికి ఎంత దూరం ఉంటే మీ ప్రాణాలకు అంత భరోసా అని చెప్పింది.