అమ్మతనాన్నే అపహాస్యం చేసిన సృష్టి సెంటర్..
By V KRISHNA
On
- సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్..
దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు..
ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చే యువతీ యువకులే వీరి టార్గెట్..
డబ్బు ఆశ చూపి సరోగసి.. వీర్యకణాల సేకరణ..
గతంలో తల్లిదండ్రులైన వారి వివరాలు సేకరిస్తున్న పోలీసులు..

Tpn: స్పెషల్ డెస్క్..
యూనివర్సల్ సృష్టి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ వ్యవహారంలో అనేక కీలక విషయాలు బయటపడుతున్నాయి. దర్యాప్తులో విస్సుపోయే విషయాలు పోలీసులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. బతుకు దెరువు కోసం నగరానికి వచ్చే యువతీయువకులనే ఈ సెంటర్ నిర్వహకులు టార్గెట్ చేస్తున్నారని తేలింది. ఉద్యోగం, డబ్బు ఆశలు రేపి వారితో ఈ గలీజ్ దందాను కొనసాగిస్తున్నారని తెలిసింది. గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సృష్టి కేసులో మరో విషయం బయటపడింది. పిల్లలను లేని వారికి పిల్లలు కలిగేలా చేస్తామంటూ మొదలు పెట్టిన ఈ వ్యాపారం హైదరాబాద్ నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అహహ్మదాబాద్, గుజరాత్, మహారాష్ట్రా ఇతర ప్రతి రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో బ్రాంచ్ లు ఒపెన్ చేసింది. ఇంతటి ఆగకుండా సృష్టి సెంటర్ ఓ టీమ్ ను ఏర్పాటు చేసింది. ఈ టీమ్ పని రైల్వే స్టేషన్లు, బస్టాండుల్లో తిరుగుతూ ఉంటారు. బీహార్, ఒరిస్సా, కేరళా నుండి ఉద్యోగం కోసం సిటీకి వచ్చే వారిని టార్గెట్ చేస్తారు. వారిని గమనించి మాటా మాటా కలుపుతారు. ఉద్యోగం, కావాల్సినంత డబ్బు, సౌకర్యాలు అంటూ నమ్మించి వారికి తమ వివరాలు ఫోన్ నెంబర్ అందిస్తారు. అలా సిటీలో ఎక్కడ సరైన ఉద్యోగం లభించని యువతీ, యువకులు వీరిని ఆశ్రయిస్తే చాలు ఇక బిజినెస్ అక్కడి నుండి మొదలవుతుంది.
తమ వద్దకు వచ్చే అమ్మాయిలతో ముందుగా బేరం కుదుర్చుకొని అండం ఇచ్చేలా, లేదా సరోగసి తరహాలో బిడ్డను కని పిల్లలు లేని వారికి పుట్టిన వెంటనే వారికి అప్పగించేలా డీల్ కుదుర్చుకుంటారు. పిల్లలను లేని వారి దగ్గర 40లక్షలు మాట్లాడి, ముందుగా అడ్వాన్స్ తీసుకున్న తరువాత, యువతికి పని పూర్తికాగానే లక్ష రూపాయలు ఇచ్చి చప్పుడు కాకుండా తిరిగి వారి ప్రాంతానికి పంపించేస్తారు. ఇదంతా సీక్రెట్ బిజినెస్, ఇక యువకులు అయితే వారిని ఆసుపత్రిలో ఓ గదిలో ఉంచి ఫోర్న్ వీడియోస్ చూపించి వారి నుండి వచ్చే వీర్యం సేకరించి వాటికి వెల కట్టి డబ్బులు అప్పగిస్తారు. ఇలా 2021 నుండి ఈ తరహా వ్యాపారం సృష్టి యజామాని నమ్రతా మొదలు పెట్టింది.
సేకిరంచిన వీర్యాన్ని అహహ్మదాబాద్ లో నిల్వ చేసి పిల్లల కోసం వచ్చే దంపతులకు మాయమాటలు చెప్పి భర్తకు బదులు తాము సేకరించిన మరో యువకుడి వీర్యాన్ని పంపి గర్భం వచ్చేలా చేస్తారు.
అలా ఇప్పటి వరకు అనేక మంది నుండి లక్షల రూపాయంలో కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అయితే తాజాగా ఫిర్యాదు చేసిన దంపతుల విషయంలో కూడా ఇలా చేసినా ఆమెకు అబార్షన్ కావండంతో తమ వద్ద ఉన్న యువతి పసికందును ఆ దంపతులకు ఇచ్చారు. అనుమానం వచ్చి డిఎన్ఎ చేయిస్తే అసలు విషయం బయటపడింది. ఇక దీనిపై దర్యాప్తు మొదలు పెట్టిన పోలీసులు అన్ని రాష్ట్రాల్లో ఉన్న వీరి బ్రాంచ్ లలో సోదాలు జరుపుతోంది. అక్కడి వైద్య అధికారులతో కలిసి సృష్టి బ్రాంచ్ లను సీజ్ చేయించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న ఈ ముఠాను విచారిస్తున్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే గతంలో వీరి వల్ల గర్భం దాల్చి పిల్లలను కన్న తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ కి క్యూ కట్టారు. అలా వచ్చిన వారి పిల్లలకు వారి తల్లిదండ్రులకు పోలీసులు డిఎన్ఎ పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైనారు. సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్ కి పాల్పడినట్లు గుర్తించిన పోలీసులు వీరి బారిన పడిన యువతీ, యువకుల వివరాలు సేకరిస్తున్నారు. ల్యాబ్ లో దొరికిన వీర్యాలను ల్యాబ్ కి పంపిచడమే కాకుండా, వారి రికార్డులను స్వాధీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. సుమారు నాలుగు టీమ్ లను పంపి కేరళ, ఒరిస్సా, గుజరాత్, బీహార్ ప్రాంతాలకు చెందిన వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.
Related Posts
Latest News
28 Jul 2025 18:42:23
సరోగసి పేరుతో చైల్డ్ ట్రాఫికింగ్..దర్యాప్తు కోసం రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు..ఉద్యోగం కోసం ఇతర ప్రాంతాల నుండి వచ్చే యువతీ యువకులే వీరి టార్గెట్..డబ్బు ఆశ చూపి...