ఇదెక్కడి ఘోరం.. మద్యం తాగించి మరీ మర్డర్ ప్లాన్ చేసింది...
- దుండిగల్ లో భర్తను హత్య చేసేందుకు ప్లాన్ చేసిన భార్య..
- తప్పించకొని పోలీస్ స్టేషన్ చేరిన బాధితుడు..
కుత్బుల్లాపూర్: భర్తలపై భార్యల ఆగడాలకు ఫుల్ స్టాప్ పడటం లేదు. రోజు ఏదో ఒక ప్రాంతంలో ఈ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా నగర్ శివారు ప్రాంతంలో మరో ఘోరం బయట పడింది. తన భార్య జ్యోతి తనను చంపాలని ప్లాన్ చేసిందని అదృష్టం బాగుండి తను ప్రాణాలతో భర్త రాందాస్ బయటపడ్డానని బాచుపల్లి పిఎస్ లో పిర్యాదు చేశాడు. భర్త రాందాస్ ను చంపేందుకు భార్య జ్యోతి, మరో ముగ్గురు (3) యువకులతో కలిసి ప్లాన్ చేసింది. బౌరంపేట్ లో భార్య జ్యోతి ప్లాన్ ప్రకారం భర్తకు మద్యం తాగించి అక్కడే బీర్ సీసాలతో దాడి చేయించింది. అపస్మారక స్థితిలో పడివున్న రాందాస్ మృతిచెందాడని అక్కడి నుండి యువకులు వెళ్లిపోయారు. అర్ధరాత్రి రక్తపు గాయాలతో తన తమ్ముడి ఇంటికి చేరుకుని విషయాన్ని భాదితుడు రాందాస్ తెలిపాడు. బాచుపల్లి పిఎస్ పరిది రాజీవ్ గృహకల్పలో భార్య భర్తలు నివాసం ఉంటున్నారు. బాచుపల్లి పిఎస్ లో భాదితుడు ఫిర్యాదు చేశాడు. హత్యాయత్నం జరిగిన ప్రదేశం దుండిగల్ పోలీస్ స్టేషన్ కి వస్తుందని జీరో ఎఫ్ఐఆర్ దుండిగల్ పోలీస్ స్టేషన్ కు కేసును బాచుపల్లి పోలీసులు బదిలీ చేశారు.