ఆపరేషన్ సింధూర్ పై క్రికెట్ ప్లేయర్స్ రియాక్షన్స్ ఇవే..

By Ravi
On
ఆపరేషన్ సింధూర్ పై క్రికెట్ ప్లేయర్స్ రియాక్షన్స్ ఇవే..

పాకిస్థాన్‌ లోని ఉగ్ర స్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడి చేసింది. ఈ వార్త ఇండియన్స్ అందరికీ ఎంతో మానసిక సంతృప్తిని అందించింది. గత అర్ధరాత్రి తొమ్మిది ప్రాంతాల్లోని ఉగ్ర క్యాంపులపై విరుచుకుపడటంతో సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులు స్పందించారు. ఇప్పుడు క్రికెట్ వర్గాలకు చెందిన మాజీలు, ప్రస్తుత క్రికెటర్లు కూడా తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ధర్మో రక్షతి రక్షిత:.. జైహింద్ భారత సేన అంటూ పోస్ట్ చేశారు. నెక్ట్స్ వరుణ్ చక్రవర్తి, సురేష్ రైనాలు ఆపరేషన్ సింధూర్ అని పోస్ట్ షేర్ చేశారు. ఆకాశ్ చోప్రా తన సోషల్ మీడియాలో ఎల్లవేళలా సపోర్ట్ గా నిలుస్తాం.. జై హింద్ అంటూ పోస్ట్ చేశారు. 

గౌతమ్ గంభీర్ జైహింద్ అంటూ.. వెంకటేష్ ప్రసాద్, ఆర్పీ సింగ్ లు జై హింద్.. భారత్ మాతాకీ జై అంటూ పోస్ట్ ను షేర్ చేశారు. చేతన్ శర్మ తన సోషల్ మీడియాలో భద్రత విషయంలో భారత్ ఏమాత్రం రాజీ పడదు అని.. ఇప్పుడు ఇస్తోంది సమాధానం కాదు.. దేశానికి ఒక సందేశం అని పోస్ట్ చేశారు. సామ్ బిల్లింగ్స్.. భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు త్వరగా చక్కబడాలి అని షేర్ చేశారు. నెక్ట్ సచిన్ టెండుల్కర్ తన సోషల్ మీడియాలో ఐక్యతలో భయం ఉండదు. బలంలో అవధులు ఉండవు. ప్రజలే భారత దేశ కవచం. ఈ ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు. మనదంతా ఒకటే జట్టు అని పోస్ట్ ను షేర్ చేశారు.

 

Advertisement

Latest News

అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ.. అందెగత్తెలతో అదిరిపోయిన పాతబస్తీ..
ముద్దుగుమ్మల వాక్ తో కళకళలాడిన ఓల్డ్ సిటీహెరిటేజ్ వాక్ తో కోలాహలంగా మారిన చార్మినార్అందెగత్తెలు అదిరిపోయే రేంజ్ లో స్వాగతం పలికిన లాడ్ బజార్ వ్యాపారులుచౌమోహల్లా ప్యాలెస్...
చీటింగ్ కేసులో ఓ ఛానల్ అధినేత శ్రవణ్ రావు అరెస్ట్
పాతబస్తీ చాంద్రాయణగుట్టలో భారీ ర్యాలీ
పోటాపోటీగా ఎక్సైజ్ టీమ్ ల దాడులు.. భారీగా గంజాయి స్వాధీనం
గ్రామపంచాయతీ ఉద్యోగుల సభకు రావాలని మంత్రికి వినతి
నిధుల కేటాయింపుకై కమిషనర్ కి ఎమ్మెల్యే వినతి
నకిలీ సర్టిఫికెట్లు తయారు చేస్తున్న ముఠా అరెస్ట్