ఆ తల్లికూతుళ్లే మిగిలారు.. సినీ తారలూ వస్తారు..!

By PC RAO
On
ఆ తల్లికూతుళ్లే మిగిలారు.. సినీ తారలూ వస్తారు..!

సిట్ కార్యాలయానికి క్యూ కట్టిన ట్యాపింగ్ బాధితులు

ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ, ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం నమోదు

తర్వాత షర్మిల, విజయమ్మ స్టేట్మెంట్ అంటున్న అధికారులు

నేతలు పూర్తి అయితే సిట్ ముందుకు సినీ తారలు

V. Krishna Kumar
TPN, స్పెషల్ డెస్క్

ఫోన్ ట్యాపింగ్ కేస్ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్.. బీజేపీ నేతలు, ఎంపీ ఎమ్మెల్యేలు సిట్ కార్యాలయానికి క్యూ కట్టారు. తమ ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని సిట్ ద్వారా తెలుసుకొని సాక్షులుగా వాంగ్మూలం ఇచ్చేందుకు ఒకరి తరువాత ఒకరు హాజరయ్యారు. చివరకు ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి, ఏబీఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ సైతం జూబ్లీహిల్స్ పిఎస్ లోని స్పెషల్ ఇన్ వెస్టిగేషన్ టీమ్ ఎదుట గంటకు పైగానే హాజరై తమ స్టేట్మెంట్ అందించారు. ఇప్పటి వరకు 600కు పైగా ఫోన్స్ ట్యాపింగ్ చేసినట్లు గుర్తించిన వారిలో పలు పార్టీలకు చెందిన  బడా నేతలు ఈటెల రాజేందర్ లాంటి వారు కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఆ తల్లి కూతుళ్లు మిగిలారని వారిని కూడా విచారణ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం వారికి నోటీసులు అందించాలని సంకల్పించారు. 

వారెవరో కాదు మాజీ సీఎం జగన్ సోదరి షర్మిల, తల్లి వైఎస్ విజయమ్మ. ఇక విచారణకు రావడం వారి వంతైంది. వీలైనంత త్వరగా వారిని కూడా పిలిచి స్టేట్మెంట్ సేకరించాలని సిట్ భావిస్తోంది. ఆంధ్ర ఎన్నికల సమయంలో షర్మిల తన అన్న జగన్ ని విభేదించడం, తల్లి విజయమ్మ కూడా షర్మిలకె వత్తాసు పలకడం జరిగింది. ఈ సమయంలోనే తెలంగాణలో జరిగే ఫోన్ ట్యాపింగ్ సహాయంతో వారి సంభాషణలు రికార్డ్ చేసి అందించినట్లు తేలింది.  అందుకే వారు కూడా స్టేట్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

ఇప్పటికే దాదాపు 500మందికి పైగానే సాక్ష్యాలను సిట్ అధికారులు విచారించారు. అందులో నేతలు, మీడియా ప్రతినిధులు, అడ్వకెట్లు, పోలీస్ ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. వారందరి విచారణ పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇక మిగిలింది అప్పటి డీజీపీ మహేందర్ రెడ్డి, షర్మిల, విజయమ్మతో పాటు బిఆర్ఎస్ బాస్ లు అలాగే సినీ తారలు కొందరు ఉన్నట్లు చెప్పుకొచ్చారు. నేతలు, బడా వ్యాపారులు పూర్తి అయితే తరువాత ట్యాప్ అయిన సినీ తారలను పిలుస్తామన్నారు. చివరగా బిఆర్ఎస్ బడా, చోట బాస్ లు సైతం విచారణకు రావాల్సిందేనని  కరాఖండిగా చెబుతున్నారు. 

తీగలాగితే డొంక కదిలింది అన్న చందంగా 13నెలల పాటు ముప్పతిప్పలు పెట్టిన మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు రావడం సిట్ దర్యాప్తులో అనేక ట్విస్ట్ లు వెలుగు చూశాయి. ఒక దశలో ట్యాపింగ్ వ్యవహారం కూడా చాలా మటుకు పూర్తయిందని అధికారులు చెప్పుకొస్తున్నారు. ప్రతిరోజు పదుల సంఖ్యలో ఒకరకంగా చెప్పాలి అంటే బాధితులను విచారణ చేపడుతున్నారు.

Advertisement

Latest News

డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్.. డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
దిగుమతి స్థాయి నుండి ఎగుమతి స్థాయికి మారిన డ్రగ్స్ దందా..సిటీ శివారు ప్రాంతాల్లో వ్యాపారం సాగుతున్నట్లు అనుమానంపారిశ్రామిక వాడల్లో తయారీ కేంద్రంగా మారుతున్న మూతబడిన ఫ్యాక్టరీలు..ప్రత్యేక నిఘా...
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు
విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్