AP Political Survey: ఏపీ రాజకీయాలపై సంచలన సర్వే... గ్రీన్‌జోన్‌లో జగన్.. రెడ్ జోన్‌లో కూటమి ఎమ్మెల్యేలు.. బాబు, పవన్ పరిస్థితేంటి..?

By PC RAO
On
AP Political Survey: ఏపీ రాజకీయాలపై సంచలన సర్వే... గ్రీన్‌జోన్‌లో జగన్.. రెడ్ జోన్‌లో కూటమి ఎమ్మెల్యేలు.. బాబు, పవన్ పరిస్థితేంటి..?

ఏపీ రాజకీయాలపై రైజ్ సంచలన సర్వే

ప్రభుత్వం ఓకే.. ఎమ్మెల్యేలపై జనం ఫైర్

గ్రీన్‌జోన్‌లో బాబు, పవన్, లోకేశ్, జగన్

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అయింది. ఈ ఏడాదిలో తాము ఏం చేశామో అధికార టీడీపీ-జనసేన-బీజేపీ (TDP-Janasena-BJP) చెప్తుంటే.. ప్రభుత్వం ఏం చేయలేదో వైఎస్సార్సీపీ (YSRCP) ప్రచారం చేస్తోంది. ఐతే కూటమి ప్రభుత్వంపై ప్రజలు ఏమనుకుంటున్నారనేది ఇక్కడ తేలాల్సిన అతిముఖ్యమైన పాయింట్. ఈ నేపథ్యంలో రైజ్ అనే సంస్థ కూటమి ఏడాది పాలనపై ప్రొగ్రెస్ రిపోర్ట్‌ను (AP Political Survey-2025) రిలీజ్ చేసింది. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్సే ఉన్నాయి.

గత ఎన్నికల్లో164 సీట్లతో అంటే 93శాతం సీట్లతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి ఇందులో 52 మార్కులే పడినా.. ఎమ్మెల్యేల విషయానికి వచ్చేసరికి కేవలం 28 మార్కులే పడ్డాయి. ప్రభుత్వం బాగున్నా ఎమ్మెల్యేల తీరు బాగోలేదని ప్రజలు ఈ సర్వేలో తేల్చి చెప్పారు. ఏకంగా 64 శాతం మంది ప్రజలు శాససనభ్యులకు దండం పెట్టేశారు. మెజారిటీ ఎమ్మెల్యేలను ప్రజలు రెడ్‌జోన్‌లో పెట్టారు. గ్రీన్ జోన్‌లో ఉన్నవారిలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌తో పాటు మాజీ సీఎం వైఎస్ జగన్ ఉన్నారు. అంతేనా కూటమి ప్రభుత్వం హిట్‌లిస్ట్‌లో మోస్ట్ వాంటెడ్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా గ్రీన్ జోన్‌లోనే ఉన్నారు. ఓవరాల్‌గా చూస్తే 175 మంది ఎమ్మెల్యేల్లో 32 మంది గ్రీన్‌జోన్‌లో ఉంటే.. 90 మంది ఆరెంజ్ జోన్‌లో ఉన్నారు. 53 మంది రెడ్‌జోన్‌లో ఉన్నారు. వీరిలో మంత్రులు కూడా ఉన్నారు.

రెడ్‌జోన్‌లో ఉన్న 53 మందిలో టీడీపీ నుంచి 34 మంది జనసేన నుంచి 13 మంది, వైసీపీ నుంచి ఎమ్మెల్యేలున్నారు. ఇదిలా ఉంటే అసెంబ్లీలో టీడీపీకి 134 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇందులో 30 మందికి రెడ్‌జోన్ వస్తే ఓకే అనుకోవచ్చు. కానీ జనసేన విషయానికి వచ్చేసరికి రెడ్‌జోన్ డేంజర్ జోన్‌గా మారిందనే చెప్పాలి. ఆ పార్టీకి ఉన్న 21 మంది ఎమ్మెల్యేల్లో కేవలం ఇద్దరు మాత్రమే గ్రీన్ జోన్‌లో ఉండగా ఏకంగా 13 మంది రెడ్‌జోన్‌లో ఉన్నారు. మిగిలిన ఆరుగురది ఆరెంజ్ జోన్.

 

ఏడాదిలోనే ఎమ్మెల్యేలపై ఈస్థాయిలో వ్యతిరేకత రావడం చూస్తే గత వైసీపీ హయాం గుర్తుకొస్తోందని విశ్లేషకులంటున్నారు. గత ప్రభుత్వం బటన్లు నొక్కి ప్రజల ఖాతాల్లో డబ్బులు వేసి అతి విశ్వాసానికి పోవడంతో పాటు ఎమ్మెల్యేల తీరుతో దారుణంగా దెబ్బతింది. ఇదే పరిస్థితి కూటమి ప్రభుత్వానికి రాకుండా ఉండాలంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు ఎమ్మెల్యేలను కంట్రోల్ చేయాల్సిందే. ఇప్పటికే కూటమి ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇసుక, మద్యం, మైనింగ్‌లో కమిషన్లు, సెటిల్మెంట్లు, కాంట్రాక్టుల విషయంలో ఎమ్మెల్యేల తీరు ప్రజలకు నచ్చడం లేదు. ప్రభుత్వానికి ఇంకా నాలుగేళ్ల టైమ్ ఉందే ఇప్పటినుంచే ఎమ్మెల్యేలపై కంట్రోల్ లేకపోతే కూటమికి కష్టాలు తప్పవనే మాట వినిపిస్తోంది.

Advertisement

Latest News

విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విద్యావ్యవస్థపై మావోయిస్టు పార్టీ సంచలన లేఖ
విద్యావ్యవస్థ కోసం తక్షణమే రూ. 20కోట్ల నిధులకు డిమాండ్అధికార ప్రతినిధి జగన్ పేరిట విడుదలైన లేఖవిద్యను వ్యాపారం చేసే ప్రజాప్రతినిధులకు పోటీ అవకాశం ఇవ్వొద్దుసీఎంపై వత్తిడి చేయండి.....
పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..