విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్

On
విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్

హైదరాబాద్: నిషేధిత  విదేశీ సిగరెట్లను సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ టీం, చాదర్ ఘాట్  పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకున్నారు. పైజల్  అనే వ్యక్తి అనుమతి లేకుండా విదేశాల నుంచి తక్కువ ధరకు ఢిల్లీ మీదుగా హైదరాబాద్​కు ప్రైవేట్ ట్రాన్స్ పోర్ట్ ద్వారా దిగుమతి చేస్తున్నాడు. అక్బర్ బాగ్  గోదాంలో వాటిని భద్రపరిచి  పాన్ షాప్ లు, కిరాణా షాపులకు ఎక్కువ ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ చాదర్ ఘాట్ పోలీసులు గోదాంపై దాడులు చేశారు. రూ.10 లక్షల  విలువచేసే సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు. దొకోరో బ్రాండెడ్ కు సంబంధించిన 10డబ్బాలతో పాటు వివిధ బ్రాండ్లకు చెందిన సిగరెట్లను స్వాధీనం చేసుకున్నారు అక్బర్ బాగ్ కు చెందిన పైజల్ అనే వ్యక్తిని  అరెస్ట్ చేశారు. ఈజీగా డబ్బులు సంపాదించడానికి విదేశీ సిగరెట్ల వ్యాపారం మొదలు పెట్టాడని పోలీసులు తెలిపారు. చాదర్ ఘాట్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Latest News

ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ ను ఆ పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ప్రస్తుతం మాధవ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్నారు....
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు
విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్
మహాన్యూస్ పై దాడి కేసులో బిఆర్ఎస్ నేతల అరెస్ట్