గోదావరిలో ఇసుక డాన్.. ప్రభుత్వం ఏదైనా పెత్తనం ఆయనదే..!

By PC RAO
On
గోదావరిలో ఇసుక డాన్.. ప్రభుత్వం ఏదైనా పెత్తనం ఆయనదే..!

ఆర్కేనా మజాకా..! ఇసుక మాఫియా అంతా ఈయన కనుసనల్లోనే

ఆప్పుడు వేసీపీలో.., ఇప్పుడు టీడీపీలో.. 

ధవళేశ్వరం, కాతేరు పడవ ర్యాంపులన్నీ ఈయన ఆధీనంలోనే..!!

 

Ch.Sri 
TPN, East Godavari 
  

జీవనది గోదావరి....ఇసుక మాఫియా చేతులో నిర్జీవంగా మారుతోంది.  సుప్రీంకోర్టు తీర్పు పట్టించుకోరు.. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు బేఖాతరు చేస్తారు.  ఇష్టారాజ్యంగా యంత్రాలతో తవ్వేస్తారు.  గోదావరి నదీగర్భాన్ని విచ్చిన్నం చేస్తున్నారు.  ఇంత జరుగుతున్నా ప్రజా ప్రతినిధులుగానీ,  అధికారులు కానీ పట్టించుకోకపోవడం విశేషం. 
ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. 
గుంటూరుకు చెందిన ఆర్కె (రామకృష్ణ) అనే వ్యక్తి తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక మాఫియా కు డాన్ గా తయారయాడనే ఆరోపణల గుప్పు మంటున్నాయి.

కూటమి ప్రభుత్వం ఉచిత ఇసుక విధానాన్ని ప్రకటించి, ర్యాంపులకు అనుమతి ఇచ్చిన తొలి నుండీ... ఇక్కడి బోటు ర్యాంపుల్లో అక్రమాలు  సాగుతున్నట్లు విమర్శలు వస్తూనే ఉన్నాయి.  అదనపు వసూళ్లు, అనుమతులు లేకుండా తవ్వకాలు, అమ్మకాలు సాగుతూనే ఉన్నాను.  జూన్ నెలలో కలెక్టర్ ఆదేశాలు ఇచ్చినప్పటినుండీ.. ఇక్కడ కొనసాగుతున్న రాంపుల్లో దళారీ నేతల సారథ్యంలో ర్యాంపుల్లో అక్రమ తవ్వకాలు, లావాదేవీలు జరుగుతూనే ఉన్నాయి.   కూలీలు ఎక్కడా కనిపించడం లేదు.  డ్రెడ్జింగ్ బోట్లతో గోదావరి నిండిపోతోంది. అయితే ఇక్కడ ఆర్కే అనే వ్యక్తి కనుసన్నలలోనే ఇసుక మాఫియా కొనసాగుతున్నది అనేది బహిరంగ రహస్యం. వైసీపీ హయాంలో అప్పటి మంత్రి, ఇప్పటి మాజీ మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అలాగే. వైకాపా హయాంలో చీఫ్ అడ్వైజర్...సజ్జల రామకృష్ణారెడ్డితో సంబంధాలు ఉన్నాయంటూ వారితో దిగిన ఫోటోలు చూపిస్తూ తూర్పులో ఇసుక మాఫియా నిర్వహించి కోట్లు గడించాడు. తిరిగి ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వీరితో చేతులు కలిపి అదే హవాను కొనసాగిస్తున్నాడు. అప్పట్లో ఆర్కే ని విమర్శించిన తెలుగుదేశం జనసేన, బిజెపి నాయకులు ఇప్పుడు నోరు మెదపకపోవడం పైన పలు విమర్శలు వినిపిస్తున్నాయి.
 
రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలోని ధవళేశ్వరం, కాతేరు లోని సుమారు 12 ఇసుక ర్యాంపుల్లో అక్రమ ఇసుకను ఆర్కె అనధికార డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్న వైనం వింటే ఎవరికైనా ఆశ్చర్యం  వేయకతప్పదు. స్ధానిక ప్రజాప్రతినిధులతో ఎటువంటి సంబంధాలు లేకుండా నేరుగా అధిష్ఠానం పెద్దలతో ఆర్థిక ఒప్పందాలు కుదుర్చుకుని యధేచ్చగా ఇసుక మాఫియాను  నడుతున్న ఆర్కె తెగింపు చూస్తే అవాక్కవకమానరు.  స్థానిక నేతలకు రోజూవారి, కొందరి నాయకులకు నెలవారీ మామూళ్లు తాంబూళంగా సమర్పించుకుంటూ ఇసుక మాఫియా సామ్రాజ్యాన్ని అడ్డులేకుండా నిర్వహిస్తున్నాడంటే ఆర్కే ఏ స్థాయిలో చక్రం తిప్పుతున్నాడో స్పష్టం అవుతుంది. 

అయితే గతంలో ఇదే ఆర్కే ఇసుక మాఫియా నిర్వహిస్తుంటే  సాక్షాత్తు బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీగా చెప్పుకునే రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య  చౌదరి, ఉభయ ఉమ్మడిగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ లాంటి వ్యక్తులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో అక్రమంగా చేస్తున్న ఇసుక మాఫియా  ఆగడాలను  వీక్షించడానికి అప్పట్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో  ఇసుక రాంపులను ఒకరోజు పరిశీలించడానికి వచ్చారంటే ఇసుక మాఫియా ఏ స్థాయిలో రెచ్చిపోతుందో అర్ధం చేసుకోవచ్చు. ఐతే అదే ఆర్కె ఇప్పుడు కూడా సుఖం మాఫియాను కొనసాగిస్తుంటే సదరు నాయకులు మౌనం వహించడం పైన స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి రూరల్ వారు ధవళేశ్వరం, బుర్రిలంక, కాతేరు, తదితర ప్రాంతాల్లో యధేచ్చగా ఇసుక అక్రమ రవాణా, నిబంధనలకు విరుద్ధంగా డ్రెడ్జింగ్ జరుగుతోంది  వైకాపా రూరల్ కోఆర్డినేటర్ ఏనాడూ గొంతెత్తిన పాపాన పోలేదంటే నాయకులను, అధికారులను ఆర్కి ఏ స్థాయిలో నిర్వహించాడో స్పష్టమౌతుంది.

ప్రభుత్వ నిబంధనలతో పనిలేదు, గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు మాకు అవసరం లేదంటూ ఇక్కడ రాత్రి, పగలు తేడా లేకుండా.. దాదాపు 25 బోట్లతో నది గర్భంలో డ్రెగ్జింగ్ ఇంజన్లతో అక్రమంగా ఇసుకను తవ్వి తరలిస్తున్నా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం వల్ల కూడా పలు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాక్షాత్తు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఉన్న రాజమండ్రి రూరల్ ప్రాంతంలో ధవళేశ్వరం, బుర్రిలంక, కాతేరు ప్రాంతాల్లో రాత్రి వేళల్లో ఇష్టారాజ్యంగా ఇసుక డ్రడ్జింగ్  చేస్తున్నా పట్టించుకునే నాధుడే కరువయ్యారు.  రాత్రి 8గంటల నుండి తెల్లవారుజాము 5గంటల వరకు నిబంధనలకు విరుద్ధంగా గోదావరి తీరంలో డ్రెడ్జింగ్ చేసి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నా, సెబ్  (స్పెషల్ ఎన్మోఫోర్స్మెంట్ బ్యూరో), ఇరిగేషన్ శాఖలు గాని, అటు మైనింగ్, పోలీసు శాఖల కు చెందిన అధికారులు ముడుపులు మత్తులో చోద్యం చూస్తుండటం సిగ్గుచేటు.  

గోదావరి పరివాహక ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతింటున్న అధికారులకు లెక్కలేకుండా పోతుంది. ఇసుక మాఫియాపై వస్తున్న ఈ ఆరోపణలు నిజంచేస్తూ అధికార, ప్రతిపక్ష నాయకులు కూడా ఏనాడూ గొంతెత్తిన దాఖలాలు కనిపించడం లేదు. ఒకవైపు గోదావరి నదిని పరిరక్షిస్తామని ఎన్నికల ముందు హామీలు గుప్పించారు.  తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఇసుక పాలసీ అమలు వైకాపా కన్నా అధ్వాన్నంగా తయారైందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైసీపీ హయాంలో నదిలో ఇసుక తవ్వకాలు...అమ్మకాలు జెసి సంస్థకు అప్పజెప్పిన విషయం విధితమే.  అయితే జెసి సంస్థ ఇసుక ర్యాంపుల నిర్వహణను ఆర్కి అనే మరో సంస్థకు సబ్ లీజు ఇచ్చింది.  ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలోనే అడ్డగోలుగా గోదావరిలో డ్రెడ్జింగ్ ప్రక్రియపై ఆరోపణలు వచ్చాయి.  ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి అనుమతులు లేకపోయినా ఇసుక దందా కొనసాగడం విశేషం. 

 డ్రెడ్జింగ్ తో గోదారికీ ముప్పే.....
 ఇసుక మాఫియాకు కోట్ల రూపాలను తెచ్చిపెట్టేవి డ్రెడ్జింగ్ బోట్సే... ఉదయం వేళల్లో సాధారణంగా ఇసుకను తవ్వే మాఫియా రాత్రి 7గంటలు దాటితే చాలు ఇసుక  రేవుల్లో డ్రెడ్జింగ్ బోట్స్ యధేచ్చగా తిప్పుతుంటారు.  తెల్లవారు జాము 5గంటల వరకూ నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను తవ్వితరలిస్తారు. డ్రెడ్జింగ్ బోట్స్ కారణంగా గోదావరిపై వంతెనలకు ముప్పువాటిల్లుతుందని సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ ప్రకటించినప్పటికీ విజిలెన్స్, సెబ్ అధికారులు  డ్రెడ్జింగ్ని ఆపే సాహసం చేయలేకపోతున్నారు.  తూర్పు గోదావరి జిల్లాలో ఓపెన్ రీచ్‌ల కంటే బోట్స్‌మెన్ నిర్వహించే ఉమ్మడి ఇసుక ర్యాంపులే అధికంగా ఉన్నాయి.  వీటిలో రాజమండ్రి రూరల్ కాతేరు, ధవళేశ్వరం, జొన్నాడ ప్రాంతాల్లో బోట్స్‌మెన్ ఆధ్వర్యంలో ఇసుక ర్యాంపుల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా  డ్రెడ్జింగ్ బోట్స్ని వినియోగిస్తూ ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు.  

బోట్స్‌మెన్ రీచ్ ల్లో వినియోగించే డ్రెడ్జింగ్ మెషీన్లు అన్నీ కూడా విజ్జేశ్వరం నుండే వస్తున్నట్లు తెలుస్తుంది.  అయితే ఇరిగేషన్ ఉద్యోగుల్లో కొందరు ఈ డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది.  ఇరిగేషన్ ఉద్యోగుల్లో కొందరు విజిలెన్స్ అధికారులతో కుమ్మక్కవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.  అందుకే  అధికారులు చేపట్టే తూతూమంత్రపు తనిఖీల్లో డ్రెడ్జింగ్ బోట్లు కనిపించకుండా సాధారణ బోట్లను మాత్రమే చూపుతారు.  ఒకవేళ సెబ్ అధికారులు తనిఖీల్లో డ్రెడ్జింగ్ బోట్లు పట్టుబడితే మాత్రం లక్షలాది రూపాయలు పెనాల్టీ వేస్తారు. అనంతరం ఇసుక మాఫియా ముఠా సభ్యులు  ప్రజాప్రతినిధుల నుండి విజిలెన్స్ అధికారులకు చెప్పడం, ఎటువంటి కేసులు లేకుండా చేయడం పరిపాటిగా మారిపోయిందని ఇసుక మాఫియా నిర్వహించే సభ్యులే బహిరంగంగా చెప్పడం.  విశేషం.  ఇసుక మాఫియా ముఠా సభ్యులు మాత్రం సాధారణ బోట్, డ్రెడ్జింగ్బోట్ అనే తేడా లేకుండా ఓకేలా తయారు చేస్తారు.  పర్యావరణానికి తూట్లు పొడుస్తూ గోదావరి నదీ గర్భం నుండి భారీగా ఇసుకను తవ్వితరలించే ఇసుక మాఫియా తప్పని సరిగా వినియోగించేది ఈ  డ్రెడ్జింగ్ మిషన్లే. 

తూర్పుగోదావరి జిల్లాలో పలుచోట్ల
  సొసైటీ బోట్ రీచ్ లను ఇటీవలే ఆర్డీవోలు, జాయింట్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించి డ్రెగ్జింగ్ మిషన్లను లారీలను సీజ్ చేశారు. అలాగే పలు రాంపులను కూడా నిలిపివేశారు.  తదుపరి అనుమతులు  ఇచ్చేవరకు ఓపెన్ రీచ్‌లు నిర్వహించరాదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  అయినప్పటికీ.. రాత్రి వేళల్లో పలు రాంపుల్లో అక్రమాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు  రావడంతో.. ఆర్డీవో ఆధ్వర్యంలో వరస దాడులు జరిగాయి.  వాహనాలు, యంత్రాలు సీజ్ చేసి, కేసులు కూడా నమోదు చేశారు. 

దాడుల్లో నదీ గర్భంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న డ్రెడ్జింగ్‌పై అధికార బృందం కొరడా ఝళిపించినా సాక్షాత్తు జిల్లా కలెక్టర్ ప్రశాంతి ప్రకటనతో మైన్స్, ఇరిగేషన్, పోలీస్, విజిలెన్స్ తదితర శాఖల అధికార బృందం ఆకస్మిక దాడులు నిర్వహించినా ఇసుక మాఫియా బరితెగించి నిర్వహిస్తుందంటే ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Latest News

డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్.. డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
దిగుమతి స్థాయి నుండి ఎగుమతి స్థాయికి మారిన డ్రగ్స్ దందా..సిటీ శివారు ప్రాంతాల్లో వ్యాపారం సాగుతున్నట్లు అనుమానంపారిశ్రామిక వాడల్లో తయారీ కేంద్రంగా మారుతున్న మూతబడిన ఫ్యాక్టరీలు..ప్రత్యేక నిఘా...
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు
విదేశీ సిగరేట్ల దిగుమతి.. పోలీసుల దాడి. ఒకరి అరెస్ట్