అవసరమైతే అందరికీ ఆయుధాలు ఇస్తాము.. మంత్రి జూపల్లి

On
అవసరమైతే అందరికీ ఆయుధాలు ఇస్తాము.. మంత్రి జూపల్లి

  • ఎక్సైజ్ అధికారులతో మంత్రి జూపల్లి సమావేశం..
  • ఆదాయం పెంచేలా మార్గాలు చూడాలని సూచన..
  • డ్రగ్స్, గంజాయి, నాన్ డ్యూటీ లిక్కర్, కల్తీ కల్లుపై చర్యలకు ఆదేశం..

IMG-20250913-WA0042గంజాయి, డ్రగ్స్‌, నాటుసారా, ఎన్‌డీపీఎల్‌ నేరాలపై ఉక్కు పాదం మోపాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ప్రాణాల  రక్షణ బాధ్యతగా ప్రభుత్వంపై ఉంటుందని అన్నారు. శనివారం ఎక్సైజ్‌శాఖ భవన్‌లోని సమావేశ మందిరంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ‌ ఎస్టిఎఫ్ అండ్ డిటిఎఫ్ , ఎన్‌ఫొర్స్‌మెంట్‌ టీమ్‌లతో మంత్రి జూపల్లి సమీక్ష నిర్వహించారు. 
ఈ సమావేశంలో మంత్రితోపాటు ప్రిన్సిపల్‌ సెకట్రరీ రీజ్వీ, ఎక్సైజ్‌  కమిషనర్‌ సి.హరి కిరణ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీంతో  పాటు అడిషనల్ కమిషనర్‌ సయ్యద్‌ యాసిన్‌ ఖురేషీలు పాల్గొన్నారు.
ఎస్టీఎప్‌ టీమ్‌లు, పని చేసేవారికి అవసరమైతే ఆయుధాలను కూడ  ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.  ఈ మేరకు మంచిగా పని చేసే వారికి గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని ఆదేశించారు.
నల్లబెల్లం తయారీ, అమ్మకాలు, వినియోగంపై పూర్తి స్ధాయిలో  అధ్యాయనం చేసి ఎక్సైజ్‌ఖశాఖ పట్టుకున్న నల్లా బెల్లాన్ని రైతులకు   సేంద్రియ  ఎరువుల తయారీకి ఇవ్వడానికి అవసరమైన మార్గదర్శకాలను  తయారు చేయాలన్నారు. నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ను పట్టుకున్నప్పుడు వాటిని పగలగొట్టకుండా           వినియోంచుకోవడానికి అవకాశాలను పరిశీలించాలని, జాతీయ ఉత్పత్తిగా గుర్తించి అమ్మకాలు చేపట్టడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గంజాయితోపాటు సింథటిక్‌ డ్రగ్స్‌ తయారీ, అమ్మకాలు, రవాణ, వినియోగంపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలిని మంత్రి సూచించారు. నాచారం, చర్లపల్లిలాంటి ఇల్లిగల్ పరిశ్రలను తనిఖీలు చేపట్టడానికి  అవసరమైన కార్యాచరణ తయారు చేసుకోవాలని సూచించారు. తాడి, ఈత చెట్లను పెంపకంతోపాటు వాటిని ఎక్కి కల్లుగీచే వృతికి  యువత దూరంగా ఉన్నారని, కల్లును బ్రోవరీగా తయారు చేసే కంపెనీలు ఏర్పాటుపై చర్యలు చేపట్టాలన్నారు.
ఒకే బార్‌ లైసన్స్‌ పై ఎక్కువ బార్లు నడుపుతున్నట్లు ఆరోపణలు  వస్తున్నాయని, ఫామ్ హౌస్ లపై కూడ ప్రత్యేక నిఘా పెట్టాలని,  బ్రాండి షాపుల సిట్టింగ్‌ రూమ్‌లపై నిబంధనలు పాటించాలే చర్యలు  చేపట్టాలని, ఖాళీగా ఉన్న రైస్‌ మిల్లులను, ఇతర ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని అన్నారు.
ఎక్సైజ్‌ ఆదాయం తగ్గిందని, ఈ విషయంతో అన్ని చర్యలు తీసుకోవడానికి  ఎక్సైజ్‌ స్టేషన్ల వారిగా బేరీజు వేస్తున్నామని ఎక్సైజ్‌ కమిషనర్‌ సి.హరికిరణ్‌  అన్నారు. 
రానున్న దసరా సందర్భంగా ఎక్సైజ్‌ సేల్స్‌ పెరిగే అవకాశాలు ఉన్నాయని అన్నారు. గంజాయి, డ్రగ్స్‌, ఎన్‌డీపీఎల్‌, నాటుసారా తయారీ అమ్మకాలపై   కఠినంగా వ్యవహరించడానికి అవసరమైన ప్రణాళికలు తయారు చేశామని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం మంత్రికి తెలియజేశారు.
ఈ సమావేశంలో అన్ని జిల్లా డిప్యూటి కమిషనర్లు, అసిస్టెంట్‌  కమిషనర్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, ఎస్టిఎఫ్,డిటిఎఫ్, టీమ్‌లు సమావేశంలో పాల్గోన్నారు.

Advertisement

Latest News