వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు

On
వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు

  • 1704 ఇతర రాష్ట్రాల మద్యం సీజ్
    గడిచిన పదేళ్లలో ఈ సరే అధికం అని చెప్పిన అధికారులు
    సిటీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, జిల్లాలో నాటుసారా స్వాధీనం..
    మరో వారం పాటు స్పెషల్ డ్రైవ్ కొనసాగింపు..

By. V. Krishna kumar
Tpn: స్పెషల్ డెస్క్.
నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ పై ఎక్సైజ్‌ అధికారులు కన్నెర్ర చేశారు. దసరా పండుగ సందర్భంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వారం రోజుల్లో రికార్డు బద్దలు కొట్టారు. రికార్డు స్థాయిలో 1704 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణకు అక్రమంగా రవాణ అవుతున్న మద్యం బాటిళ్లపై ఎక్సైజ్‌ శాఖ  నిఘా పెట్టింది. దసరా పండుగ సందర్భంగా కొందరు అక్రమార్కులు ఇతర రాఫ్ట్రాల నుంచి తక్కువ ధరలకు మద్యం బాటిళ్లను కొనుగోలు చేసి ఎయిర్‌ లైన్స్, రైళ్లలోను, బస్సులు ఇతర వాహనాల్లో దిగుమతి చేసి తెలంగాణ అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా అక్రమంగా రవాణ అవుతున్న నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ వల్ల తెలంగాణ  ఎక్సైజ్‌ శాఖకు భారీగా నష్టాలు వస్తున్నాయి. 
ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌ వాజ్‌ ఖాసీం ఈ నెల15 నుండి 30 వరకు ఎన్‌డీపీఎల్‌, అండ్‌ నాటుసారా తయారీ, అమ్మకాలపై స్పెషల్‌  డ్రైవ్‌ చేపట్టారు. ఈ ఎన్‌డీపీఎల్‌ స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా ఎస్టీఎఫ్‌ (స్టేట్‌ టాస్క్‌ ఫోర్స్‌), డీటీఎఫ్‌  (డిస్ట్రిక్‌ టాస్క్‌ ఫోర్స్‌), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు, ఎక్సైజ్‌ టీమ్‌లు గత వారం రోజులుగా ప్రత్యేక దాడులు నిర్వహిస్తున్నారు.
వారం రోజుల్లో 1704 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం  బాటిళ్ల విలువ రూ 68.16 లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. మరో వారం రోజుల పాటు జరిగే దాడులు కొనసాగుతాయని డైరెక్టర్ షానవాజ్ ఖాసీం తెలిపారు. 
ఇదే స్థాయిలో నాటుసారాపై దాడులు..
వరంగల్‌ జిల్లాలోని మహాబూబాబాద్‌, భూపాల్‌పల్లి, మహాబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌  సూర్యపేట్‌ అదిలాబాద్‌, ఖమ్మం జిల్లాలో నిత్యం ఎక్సైజ్‌ సిబ్బందితోపాటు ప్రత్యేక  ఎక్సైజ్‌ టీమ్‌లు దాడులు నిర్వహించి నాటుసారాను అరికడుతున్నారు. ఇదే తీరులో మరో వారం రోజుల పాటు నాటుసారాపై తయారీ, అమ్మకాలపై ఉక్కుపాదం మోపనున్నాయి.

రికార్డు స్థాయిలో నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ పట్టివేత..
  పదేళ్లలోను, గత మూడు సంవత్సరాల్లో ఎన్‌డీపీఎల్‌ పట్టుకున్న నాన్‌డ్యూటి పెయిడ్‌  లిక్కర్‌తో పోలిస్తే ఈ వారం రోజులు పట్టుకున్న మద్యం ఎక్కువగా ఉంది. గత  పదేళ్లలో తెలంగాణలో 4516 కేసులు నమోదు చేసి 3238 మందిని అరెస్టు చేసి 1,22,222 లీటర్ల ( 16,300)మద్యం బాటిళ్లను సీజ్‌ చేశారు.
2024లో 955 కేసుల్లో 513 మందిని అరెస్టు చేసి 12,807 లీటర్ల మద్యాన్ని పట్టుకున్నారు.
ఈ సంవత్సరం ఆగస్టు నాటికి 644 కేసుల్లో 381 మందిపై కేసు నమోదు చేసి, 8201 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. కాని వారం రోజుల్లోనే 1704 మద్యం బాటిళ్లను సీజ్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

వారం రోజుల పాటు గట్టిగా పని చేయండి.. షాన్‌వాజ్‌ ఖాసీం,(ఐపీఎస్‌).
ఎన్‌డీఫిఎల్‌, నాటుసారా నియంత్రణపై ఎక్సైజ్‌ టీమ్‌లు బాగా పని చేస్తున్నాయి . భారీగా మద్యం, నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన వారం రోజులు కూడ మరింత పట్టుదలతో పని చేయాలని స్పెషల్‌ టీమ్‌లకు ఎక్సైజ్ డైరెక్టర్ షానవాజ్ ఖాసీం పిలుపునిచ్చారు.  ప్రధానంగా ఎన్‌డీపీఎల్‌పై గట్టి నిఘా పెట్టి ఇతర  రాష్ట్రాల నుంచి మద్యం రాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేశారు.

Related Posts

Advertisement

Latest News

వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
1704 ఇతర రాష్ట్రాల మద్యం సీజ్గడిచిన పదేళ్లలో ఈ సరే అధికం అని చెప్పిన అధికారులుసిటీలో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్, జిల్లాలో నాటుసారా స్వాధీనం..మరో వారం...
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు
ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు..
అవసరమైతే అందరికీ ఆయుధాలు ఇస్తాము.. మంత్రి జూపల్లి
ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడు చూడలేదు..
మంత్రిని కలిసిని జెసిహెచ్ఎస్ఎల్ బృందం..