ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..

On
ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..

  • ఉధృతంగా ప్రవహిస్తున్న మూసీ నది
    నీటమునిగిన మహాత్మాగాంధీ బస్టాండ్
    వందలాది మంది ప్రయాణికులను.. జనాలను కాపాడిన డిఆర్ఎఫ్
    శివారు ప్రాంతాల్లో బస్సులను నిలిపివేసిన అధికారులు

By. V. Krishna kumar
Tpn:  స్పెషల్ డెస్క్..
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ ని అల్లకల్లోలం చేశాయి. ఎక్కడ చూసినా వరద నీరే.. ఏ ప్రాంతం వెళ్లిన నీటిలో చిక్కుకున్న బస్తీలే.. ఆదుకునే వారి కోసం ఎదురుచూస్తున్న జనం.. ఎటు వెల్లాలో తెలియదు.. ఇంట్లో ఉండలేని పరిస్థితి.. గంట గంటకు పెరుగుతున్న నీటి ఉదృతి.. అరచేతిలో ప్రాణాలు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముంపుప్రాంతాలే కాదు ఈ సారి వర్షాలకు ఎవరు ఊహించని విధంగా అనేక ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. తెల్లవార్లు కంటిమీద కునుకు లేకుండా హైడ్రా డిఆర్ఎఫ్ బృందాలు పని చేశాయి. అనేక మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. భారీ వర్షాల నేపథ్యంలో జంట జలాశయాలైన గండిపేట, హిమాయత్ సాగర్ నీటి మట్టం విఫరీతంగా పెరిగింది. దీంతో అధికారులు వెంటనే నీటిని దిగువ ప్రాంతాలకు వదిలారు. అంతే ఒక్కసారిగా మూసీ పరివాహక ప్రాంతాలు జలమయమయ్యాయి. అర్ధరాత్రి నీరు బస్తీలు, కాలనీలను ముంచెత్తాయి. భయంతో వణికి పోయిన జనాలకు దేవుడే దిక్కు అన్నట్లు.. డిఆర్ఎఫ్ బృందాలు దిక్కైనాయి. మూసి నది ఒడ్డున నిర్మితమైన మహాత్మాగాంధీ బస్టాండ్ పూర్తిగా మునిగిపోయింది. ఎటు చూసినా నీరే బయటకు వెళ్లేదారి దారి లేక వందలాది మంది ప్రయాణీకులు బస్టాండ్లో చిక్కుకుపోయారు. వెంటనే అక్కడికి చేరుకున్న డిఆర్ఎఫ్ బృందాలు తాళ్ల సహాయంతో ప్రయాణికులను బయటకు తీసుకు వచ్చారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బస్సులు కూడా బస్టాండ్ లోవాలికి వెళ్లే దారి లేక రోడ్లపైనే నిలిచిపోయాయి. మిగతా బస్సులను శివారు ప్రాంతాల్లో నిలిపివేశారు.
చాదర్ ఘాట్ మీద రాకపోకలు బంద్..
 ఇక చాదర్ ఘాట్ పరిస్థితి చెప్పాల్సిన పరిస్థితి లేదు. మొత్తం మూసానగర్ నుండి మొదలుకొని, ఓల్డ్ మలక్ పేట, రేస్ కోర్స్ రోడ్డు బస్తీలన్ని నీట మునిగాయి. అక్కడి ప్రజలను సైతం అధికారులు సురక్షితం ప్రాంతాలకు తరలించారు. కోఠి నుండి దిల్ షుఖ్ నగర్ వెళ్లే చాదర్ ఘాట్ బ్రిడ్జి రాకపోకలు నిలిపివేశారు.
...నలుగురి ప్రాణాలు కాపాడిన డిఆర్ఎఫ్...
నార్సింగి - మంచిరేవుల మధ్య ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డులో వరదలో చిక్కుకున్న నలుగురిని హైడ్రా DRF బృందాలు శుక్రవారం రాత్రి కాపాడాయి. ఉస్మాన్ సాగర్ (గండిపేట) గేట్లు ఎత్తడంతో భారీగా వచ్చిన వరదతో సర్వీసు రోడ్డు మీద నుంచి వరద పారుతోంది. ఆ మార్గంలో వెళ్లరాదని బారికేడ్లు పెట్టినా పట్టించుకోకుండా ఆటో ట్రాలీ లో రోడ్ దాటేందుకు ప్రయత్నించాడు డ్రైవర్. అప్పుడు ఆటో ట్రాలీలో డ్రైవర్ తో పాటు నలుగురు ఉన్నారు. కొంత దూరం వెళ్ళేసరికి వరద ఎక్కువ ఉండడంతో ఆటో ట్రాలీ ఆగిపోయింది. అక్కడ ఉన్న పోలీసులు, హైడ్రా DRF సిబ్బంది గమనించి వాళ్ళని సురక్షితంగా కాపాడారు. వాళ్లను ఒడ్డుకు చేర్చారు.  ఆటో ట్రాలీ కి తాడు కట్టి DRF వెహికల్తో బయటకు లాగారు.
సీఎం సమీక్ష..
వరద దాటిమికి మునిగిపోయిన ప్రాంతాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా చూసిన హైడ్రా డిఆర్ఎఫ్ బృందాల పనితీరును ఆయన అభినందించారు. ఇక పలు శాఖల అధికారులతో సీఎం సమీక్షించారు. వర్షాల నేపధ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పునరావాస కేంద్రాల్లో జనాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశించారు.

Related Posts

Advertisement

Latest News

కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.. కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు..
- శాటిలైట్ హ్యాక్ చేసి.. సినిమాలు పైరసీ చేశారు..- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పైరసీ- ఒరిజినల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు- తెలుగు సినీ పరిశ్రమకు రూ. 3700...
మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..
ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..
వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు
ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు..