ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు
By V KRISHNA
On
మహేశ్వరం నియోజకవర్గంలోని ఎమ్మెల్యే క్యాంపు కా
ర్యాలయంలో అంగన్వాడీ టీచర్లు తమ సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కలిసి వినతిపత్రం సమర్పించారు. అంగన్వాడీలను నిర్వీర్యం చేసే విధంగా ప్రీ ప్రైమరీ స్కూల్లను ఏర్పాటు చేయడం తగదని, వాటిని అంగన్వాడీ టీచర్లకే అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రేవంత్ రెడ్డి సర్కార్ 18 వేతనం అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ల సమస్యలు న్యాయమైనవేనని, వారి తరఫున రాబోయే అసెంబ్లీలో గళం విప్పుతానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు వారి పక్షాన పోరాటం కొనసాగిస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గంలోని అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
Related Posts
Latest News
11 Oct 2025 07:09:40
*ఆక్రమణలను తొలగించిన హైడ్రా*దాదాపు 12.50 ఎకరాల ప్రభుత్వ భూమి స్వాధీనం*దాదాపు రూ. 1100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

.jpeg)