మిథున్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేత, సిట్ ఏం చేయబోతోంది?
లిక్కర్ స్కామ్ లో ఏ4 గా మిథున్ రెడ్డి
మాస్టర్ మైండ్ ఆయనేనని లూథ్రా వాదనలు
మిథున్ రెడ్డి విచారణకు సహకరించలేదన్న లూథ్రా
ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పు
మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ లో ఏ4 గా ఉన్న మిథన్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో గతంలో మద్యం సరఫరా వ్యవస్థ, లిక్కర్ ఆర్డర్లన్నీ ఆన్‌లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా సాగేవని.. వైసీపీ ప్రభుత్వం హయాంలో మాన్యువల్ విధానాన్ని తెచ్చారని.. ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదించారు. అంతేకాకుండా అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలన్నీ మిథున్ రెడ్డి నియంత్రలో పెట్టుకుని.. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారని.. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల నష్టం జరిగిందని లూథ్రా హైకోర్టుకు తెలిపారు.
ఈ కేసులో ఆయనే మాస్టర్ మైండ్ అని పలువురు సాక్షులు తమ వాంగ్మూలంలో చెప్పారని.. అయితే మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సహకరించడం లేదన్నారు. ఆయనపై 8 కేసులు ఉన్నాయని.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయమని లూథ్రా వాదనలు వినిపించారు. అటు మిథున్‌రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి.. ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానంతో తన క్లైంట్ కు సంబంధం లేదని ఆయనకు షరతులతో కూడి బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిసిన వెంటనే తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. లిక్కర్ కేసు విచారణ చేస్తున్న సిట్ అధికారులు ఇప్పటికే మిథున్ రెడ్డి పాత్రపై కీలక ఆధారాలు సేకరించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ హైకోర్టు కొట్టివేయడంతో అరెస్ట్ తప్పదన్న ప్రచారం మరింత జోరందుకుంది.
మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. లిక్కర్ స్కామ్ లో ఏ4 గా ఉన్న మిథన్ రెడ్డి తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాష్ట్రంలో గతంలో మద్యం సరఫరా వ్యవస్థ, లిక్కర్ ఆర్డర్లన్నీ ఆన్‌లైన్ పద్ధతి ద్వారా పారదర్శకంగా సాగేవని.. వైసీపీ ప్రభుత్వం హయాంలో మాన్యువల్ విధానాన్ని తెచ్చారని.. ఈ వ్యవహారంలో మిథున్ రెడ్డిదే కీలక పాత్ర అని సిట్ తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా హైకోర్టులో వాదించారు. అంతేకాకుండా అమ్మకాలు, కొనుగోళ్ల లావాదేవీలన్నీ మిథున్ రెడ్డి నియంత్రలో పెట్టుకుని.. ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకున్నారని.. దీంతో ప్రభుత్వ ఖజానాకు రూ.3,500 కోట్ల నష్టం జరిగిందని లూథ్రా హైకోర్టుకు తెలిపారు.
ఈ కేసులో ఆయనే మాస్టర్ మైండ్ అని పలువురు సాక్షులు సిట్ అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పారని.. అయితే మిథున్ రెడ్డి విచారణ సందర్భంగా సహకరించడం లేదన్నారు. ఆయనపై 8 కేసులు ఉన్నాయని.. ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయమని లూథ్రా వాదనలు వినిపించారు. అటు మిథున్‌రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి.. ప్రభుత్వం తెచ్చిన మద్యం విధానంతో తన క్లైంట్ కు సంబంధం లేదని ఆయనకు షరతులతో కూడి బెయిల్ ఇవ్వాలని కోరారు. వాదనలు ముగిసిన వెంటనే తీర్పును రిజర్వ్ చేసిన హైకోర్టు న్యాయమూర్తి.. మిథున్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చారు. దీంతో సిట్ అధికారులు ఆయనను అరెస్ట్ చేస్తారన్న ప్రచారం మరింత జోరందుకుంది.