మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..

On
మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..

  • అధికారుల అండదండలతో ఆదిత్య కన్ స్ట్రక్షన్ నిర్మాణం
    - క్షేత్రస్థాయిలో పరిశీలించినా ఫలితం శూన్యం..
    - ఇరిగేషన్ నిబంధనలకు నీళ్లోదిలిన అధికారులు..
    - మూసీ అని తేలిన ఎన్ఓసి ఇచ్చిన బాసులు..
    - హైడ్రా వ్యవహారంపై జనాలకు పలు అనుమానాలు..

IMG-20250928-WA0069By. V. Krishna kumar

Tpn: special desk..

భారీ వర్షాలు హైదరాబాద్ నగరాన్ని అతలాకుతలం చేశాయి.. జంటనగరాల జలాశయాలు నిండుకుండలా మారి మూసీకి నీరు పోటెత్తింది. ఫలితం ఎటు చూసినా ప్రవాహం.. హైదరాబాద్ మొత్తం నీట మునిగింది. అయితే ఇంత జరుగుతున్నా అక్కడ మాత్రం కబ్జా పర్వం కొనసాగుతూనే ఉంది. పేద, మధ్య తరగతి వారి నడ్డి విరిచి రోడ్డున పడేసే హైడ్రా మాత్రం అటువైపు కన్నెత్తికుడా చూడటం లేదు. కారణం దాని వెనుక ఉన్న బడా నేతలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వడ్డించే వాడు మనవడు అయితే భోజన బంతిలో ఎక్కడ కూర్చున్న అన్ని అందుతాయి అన్నట్లు.. కాసుల పంట పడిందో మరి బఫర్ జోన్ అయిన ఆ బడా రియల్టర్ కి ఎన్ఓసి ఇట్టే వచ్చేసింది.
రియల్ వ్యాపారంలో రంగారెడ్డిజిల్లా అధ్వానంగా మారింది. ఏ భూములను కొనుగోలు చేయాలి. ఎక్కడ నిర్మాణాలు చేపట్టాలనే ఆలోచన లేకుండా వ్యాపారుల వ్యవహారం కనిపిస్తున్నది. అతి తక్కువ ధరకు భూములు కొనుగోలు చేయాలి. అందులో ఉండే లోపాలను సరిచేసుకునేందుకు అధికారులను మచ్చిక చేసుకోవాలి. అప్పుడు అనుమతులున్నాయని ప్రశ్నించే వారిపై రక్షణ బలగాలతో బెదిరింపులకు పాల్పడటం ఆలవాటై పోయింది. అంతేకాకుండా స్థానికంగా ఉండే ప్రజలు ఉన్నతాధికారులకు లోపాలపై ఫిర్యాదు చేసే చర్యలు తీసుకోవాలని ప్రయత్నించే వారిపై రాజకీయ నాయకులతో ఒత్తిడి చేయడం మరో పనైపో యింది. అధికారులు చేసే తప్పిదాలతో ఆ వ్యవస్థల పైనే రియల్ సంస్థలు స్వారీ చేసే పరిస్థితి కనిపిస్తు న్నది. ఇలా రియల్ వ్యాపారులు ఆడిందే ఆటగా జిల్లాలోని మణికొండ, నార్సింగి మున్సిపాలిటీల్లో ఎక్కడ చూసినా కనిపిస్తుంది. అయినా రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ, టౌన్లోనింగ్ అధికారులకు ఇవేవీ కనపడక పోవడం విడ్డురం.
మూసీలోనే ఆదిత్య భవనం నిర్మాణం..
జిల్లాలో అత్యంత ప్రధానమైన వాగు మూసీ. ఈ
నది పక్కన నిబంధనలకు విరుద్దంగా పెద్ద పెద్ద బహుళ అంతస్థులు నిర్మిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి మున్సిపాలిటీ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఆదిత్య కన్ స్ట్రక్షన్ పూర్తిగా నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపడుతొందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నార్సింగి మున్సిపాలిటీలోని సర్వే నెంబర్ 476లో 16 ఎకరాల 25 గుంటల భూమిలో బహుళ అంతస్థల నిర్మాణం కొనసాగిస్తున్నారు. ఈ నిర్మాణం ఇరిగేషన్ శాఖ నిబంధనలకు పూర్తి విరుద్ధం. అయినప్పటికీ రెవెన్యూ శాఖ, ఇరిగేషన్ శాఖలు ఇచ్చిన నివేదికతోనే హెచ్ఎండీఏ అనుమతులిచ్చి నట్లు ప్రచారం సాగుతొంది. ఈ కన్ స్ట్రక్షన్ మూసి వాగు ప్రవహించే ఎడమ వైపు నిర్మిస్తున్నారు. అందుకోసం నిర్మాణం చేసే భూ విస్తీర్ణం చూట్టు బ్లూ కలర్ రేకులు అమర్చారు. అయితే గండిపేట్ (ఉస్మాన్ సాగర్) జలశయానికి 15 గేట్లు ఉన్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలశయం లోని అన్ని గేట్లను వదిలినప్పుడు ఆదిత్య కన్ స్ట్రక్షన్ నిర్మించే ప్రాంతం మొత్తం నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం నీటి ఉదృత్తి తగ్గినప్పటికీ వరద ఆనవాళ్లు కంటికి కనిపిస్తున్నాయి. కానీ అనుమతులిచ్చిన హెచ్ఎండీఏకీ, ఆ సంస్థ ప్రతినిధులకు మద్దతుగా నిలిచిన రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులకు మాత్రం కనిపించకపోవడం విడ్డూరంగా ఉంది. ఉస్మాన్ సాగర్ జలశ యానికి వరద ఉదృత్తి పెరిగినప్పుడు మొత్తం 15 గెట్లు పైకి 4 ఫీట్ల ఎత్తుకు ఎత్తిన ప్పప్పుడు ఆదిత్య కన్ స్ట్రక్షన్ నిర్మించే నిర్మాణాలకు ప్రమాదం తప్పక పొంచి ఉంటుంది.
*బఫర్ జోన్ ను పరిగణలోకి తీసుకోని అధికారులు...*
     చెరువులు, కుంటలు, నదులు పట్టించుకోకుండానే అనుమతులు ఇవ్వడంతో వర్షాలు వచ్చినప్పుడు ప్రమాదం గుర్తుకు వస్తుంది. ప్రభుత్వ అధికారులకు, మున్సిపాలిటీలకు ప్రమాదాలు సంభవించినప్పుడు, ప్రాణ, ఆస్తి నష్టం జరిగినప్పుడు భాదపడుతుంటారు. కానీ నిర్మాణాలు జరిగేటప్పుడు నిబంధనలకు అనుగుణంగా అనుమతులు జారీ చేస్తే భవిష్యత్తు బాధపడే అవకాశం ఉండదు. కానీ అధికారుల అవసరాలకు వచ్చే ముడుపులనే ప్రామాణికంగా తీసుకొని వినియోగదారుల, ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారు. సుమారుగా 300 ఫీట్కా వెడల్పుతో ప్రవహించే మూసీ పక్కనే నిర్మాణాలు జరు గుతున్న పట్టించుకోని అధికారులు జిల్లాలో ఉండటం బాధకరం. కనీసం అనుమతులి చ్చేటప్పుడు కనుమరుగైన నాలాలు, వాగులు ఉంటే తెలియదని అనుకోవాలి. కానీ నిత్యం వేల సంఖ్యలో మిలియన్ గ్యాలన్ల నీరు ప్రవహిస్తునే ఉంటుంది. అలాంటి మూసి పక్కన ప్రమాదకరంగా మారే బహుళ అంతస్థులు చేపడతుంటే అధికారులు నిర్లక్ష్యంగా వ్యవ హారిస్తున్నారు. ఇలాంటి వ్యాపారులపై చట్ట రీత్యా చర్యలు తీసుకొని వినియోగదారులను సంరక్షించుకోవాలని పర్యావరణ వేత్తలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.
హైడ్రా ఏమైనట్లు...
మూసీ పరివాహక ప్రాంతంలో అతి పెద్ద నిర్మాణం ఆదిత్య కన్ స్ట్రక్షన్ నిర్మాణం చేపడుతున్న హైడ్రా అటువైపు చూడలేదని విమర్శలు అనేకం.. అనేక ఇండ్లు నేలమట్టం చేశాము.. నదులు, చెరువుల పరిరక్షనే మా బాధ్యత అన్న అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని జనం ప్రశ్నిస్తున్నారు. 50వేల కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడాము అని  చెప్పుకునే హైడ్రాకి ఈ నిర్మాణం కనిపించలేదా అని నిలదీస్తున్నారు. దీని వెనుక ఉన్న బడా నేతలు, పారిశ్రామికవేత్తలకు హైడ్రా తలవంచిందా అని జనాల్లో అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాధారణ వ్యక్తులకు ఒకలా, ఫాతిమా కాలేజ్, ఆదిత్య కన్ స్ట్రక్షన్ కి ఒకలా వ్యవహరించే  హైడ్రా అధికారులు దీనికి సమాధానం చెప్పాలని నిలదీస్తున్నారు. ఫాతిమా కాలేజ్ విద్యార్థుల భవిష్యత్తు కోసం అన్నారు.. మరి ఆదిత్య కన్ స్ట్రక్షన్ అధికారుల భవిష్యత్తు కోసమా అని దుమ్మెత్తి పోస్తున్నారు. డేర్ అండ్ డ్యాషింగ్ అంటూ పేరు తెచ్చుకున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎమ్ సమాధానం చెబుతారో చూడాలి మరి.

Related Posts

Advertisement

Latest News

కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు.. కంటెంట్ తో కోట్లు కొట్టేశారు.. హైదరాబాద్ పోలీసులు కటకటాల్లోకి నెట్టారు..
- శాటిలైట్ హ్యాక్ చేసి.. సినిమాలు పైరసీ చేశారు..- అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పైరసీ- ఒరిజినల్ సినిమాలకు ఏమాత్రం తీసిపోవు- తెలుగు సినీ పరిశ్రమకు రూ. 3700...
మూసీలో ఆదిత్య అక్రమ నిర్మాణం.. హైడ్రాకు పట్టని వైనం..
ఎటు చూసినా మూసీ ప్రవాహం.. హైదరాబాద్ అల్లకల్లోలం..
వారం రోజుల్లో రికార్డ్ బద్దలు కొట్టిన ఎక్సైజ్ అధికారులు
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.
ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డిని కలిసిన అంగన్వాడి టీచర్లు
ఆ స్కూల్ లో పాఠాలు కాదు..డ్రగ్స్ తయారీ నేర్పిస్తారు..