పట్టించుకోనట్లే ఉంటూ అన్నీ పట్టించుకుంటున్నాడు – పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం..
పవన్ కల్యాణ్ రాజకీయ వ్యూహం..
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక తీసుకున్న సైలెంట్.. కానీ స్ట్రాంగ్ రాజకీయ స్ట్రాటజీపై లోతైన విశ్లేషణ.
పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యాక.. చాలామంది ఈయనేమీ పట్టించుకోవడం లేదని అనుకుంటున్నారు. కాని పట్టించుకోనట్లు ఉంటూనే అన్నీ పట్టించుకుంటున్నాడని ఇప్పుడిప్పుడే అర్ధమవుతుంది. కరెక్టుగా చెప్పాలంటే త్రివిక్రమ్ డైలాగులాగా గులాబీ మొక్కకు అంటు కట్టినట్లుగా చాలా పద్ధతిగా పని చేసుకుంటూ పోతున్నాడు. కాని వాటి ఎఫెక్ట్ మాత్రం బీభత్సంగా ఉంటుంది. డైరెక్టుగా కేబినెట్‌లోనే చర్చ పెట్టేసి.. ఏదో తెలియని విషయం అడిగినట్లుగా అడిగేసి కామ్ అయిపోతున్నాడు. కాని ఆ తర్వాత కేబినెట్‌లోనూ, కూటమిలోనూ వాటి గురించే చర్చ నడుస్తుంటే మాత్రం గుంభనంగా తన పని తాను చేసుకుపోతున్నాడు.
రీసెంటుగా కేబినెట్‌లో ఒక చర్చ పెట్టాడు. లోకల్ ఎమ్మెల్యేలు సివిల్ తగాదాల్లోకి దూరుతున్నారని.. కూటమి ఎమ్మెల్యేల మధ్య ఇష్యూస్ వస్తున్నాయని ఎవరు కూడా ఎంత చెప్పినా కాంప్రమైజ్ అవటం లేదని.. ఇవన్నీ ఇన్ ఛార్జి మంత్రులే చూసుకోవాలని చెప్పాడు. దీనిని సీఎం చంద్రబాబు కూడా సమర్ధించారు. ఇది చూడటానికి చిన్న ఇష్యూలా ఉన్నా.. గ్రౌండ్ లెవెల్లో యాక్చువల్ గా ఇదే పెద్ద ఇష్యూ. టీడీపీ ఎమ్మెల్యేలకు, జనసేన ఇన్‌ఛార్జిలకు.... జనసేన ఎమ్మెల్యేలకు, టీడీపీ ఇన్ఛార్జిలకు మధ్య పడటం లేదు. డామినేషన్ వార్ నడుస్తోంది. ఈ విషయం చాలామంది చాలాసార్లు కంప్లయింట్ చేసి విసిగిపోయి ఊరుకున్నారు. పైగా అవినీతి కూడా జరుగుతుందనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. కొందరు మాత్రం పవన్ కల్యాణ్ తమ గోడు పట్టించుకోలేదని అనుకున్నారు. కాని పవన్ మాత్రం టైమ్ వచ్చినప్పుడే గన్ ఫైర్ చేస్తున్నాడు.. అది కూడా దానికి సైలెన్సర్ పెట్టి మరీ చేస్తున్నాడు. అంటే ఆ బుల్లెట్ తగిలినోడికే సౌండ్ నొప్పి.. మిగతావాళ్లకు తెలియదు.. ఆ రేంజులో తన వ్యూహం అమలు చేస్తున్నాడు.

రీసెంటుగా భీమవరం డీఎస్పీ వ్యవహారంలోనూ అదే తంతు. జయసూర్యపై విచారణ చేయాలని ఎస్పీకి ఆదేశాలిస్తే.. మధ్యలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఎంటరై... మళ్లీ రియాక్షన్ చూసి సర్దుకున్నారు. పేకాట శిబిరాలపై డీజీపీని వివరాలడిగారు. ఎందుకంటే పేకాట శిబిరాలు గోదావరి జిల్లాల్లోనే ఎక్కువ.. పైగా అక్కడే జనసేన ఎమ్మెల్యేలు ఎక్కువ.. అవన్నీ చూశాకే ఆయన ఈ పని చేశారని అందరికీ అర్ధమైంది.
ఇక అసలు కూటమి అధికారంలోకి వచ్చాక ముందు స్ట్రోక్ పోలీసులకే తగిలింది. అసలు హోమ్ మంత్రి పని తీరునే ప్రశ్నించారు పవన్ .. అది కూడా బహిరంగంగా. ఇది పెద్ద చర్చకు దారి తీసింది. తర్వాత పవన్ తన మాటలను వెనక్కు తీసుకోలేదు .. అయినా అది సద్దుమణగక తప్పలేదు. తర్వాత రేషన్ మాఫియాపై పంజా విసిరారు. సీజ్ ద షిప్ అంటూ రేషన్ మాఫియా వ్యవహారాలపై కలకలం రేపారు. వీటన్నిటిలో ఒక విమర్శ అయితే ఉంది.. ఆయన చెబుతున్నారు గాని.. తర్వాత అదే కొనసాగుతుంది కదా అని అంటున్నారు. కాని విషయం అయితే చర్చకు వస్తుంది.. మొత్తం వ్యవస్ధను రోజుల్లో జనసేనాని మార్చలేరు కదా.. అని జనసైనికులు వాదిస్తున్నారు.
మొన్న ఎర్రచందనం దొంగలకు వార్నింగ్ ఇచ్చారు. వారితో ఎవరు కుమ్మక్కు అయినా అధికారులు, నాయకులు ఎవరినీ వదిలిపెట్టమని వార్నింగ్ ఇచ్చారు. దీంతో వాళ్లందరికీ టెన్షన్ మొదలైంది. ఎందుకంటే పవన్ అన్నాడంటే.. అని ఊరుకోడు వారికిప్పటికే అర్ధమైంది. ఆయన ఎక్కడ ఫిటింగ్ పెట్టాలో అక్కడ పెట్టేస్తాడు అని గుబులు పడుతున్నారు.
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆక్రమణలపై కలెక్టర్ విచారణ జరిపి అంత తంతు జరిగినా.. ఆయనపై యాక్షన్ తీసుకోవడంలో అంత స్పీడ్ కనపడటం లేదు. అందుకే ప్రత్యేకంగా వెళ్లి అవన్నీ రికార్డింగ్ చేసి మరీ వచ్చాడు. అంతటితో ఊరుకోలేదు.. ఆ విషయంలో కేబినెట్ లో చెప్పి అది అధికారికంగా రికార్డుల్లోకి ఎక్కేలా చేశాడు. అదీ స్ట్రాటజీ మరి. తాను తీసుకున్న ప్రతి శాఖను పంచాయతీరాజ్ తో పాటు అన్నిటిపైనా తన మార్కు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. సూపర్ అనలేం గాని.. మిగతావారి మీద బెటరనే చెప్పాలి.
ఇలా పవన్ కల్యాణ్ కూటమి ప్రభుత్వంలో తనదైన మార్క్ చూపించుకుంటున్నాడు. మరోవైపు అన్నిటిమీద నిర్మొహమాటంగా ఉంటూ.. జనసేన కూటమిలో భాగమే తప్ప.. కూటమి తప్పులను కూడా ఎత్తి చూపుతామని చెప్పకనే చెప్పాడు. పవన్ కల్యాణ్ అభిమానుల్లో, జనసేన కేడర్, లీడర్లలో మాత్రం ఇది ఉత్సాహం పెంచుతోంది.

.jpeg)