దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.

On
దసరా పండక్కి హైదరాబాద్ వస్తున్నారా.. అయితే ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే.

  • నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పై సీరియస్ ఫోకస్..
    కల్తీలపై నిఘా పెట్టాలని ఆదేశాలు
    ఈనెల 30వరకు స్పెషల్ డ్రైవ్ చేయనున్న ఎక్సైజ్.

By. V. Krishna kumar
Tpn: special desk.
దసరా సెలవుల్లో సరదాగా గడిపేందుకు మీ బంధువుల ఇంటికి సిటీకి వస్తున్నారా.. ఎంజాయ్ కోసం అయితే ఒకే.. మీ రాష్ట్రం నుండి లిక్కర్ మాత్రం తీసుకురాకండి.. అలా తెచ్చారో ఇక్కడి ఎక్సైజ్ అధికారులు మీ భరతం పడతారు.. కేసులు పెట్టి జైల్ లో తోస్తారు. ఇలాంటివే అరికట్టడానికే తెలంగాణ ఎక్సైజ్ అధికారులు నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్ పై     ఈ నెల 30 వరకు తెలంగాణ వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. విమానాశ్రయం, రైళ్లు, బస్సులు, వాహనాల్లో తనిఖీలు చేస్తున్నారు. అలాగే  పాత గోదాంలు.. రైస్‌ మిల్లుళ్లల్లో సోదాలు చెక్ పోస్ట్ వద్ద  ప్రత్యేక నిఘా పెట్టారు. 
తెలంగాణ సంస్కృతిలో  దసరా, బతుకమ్మ పండుగలను ప్రత్యేకంగా జరుపుకుంటారు. పండుగల సందర్భంగా చుక్క..ముక్క ఖచ్చితంగా ఉంటుంది.
ఈ పండుగలకు కొత్త బట్టలు, మద్యం సేవించడం పరిపాటి. ఇదే అదనుగా భావించే అక్రమార్కులు కల్తీ మద్యం, ఫ్యూరియస్  లిక్కర్‌, నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, నాటుసారా అమ్మకాలు జరిపి సొమ్ము చేసు  కోవడానికి ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు.  వీరి అగడాలకు, అమ్మకాలకు అడ్డకట్టవేయడానికి ఎక్సైజ్‌ శాఖ ఈ నెల 30 వరకు ప్రత్యేక తనిఖీలు చేపట్టడానికి ప్రణాళికలు తయారు చేశారు. పక్షం రోజుల పాటు ఈ నెల30 తేదీ వరకు అన్ని కోణాల్లో దాడులు నిర్వహించాలని ఎక్సైజ్‌ ఎన్‌ఫొర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం అదేశాలు జారీ చేశారు.
ప్రధానంగా వీటిపైనే దృష్టి..
ఎక్కువ ధరలు కలిగిన ప్రీమియం వీస్కీ మద్యం బాటిళ్లలో తక్కువ ధరలు  కలిగిన మద్యన్ని నింపి అమ్మకాలు చేపట్టె వారిపై, కల్తీ మద్యం తయారు  చేసే కేంద్రాలపై, గోవా, ఢీల్లీ, హర్యానా ప్రాంతాల నుంచి దిగుమతి అయ్యే  నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌, డిఫెన్స్ మద్యం రవాణ, దిగుమతి, అమ్మకాలపై
వీటితోపాటు నాటు సారా తయారీ అమ్మకాలు, రవాణ, వినియోగంపై  ఎక్సైజ్‌ శాఖ ఉక్కుపాదం మోపాలని డైరెక్టర్‌ అన్ని తనిఖీ టీమ్‌లకు  ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలతో ఫ్యూరియస్  లిక్కర్‌పై తెలంగాణ వ్యాప్తంగా ఎక్సైజ్‌తోపాటు ఎన్‌ఫోర్స్‌ మెంట్‌, ఎస్టిఎఫ్, టీడీఎప్‌ టీములు తనిఖీలు నిర్వహించ నున్నాయి. వరంగల్‌, మహాబూబాబాద్‌, అదిలాబాద్‌, నల్లగొండ, ఖమ్మం జిల్లాలో  కొద్ది ప్రాంతంలో తయారు అయ్యే నాటు సారా స్థావరాలపై మూక్ముడి  దాడులు నిర్వహించాలని డైరెక్టర్‌ అదేశించారు. 
నాటు సారా తయారీతో పాటు సారా తయారీకి వినియోగించే ముడిసరుకు రవాణపై కూడ నిఘా పెట్టి అడ్డుకోవాలనిచెప్పారు. ఢిల్లీ, హర్యానా, గోవా, డిఫెన్స్  క్యాంటిన్ల నుంచి అక్రమంగా దిగుమతి  అయ్యే నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ ఎక్కువగా రంగారెడ్డి, హైదారాబాద్‌,  మహబూబ్‌నగర్‌, నల్లగొండ, మెదక్‌ డివిజన్లలో నిఘా బృందాలు దాడులు  నిర్వహించాలని అదేశించారు. వీటీతోపాటు ఖాళీ గోదాముల్లోను, రైస్‌  మిల్లుల్లో అక్రమంగా తయారు అవుతున్న  కల్తీ మద్యం,  ఫ్యూరియస్ లిక్కర్‌ కి చెక్ పెట్టాలన్నారు. 
గత పదేళ్లలో ఎన్‌డీపీఎల్‌ కేసుల వివరాలు..
      తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నాన్‌ డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ అమ్మకాలపై  ఎక్సైజ్‌శాఖ ఉక్కుపాదం మోపుతూ వస్తోంది. 2014 నుంచి 2025 ఆగస్టు  నాటికి 4516 కేసులను ఎక్పైజ్‌ శాఖ నమోదు చేసింది. 3238 మందిని  ఈ కేసుల్లో అరెస్టు చేసింది. 1,22,222 లీటర్ల మద్యాన్ని సీజ్‌ చేశారు. 616 వాహనాలకు కూడ స్వాధీన పరుచుకున్నారు. 2025 జనవరి               నుంచి ఆగస్టు వరకు 644 కేసులు నమోదు చేసి 381 మందిపై కేసు  నమోదు చేశారు. 8201 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.  86 వాహనాలను సీజ్‌ చేశారు.
నాటు సారా తయారీ అమ్మకాలపై చేపట్టిన దాడులు..
   తెలంగాణలో గత పదేళ్లలో నాటు సారా తయారీ అమ్మకాలు, రవాణ సమయాల్లో దాడులు నిర్వహించి స్వాధీనం చేసుకొని నమోదు చేసిన  కేసులు భారీగా ఉన్నాయి. 2014 నుంచి 2025 ఆగస్టు నాటికి నాటుసారా తయారీ, అమ్మకాలు, రవాణపై 2,75,028 కేసులు నమోదాు చేశారు. 1,59,974 మందిపై  కేసులు నమోదాు చేశారు. 31,45,169 లీటర్ల నాటు సారాను స్వాధీనం  చేసుకున్నారు, 65,59,847 కేజీల నల్ల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 18,065 వాహనాలను సీజ్‌ చేశారు. 2025 ఆగస్టు నాటికి 10,333 కేసులు నమోదు చేసి, 9694 మందిపై కేసులు నమోదు చేసి 48,180 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 2,06,848 కేజీల బెల్లాన్ని  స్వాధీనం చేసుకున్నారు. 1633 వాహనాలను సీజ్‌ చేశారు.
15 రోజుల పాటు పటిష్టమైన దాడులు..
   15 రోజుల పాటు స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ టీములు, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్‌లు, జిల్లా టాస్‌ఫోర్స్‌ టీములతోపాటు ఎక్సైజ్‌ స్టేషన్ల సిబ్బంది కలిసి ఎన్‌డీపీఎల్‌,  నాటుసారా తయారీ అమ్మకాలపై స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టనున్నారు. ఇతర రాష్ట్రాల  నుంచి రైళ్లలోను, వాహనాల్లోను, బస్సుల్లో వచ్చే నాన్‌డ్యూటి పెయిడ్‌ లిక్కర్‌ను, స్థానికంగా తయారు చేసే నాటు సారాను రాకుండా, లేకుండా చేయడమే  లక్ష్యంగా దాడులు నిర్వహిస్తారు. సో పండక్కి రండి.. ఎంజాయి చేయండి.. అనవసరమైన ఆలోచనలు చేసి అవస్థలు కావద్దని చెబుతున్నారు.

Advertisement

Latest News