కేసీఆర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్..!
* వైద్యులను ఆరా తీసిన సీఎం రేవంత్ రెడ్డి
* కేసీఅర్ ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని యశోద ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. కేసీఆర్ కు వైద్యం అందించిన డాక్టర్లు ఆయన ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. తీవ్ర జ్వరంతోనే కేసీఆర్ హాస్పటల్ లో చేరారు. ఆయనకు షుగర్ లెవెల్స్ అధికంగా పెరిగాయని.. సోడియం లెవెల్స్ కూడా పడిపోయాయని వైద్యులు వెల్లడించారు. డయాబెటీస్ కంట్రోల్ చేసేందుకు కేసీఆర్ ను క్లోజ్ అబ్జర్వేషన్ లో ఉంచామని.. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
అంతకుముందు జ్వరంతో బాధపడుతున్న కేసీఆర్ కు బంజారాహిల్స్లోని నందినగర్ నివాసంలో వైద్యులు పరీక్షించారు. యశోద హాస్పిటల్కు మరిన్ని పరీక్షలకు రావాలని సూచించారు. డాక్టర్ల సూచనతో కేసీఆర్ సాధారణ వైద్య పరీక్షల కోసం సోమాజీగూడ యశోద ఆసుపత్రి చేరుకున్నారు.
కేసీఅర్ ఆరోగ్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా
అనారోగ్యంతో యశోద ఆసుపత్రిలో చేరిన కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. యశోద ఆస్పత్రి వైద్యులతో స్వయంగా మాట్లాడిన సీఎం రేవంత్.. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. కేసీఆర్ త్వరగా కోలుకోవాలని రేవంత్ ఆకాక్షించారు.