తెలంగాణపై రేవంత్ రెడ్డి బిగ్ ప్లాన్.. టార్గెట్ అదే..!

By PC RAO
On
తెలంగాణపై రేవంత్ రెడ్డి బిగ్ ప్లాన్.. టార్గెట్ అదే..!

తెలంగాణకు పెట్టుబడులపై రేవంత్ రెడ్డి ప్రణాళికలు

డిఫెన్స్, ఏరో స్పెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, ప్యూచర్ సిటీలపై దృష్టి

అంతర్జాతీయ వ్యాపార సంబంధాలే టార్గెట్

Suraj Reddy
TPN, HYDERABAD 

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధికి కొత్త దిక్సూచి చూపించే విధంగా భారీ పెట్టుబడులను ఆకర్షించేందుకు గట్టి కృషి చేస్తోంది. ముఖ్యంగా డిఫెన్స్, ఏరోస్పేస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, ఫ్యూచర్ సిటీల వంటి రంగాల్లో విశ్వవ్యాప్త గుర్తింపు పొందిన సంస్థలతో చర్చలు కొనసాగుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రహ్మోస్ ఏరోస్పేస్ ఎండీ డా. జైతీర్థ్ జోషి, హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సూరంపూడి సాంబశివ ప్రసాద్, DRDL డైరెక్టర్ జీ.ఏ. శ్రీనివాస మూర్తితో సమావేశమై హైదరాబాద్‌లో బ్రహ్మోస్ సంస్థను మరింత విస్తరించేందుకు కోరారు. హైదరాబాద్, బెంగుళూరు మధ్య డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, రాష్ట్ర మౌలిక వసతులు దీనికి అనుకూలంగా ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు.

ఇంతలోనే మరో కీలక రంగమైన అంతర్జాతీయ వ్యాపార సంబంధాలను అభివృద్ధి చేయడం లక్ష్యంగా మంత్రి దుదిళ్ల శ్రీధర్ బాబు మంగళవారం డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో ‘ఇండో–ఫ్రెంచ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఇఫ్కీ)’ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అత్యంత ప్రతిష్టాత్మకంగా 30వేల ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న ఫ్యూచర్ సిటీకి పెట్టుబడులు తీసుకురావడానికి కేంద్రంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. ఇది కేవలం ఒక నగరం కాదు, భవిష్యత్తు లక్ష్యంగా నిర్మించబోతున్న ప్రత్యేక ప్రణాళిక అని ఆయన తెలిపారు. అంతర్జాతీయ భాగస్వామ్యంతో తెలంగాణ బ్రాండ్‌ను ప్రపంచానికి పరిచయం చేయాలన్నదే ప్రభుత్వ సంకల్పమని మంత్రి వివరించారు.

ఇక ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సఫ్రాన్ సంస్థ కూడా తెలంగాణలో తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే హైదరాబాద్‌లో రెండు ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటు చేసిన ఈ సంస్థ, తాజాగా సఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ పేరుతో కొత్త కంపెనీని స్థాపించబోతోందని సఫ్రాన్ జనరల్ మేనేజర్ పియరీ ఫెర్నాండెజ్ వెల్లడించారు. రఫేల్ యుద్ధ విమానాలలో ఉపయోగించే M-88 ఇంజన్ల మెంటెనెన్స్, ఓవర్‌హాల్ పనులు హైదరాబాద్‌లోనే చేయనున్నారు. తద్వారా వచ్చే ఏడాది చివరినాటికి 150 ఉద్యోగాలు లభించనున్నాయి. తదుపరి దశలో మరో 750 ఉద్యోగాలు కలిగే అవకాశముంది.

ప్రభుత్వం చేపడుతున్న ఈ ప్రయత్నాలు అభినందనీయమైనవే అయినా, ప్రతిపక్షాలు మాత్రం ఇదంతా కేవలం ప్రకటనలకే పరిమితమవుతున్నాయని విమర్శిస్తున్నారు. ప్రతి పెట్టుబడి ప్రకటన వెనక కూడా కొంత ప్రచారం దాగి ఉందని, కానీ అమలులోకి రావడంలో ఆలస్యం జరుగుతోందని ఎద్దేవ చేశారు. గతంలో చేసిన పెట్టుబడుల హామీలు ఎంతవరకు కార్యరూపం దాల్చాయో కూడా పరిశీలించాలని వారు సూచిస్తున్నారు. కంపెనీలతో సమావేశాలు, ఒప్పందాల ప్రకటనలు మాత్రమే కాకుండా, వాస్తవంగా ఆ సంస్థలు స్థిరపడేందుకు అవసరమైన మౌలిక వసతులు, అనుకూల వ్యాపార వాతావరణం కల్పించారా అని  ప్రతిపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వం చేసే ప్రణాళికలు, కంపెనీల ఆసక్తి, అధికారుల చొరవ.. ఇవన్నీ కలిసి నిజంగా అమలయ్యేలా చేస్తేనే యువతకు ఉపాధి, రాష్ట్రానికి అభివృద్ధి లభించగలుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫ్యూచర్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, డిఫెన్స్ కారిడార్ వంటి మాస్టర్ ప్లాన్‌లు హద్దులు దాటి, భవిష్యత్తును మలుపుతిప్పే అవకాశంగా మారాలంటే ఇకపై ప్రతీ ప్రకటన కూడా ప్రతిఫలంగా మారేలా చూడాల్సిన అవసరం ఉంది. అప్పుడే పెట్టుబడుల వేట తెలంగాణకు నిజమైన విజయం తీసుకురాగలదు.

తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడుల వేటలో తక్షణ స్పందనతో ముందుకు సాగుతుండటం అభినందనీయమే. బ్రహ్మోస్, సఫ్రాన్, ఇఫ్కీ వంటి అంతర్జాతీయ స్థాయి సంస్థలతో చర్చలు, ఒప్పందాల ప్రకటనలు ద్వారా పెట్టుబడుల ఊపిరిని పీల్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇవి కేవలం హామీలుగా మిగిలిపోకుండా కార్యరూపం దాల్చితే, యువతకు ఉపాధి అవకాశాలు, రాష్ట్రానికి ఆర్థికాభివృద్ధి పెరుగుతాయి. ఈ ఒప్పందాలు కేవలం ప్రకటనలకే పరిమితమవుతాయా? లేకపోతే వాస్తవంగా అమలుకు నోచుకుంటాయా? వేచి చూడాలి.

Advertisement

Latest News

పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్. పక్కా ప్లాన్ ప్రకారమే చేశా.. యాంకర్ స్వేచ్ఛ కేసులో పూర్ణ స్టేట్మెంట్.
ఓ పథకం ప్రకారం ఆమెకు దగ్గరైననమ్మకం కోసం కేటిఆర్, కవిత, సంతోష్ కుమార్ ని కల్పించాఅలా నాలుగేళ్లు ఆమెతో వున్నాను..చనిపోతా అంటే నచ్చినట్లు చేయమన్నపూర్ణచందర్ రావు రిమాండ్...
డ్రగ్స్ దందాలో నయా ట్రెండ్.. ఇంపోర్టు టు ఎక్స్ పోర్ట్..
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఆయనే.. అధిష్టానం సంచలన నిర్ణయం
ట్రూ పాయింట్ న్యూస్ కి స్పందన.. సున్నం చెరువులో అక్రమ బోర్ల ధ్వంసం
పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ ప్రమాదం
ఆ నీళ్లు మీరు తాగుతున్నారా.. అయితే ఖచ్చితంగా పోతారు..
వివాదానికి దారితీసిన బల్కంపేట దేవాలయ కమిటీ ఏర్పాటు