ఎల్లకాలం 'ఎల్లో' కాలం కాదు..మేమొస్తే...సీన్ రివర్స్! : మాజీ సీఎం వైఎస్ జగన్
కూటమి ప్రభుత్వం కుట్రలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన ప్రెస్ మీట్..
తప్పుడు కేసులు, నెరవేరని హామీలు..అక్రమ అరెస్ట్లు
మూడేళ్లలో కూటమి ప్రభుత్వం కూలిపోతుంది
చంద్రబాబూ..తప్పుడు సంప్రదాయాలకు స్వస్తి పలుకు
ఏపీ వ్యాప్తంగా 5 లక్షల పింఛన్లు తొలగించారు
30 లక్షల మందికి తల్లికి వందనం ఇవ్వలేదెందుకు?
అన్నదాతసుఖీభవ, ఇన్పుట్ సబ్బిడీ ఇవ్వరా?
మహిళలకు ఇస్తామన్న నెలకు రూ.1500 అడిగితే నేరమా?
బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో దారుణమైన డైలాగులు
మరో మూడేళ్లలో కూటమి ప్రభుత్వం కూలిపోతుందని.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుందని ప్రజలకు తెలిసిపోయిందని మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. అందుకే రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన ప్రజలు తన దగ్గరకు వస్తున్నారన్నారు. ప్రజలు తన వద్దకు తరలివస్తుండడం చూసి చంద్రబాబు తట్టుకోలేక అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడని విమర్శించారు.
చంద్రబాబు వేసిన తప్పుడు విత్తనం రేపు విషవృక్షంలా అవుతుందని వైఎస్ జగన్ హెచ్చరించారు. నేను చెప్పినా... రేపు మావాళ్ళు వినే పరిస్థితి ఉండదన్నారు. చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో...తప్పు తెలుసుకో... తప్పుడు సాంప్రదాయాలు సరిదిద్దుకో...అంటూ మాజీ సీఎం జగన్ మాట్లాడారు.
రాష్ట్రంలో డీఐజీ మాఫియా డాన్.. కూటమి ప్రభుత్వంలో పరిస్థిది ఇలా తయారైందని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. పోలీసులే డబ్బులు వసూలు చేసి ఎమ్మెల్యేలకు ఇస్తున్నారన్నారు. పోలీసులు వసూలు చేసే సొమ్ములో పెదబాబుకు, చినబాబుకు వాటా వెళుతుందన్నారు. కూటమి ప్రభుత్వంలో నీచపనులు చేయలేక ఐపీఎస్ అధికారి సిద్దార్ద్ కౌశల్ వెళ్లిపోయారన్నారు.మా ప్రభుత్వంలో అధికారులు తలెత్తుకుని పని చేసేవారన్నారు. కూటమి ప్రభుత్వంలో డీజీ స్థాయి అధికారులను కూడా వేధిస్తున్నారన్నారు. సీనియర్ పోలీస్ అధికారులపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. అనేక మంది సిన్సియర్ అధికారులకు పోస్టింగ్ లు ఇవ్వకుండా తమ కక్ష తీర్చుకుంటున్నారన్నారు. ఏడాది పూర్తయినా వందల మంది పోలీసులు వీఆర్ లో ఉన్నారన్నారు. నలుగురు నాన్ క్యాడర్ ఎస్పీలు, కమాండెంట్ స్థాయి అధికారి ఒకరు, 22మంది అడిషనల్ ఎస్పీలు, 55మంది డీఎస్పీలకు నేటికీ పోస్టింగ్ ఇవ్వలేదన్నారు. మరో ఆరుగురు డీఎస్పీలు, ముగ్గురు అడిషనల్ కమాండెంట్లు, ఇద్దరు అడిషనల్ కమాండెంట్లు ఇంకా హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టింగ్ చేస్తున్నారన్నారు. 8 మంది డీఎస్పీలు సస్పెండ్ అయ్యారన్నారు. 80 నుంచి 100 మంది ఇన్స్పెక్టర్లు, వందల మంది కానిస్టేబుళ్లు వీఆర్ లో ఉన్నారని జగన్ ధ్వజమెత్తారు.
పోలీస్ వేధింపులతో చనిపోయిన ఓ వ్యక్తిని బెట్టింగ్ ల వల్ల చనిపోయారని కేసు పెట్టడాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్ తీవ్రంగా ఖండించారు. కూటమి ప్రభుత్వంలో మామిడి ధరలు రూ.2-3 పడిపోవడాన్ని ఆయన విమర్శించారు. మే నెలలో తెరవవలసిన ప్రాసెసింగ్ యూనిట్లను జూన్ నెల మధ్యలో తెరవడం, పంట ఒకేసారి చేతికి రావడం, సప్లై ఎక్కువవడం వంటి మానవతప్పిద కారణాలతో మామిడి రైతులను రోడ్డున పడేశారన్నారు. సీఎం చంద్రబాబుకు సంబంధించిన దళారి వ్యవస్థ, పరిశ్రమలకు మేలు చేయడంపైనే దృష్టి పెట్టారని విమర్శించారు.
కూటమి ప్రభుత్వం కుతంత్రాలకు బలైన వారిని పరామర్శించడం తప్పా?
మామిడి రైతుల నిరసనకు సంఘీభావం తెలపాలని ప్రజాప్రతినిధిగా వెళ్లడం తప్పా అని వైఎస్ జగన్ సూటిగా ప్రశ్నించారు. 2000 మందికి నోటీసులివ్వడం ఎక్కడా చూడలేదన్నారు. పెట్రోల్ బంకులకు కూడా నోటీసులివ్వడం చరిత్రలో జరగలేదన్నారు. ప్రభుత్వ కుట్రలను ఛేదించి ప్రజలు స్వచ్ఛందంగా నిరసలో పాల్గొనడం జరిగిందన్నారు. 5 కేసులు, 20 మంది అరెస్ట్ లు చేసి అడుగడుగునా అడ్డుపడ్డా బంగారుపాళ్యం నిరసనకు జనం వేలాదిగా స్వంతంత్రంగా తరలివచ్చారన్నారు. రాష్ట్రంలో ఉన్న ఒకే ఒక్క ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ అన్నారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా పోరాడే పార్టీ వైసీపీ అన్నారు. ఏపీలో రైతులకు, విద్యార్థులకు, మహిళలకు, నిరుద్యోగులకు, ఉద్యోగస్తులకు ఎవరికి కష్టం వచ్చినా వారి తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందన్నారు.
ఈనాడు...ఓ టాయిలెట్ పేపర్ : వైఎస్ జగన్
ఈనాడు పత్రికపై మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. మామిడిధరలు బాగున్నాయని రైతులు కేరింతలు కొడుతున్నారని రాయడం దుర్మార్గమన్నారు. ఈనాడు పత్రిక ఓ టాయిలెట్ పేపర్ లా మారిందన్నారు. పవన్ కల్యాణ్, బాలకృష్ణ సినిమాల్లో డైలాగ్స్ మాట్లాడితే అరెస్ట్ చేయడం దారుణమన్నారు.
బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో దారుణమైన డైలాగులు
సినిమా డైలాగ్స్‌ను పోస్టర్లుగా పెడితే ఇద్దర్ని రిమాండుకు పంపారన్నారు. ఇబ్బందిగా అనిపిస్తే సెన్సార్ బోర్డు ఎందుకు పర్మిషన్ ఇస్తుందని ప్రశ్నించారు. బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినిమాల్లో పెద్దపెద్ద దారుణమైన డైలాగులు ఉంటాయన్నారు. కష్టంగా అనిపిస్తే సినిమాలు తీయడం ఆపేయాలన్నారు.