Category
#Tollywood
సినిమా 

ఘనంగా ‘దేవగుడి’ సినిమా ట్రైలర్ లాంఛ్…

ఘనంగా ‘దేవగుడి’ సినిమా ట్రైలర్ లాంఛ్… పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్‌పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో, బెల్లం రామకృష్ణారెడ్డి రచన–దర్శకత్వంలో స్వీయ నిర్మాణంగా తెరకెక్కిన చిత్రం ‘దేవగుడి’. అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో పలువురు సినీ పాత్రికేయుల సమక్షంలో ‘దేవగుడి’ సినిమా ట్రైలర్ లాంఛ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాత బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ… మీడియా మిత్రుల మధ్య మా సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో శ్రీకాంత్ విడుదల చేసి తమకు మద్దతు అందించారని తెలిపారు. స్నేహం, ప్రేమ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు నిజ జీవిత ఘటనల ఆధారంగా బలమైన కథతో ఈ సినిమాను తెరకెక్కించామన్నారు. స్క్రీన్‌ప్లే చాలా షార్ప్‌గా ఉండి, ఒక్కో సీన్ ఆసక్తికరంగా సాగుతుందని చెప్పారు. ఎక్కడా ల్యాగ్ అనిపించదని, అవసరమైన బడ్జెట్‌తో ఎలాంటి రాజీ లేకుండా సినిమాను నిర్మించామని పేర్కొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన సెంటర్లలో సాధారణ టికెట్ రేట్లతో సినిమాను విడుదల చేస్తున్నామని, పైరసీని ప్రోత్సహించకుండా థియేటర్లలోనే చూడాలని విజ్ఞప్తి చేశారు.హీరో అభినవ శౌర్య మాట్లాడుతూ… హీరో కావడం తన చిన్ననాటి కల అని, ఎన్నో ఆడిషన్లు చేసి, సంవత్సరాల పాటు ఎదురుచూసిన తర్వాత ఈ అవకాశం వచ్చిందన్నారు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా తన టాలెంట్‌ను నమ్మి అవకాశం ఇచ్చిన బెల్లం రామకృష్ణారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. చిన్న సినిమా అని తక్కువగా చూడొద్దని, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహిస్తేనే పరిశ్రమ ముందుకు సాగుతుందన్నారు. హీరోయిన్ అనుశ్రీ మాట్లాడుతూ… ‘దేవగుడి’తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడం గర్వంగా ఉందన్నారు. తన పాత్ర అందరికీ నచ్చేలా ఉంటుందని, పవర్‌ఫుల్ డైలాగ్స్ తనకు ప్రత్యేక గుర్తింపునిస్తాయని చెప్పారు. నటుడు రఘు కుంచె మాట్లాడుతూ… భారీ యాక్షన్ సీక్వెన్సులతో ఈ చిత్రం తన కెరీర్‌లో ప్రత్యేకమని అన్నారు. సంగీత దర్శకుడు ఎస్.కె. మదీన్, డీవోపీ లక్ష్మీకాంత్ కనిక కూడా తమ అనుభవాలను పంచుకుంటూ, ‘దేవగుడి’ ఒక పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందనే నమ్మకం వ్యక్తం చేశారు.
Read More...
సినిమా 

గురుడోంగ్మార్ వద్ద ‘మరొక్కసారి’ అరుదైన షూటింగ్

గురుడోంగ్మార్ వద్ద ‘మరొక్కసారి’ అరుదైన షూటింగ్ సీకే ఫిల్మ్ మేకర్స్ బ్యానర్‌పై బి. చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ లవ్ ఎంటర్‌టైనర్ ‘మరొక్కసారి’ భారతీయ సినిమా చరిత్రలోనే ఓ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టిబెట్ సరిహద్దు సమీపంలోని ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతాల్లో ఒకటైన గురుడోంగ్మార్ సరస్సు వద్ద షూటింగ్ జరుపుకున్న తొలి భారతీయ సినిమాగా ‘మరొక్కసారి’ నిలిచింది. నితిన్ లింగుట్ల రచన, దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నరేష్ అగస్త్య, సంజనా సారథి హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. రొటీన్ సినిమా మేకింగ్‌కు భిన్నంగా, కథకు తగ్గ విజువల్ గ్రాండియర్‌ను చూపించాలనే ఉద్దేశంతో చిత్ర బృందం అత్యంత ఛాలెంజింగ్ లొకేషన్లను ఎంచుకుంది. అందులో భాగంగా కేరళలోని సహజ సిద్ధమైన ప్రకృతి అందాల మధ్యతో పాటు, అత్యంత క్లిష్టమైన హై ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో షూటింగ్ నిర్వహించారు. సముద్ర మట్టానికి సుమారు 5,430 మీటర్లు (17,800 అడుగులు) ఎత్తులో ఉన్న గురుడోంగ్మార్ సరస్సు ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న సరస్సులలో ఒకటి. ఇలాంటి ప్రాంతంలో షూటింగ్ చేయడం అంటే తీవ్రమైన చలి, తక్కువ ఆక్సిజన్ స్థాయిలు, పరిమిత షూటింగ్ సమయాలు వంటి అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. సాయుధ దళాల ప్రత్యేక అనుమతులతో ఈ అరుదైన చిత్రీకరణ జరగడం విశేషం. వాతావరణం క్షణక్షణానికి మారుతుండటంతో షూటింగ్ సమయంలో నటీనటులు, సాంకేతిక బృందం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంతేకాదు, కఠినమైన భూభాగం, పరిమిత రవాణా సౌకర్యాలు, భారీ ఎక్విప్‌మెంట్ తరలింపు, కమ్యూనికేషన్, విద్యుత్ పరిమితులు వంటి లాజిస్టిక్ సమస్యలు కూడా పెద్ద సవాలుగా మారాయి. ఈ మొత్తం షెడ్యూల్‌లో నటీనటులు, టెక్నికల్ టీమ్ ఆరోగ్యం, భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రొడక్షన్ హెడ్ అనుదీప్ పడురు కీలక పాత్ర పోషించడంతో షూటింగ్ విజయవంతంగా పూర్తైంది. ప్రస్తుతం ‘మరొక్కసారి’ సినిమా షూటింగ్ పూర్తికాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక అన్నపూర్ణ స్టూడియోస్‌లో డీఐ వర్క్ జరుగుతుండగా, ఫైనల్ కలర్ గ్రేడింగ్, విజువల్ ఫినిషింగ్ పనులతో సినిమాకు సంపూర్ణ విజువల్ టోన్ అందిస్తున్నారు. రోహిత్ బచు ఛాయాగ్రహణం, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్, భరత్ మాంచిరాజు సంగీతం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అన్ని పనులు పూర్తయ్యాక త్వరలోనే రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని నిర్మాతలు తెలిపారు.
Read More...
సినిమా 

శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల

శర్వానంద్ చేతుల మీదుగా ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్ విడుదల చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్‌ను ప్రముఖ స్టార్ హీరో శర్వానంద్ శుక్రవారం విడుదల చేశారు. టీజర్ విడుదల అనంతరం చిత్ర యూనిట్‌ను ఆయన అభినందిస్తూ, సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఒకే రోజు జరిగిన అనుకోని సంఘటనతో ఆరుగురు వ్యక్తుల జీవితాల్లో చోటు చేసుకునే పరిణామాలే కథగా రూపొందిన ఈ చిత్రాన్ని దోనేపూడి చక్రపాణి సమర్పణలో వేణు దోనేపూడి నిర్మిస్తున్నారు. గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయే, జార్జ్ మరియన్, అక్షయ్, విష్ణు ఓయ్, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి, కశ్యప్, రాజా రవీంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. టీజర్ ప్రారంభం నుంచే పచ్చని కొండలు, అందమైన గ్రామీణ నేపథ్యంలో కథను పరిచయం చేస్తూ ఆసక్తిని పెంచుతుంది. “చెప్పుకోడానికి ఇది మామూలు కథ కాదు” అనే డైలాగ్‌తో మొదలయ్యే టీజర్‌లో వెంటనే హాస్యం, ఉత్కంఠ మిళితమైన సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. గన్స్, కార్ చేజింగ్స్‌తో పాటు పాత్రల మధ్య నడిచే సరదా సంభాషణలు టీజర్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. పెళ్లి వేడుకలోకి ఎంట్రీ ఇచ్చే మాఫియా డాన్ జాన్ షెల్లీ హిట్లర్ పాత్రలో ఉపేంద్ర లిమాయే లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. టీజర్ మొత్తాన్ని గమనిస్తే సినిమా ఓ బాక్స్, ఓ గన్ చుట్టూ తిరిగే క్రైమ్ కామెడీగా రూపొందిందని స్పష్టమవుతుంది. ఆ బాక్స్ కోసం మాఫియా డాన్ ఎందుకు వెతుకుతున్నాడు? చివరికి అది ఎవరి చేతిలో ఉంటుంది? అందులో ఏముంది? అన్న ప్రశ్నలకు సమాధానం సినిమా చూసినప్పుడే తెలుస్తుందని నిర్మాత వేణు దోనేపూడి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “మొత్తం సినిమా షూటింగ్‌ను మేఘాలయ రాష్ట్రంలోనే పూర్తి చేశాం. చిరాపుంజి వంటి అద్భుతమైన లొకేషన్స్‌లో చిత్రీకరణ జరిగింది. మేఘాలయలో పూర్తిగా షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఇదే. పక్కా ప్లానింగ్‌తో తక్కువ రోజుల్లో షూటింగ్ పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం” అని చెప్పారు. ఈ చిత్రానికి అజయ్ అబ్రహం జార్జ్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయగా, స్టీఫెన్, ఆనంద్ సంగీతాన్ని అందించారు. వినోదం, క్రైమ్, స్టైలిష్ ప్రెజెంటేషన్‌తో రూపొందుతున్న ‘బా బా బ్లాక్ షీప్’ టీజర్‌తోనే మంచి బజ్‌ను క్రియేట్ చేసింది.
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  సినిమా  తెలంగాణ మెయిన్   Featured 

టాలీవుడ్‌లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత

టాలీవుడ్‌లో విషాదం.. హీరో రవితేజ తండ్రి కన్నుమూత తెలుగు చిత్రసీమలో రెండు రోజుల క్రితం విలక్షణ నటుడు కోటాశ్రీనివాసరావు మరణం వార్త మర్చిపోకముందే మరో విషాదకర సంఘటన జరిగింది. హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు. కొంత కాలంగా వ‌యోభారం, అనారోగ్య స‌మ‌స్య‌లతో ఇబ్బంది ప‌డుతున్న రాజగోపాల్ రాజు హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో మరణించారు. రాజగోపాల్ రాజుకు ముగ్గురు కుమారులు. హీరో...
Read More...
ఆంధ్రప్రదేశ్  తెలంగాణ  సినిమా  Lead Story  Featured 

Harihara Veeramallu: హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారైనా విడుదల అవుతుందా..?

Harihara Veeramallu: హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారైనా విడుదల అవుతుందా..? హరిహర వీరమల్లుకు రిలీజ్‌కు కొత్త తేదీ ఇప్పటికే పలుసార్లు వాయిదా ఈసారైనా రిలీజ్ అవుతుందా అంటూ ఫ్యాన్స్ చర్చ
Read More...

Advertisement