బనకచర్ల వివాదం: మాట్లాడుకుంటారా? ఎవరిదారి వారిదేనా?

By TVK
On
బనకచర్ల వివాదం: మాట్లాడుకుంటారా? ఎవరిదారి వారిదేనా?

  • ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీపై ఉత్కంఠ..!
  • బనకచర్లపై ఢిల్లీలో చంద్రబాబు, రేవంత్ ల భేటీ
  • పోలవరం-బనకచర్ల అంశమే ప్రధాన అజెండాగా ఏపీ
  • కృష్ణానదిపై పెండింగ్‌ ప్రాజెక్టులే తెలంగాణ అజెండా

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వివాదాల్లో మరింత చర్చకు దారితీసిన గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై ఢిల్లీలో ఇవాళ కీలక భేటీ జరగనుంది. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో కేంద్ర జలశక్తిశాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌ శ్రమశక్తిభవన్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు సమావేశం అవుతారు. ఈ సమావేశంలో ప్రధానంగా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంతోపాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం సింగిల్‌ అజెండా కింద బనకచర్లపై చర్చించాలని సూచించింది. అటు తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఈ సమావేశంలో బనకచర్లపై చర్చ అవసరం లేదని ప్రకటించింది.  కృష్ణా నదిపై పెండింగ్‌ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులే తమ అజెండాగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది.  పాలమూరు,దిండి ప్రాజెక్టులకు జాతీయహోదా, ఇచ్చంపల్లి ప్రాజెక్టు కేంద్రమే నిర్మించాలంటూ ప్రతిపాదనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎంల భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. 

ఇటీవల గోదావరి వరద జలాలను వినియోగించుకొనేందుకు బనకచర్ల ప్రాజెక్టును ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదించారు. ఈ ప్రాజెక్టుపై తెలంగాణలోని నీటిపారుదల రంగ నిపుణులు, బీఆర్ఎస్ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రేవంత్ ప్రభుత్వం కూడా తమ వైఖరిని ప్రకటించింది. అవసరమైతే న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించింది. ఏకంగా సీఎం రేవంత్‌, ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి కేంద్రమంత్రిని కలిసి బనకచర్లపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ సమక్షంలో సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. వివాదానికి పరిష్కారం వెతుక్కుంటారా? ఎవరికి వైఖరికి వారు కట్టుబడి ఉంటారా అన్నది తేలనుంది.   

గోదావరి మిగులు జలాల హక్కు ఏపీదే: సీఎం చంద్రబాబు
గోదావరి నదీ ప్రవాహించే మార్గంలో చివరి రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ కే మిగులు జలాలను పూర్తిగా వినియోగించుకునే హక్కు ఉందని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. ఈమేరకు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో భేటీ సందర్భంగా చంద్రబాబు తన వైఖరి వెల్లడించారు. గోదావరి నదిలో ఎగువ, దిగువ రాష్ట్రాల నీటి అవసరాలు తీర్చిన తర్వాత కూడా 90 నుంచి 120 రోజులు మిగులు నీరు ఉంటుందని.. ఆ నీటిని రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు  తరలించడానికి పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు ప్రతిపాదించామని.. ఈ ప్రాజెక్టు వల్ల కరవు ప్రాంతమైన రాయలసీమకు నీరిందించడం ద్వారా కలిగే ప్రయోజనాలను అమిత్ షాకు చంద్రబాబు వివరించారు.

Advertisement

Latest News

వ్యాపారం చిన్నదే.. ఆదాయమే కోట్లలో.. వ్యాపారం చిన్నదే.. ఆదాయమే కోట్లలో..
నకిలీ మద్యం లేబుల్స్ తయారీ యూనిట్ పై దాడి.. గుట్టుగా సాగుతున్న వ్యాపారం రట్టు చేసిన ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ టీమ్.. సూర్యాపేటలో తీగ లాగితే.. శివార్లలో...
మియాపూర్ లో కలకలం.. ఒకే కుటుంబానికి చెందిన అయిదు మంది మృతి
రామాంతపూర్ లో ఘోర ప్రమాదం.. అయిదుగురు మృతి..
హమ్మయ్య సిటీలో ఇక పార్కింగ్ కష్టాలు లేనట్లే..
జూలో ఘనంగా సింహాల దినోత్సవం..
మూసీ పరివాహక ప్రాంతాలకు రెడ్ అలర్ట్..
కంటిమీద కునుకులేదు.. ఇంటి వైపు చూసింది లేదు..