ఇదేం దిక్కుమాలిన పనిరా నాయనా... ఇంటి ముందు అలాంటి బొమ్మా..!!
జూబ్లీహిల్స్ ప్రముఖ పారిశ్రామికవేత్త విడ్డురం
ఇంటిముందు అసభ్యకరమైన విగ్రహం
మండిపడుతున్న మహిళలు, నెటిజన్లు
చర్యలు తీసుకోవాలని పోలీసులకు వినతి
V. Krishna Kumar
TPN Special Desk
మనిషికి పిచ్చి ముదిరితే ఏమౌతుంది.. ఆ కుటుంబంలో తలనొప్పి ఎక్కువవుతుంది.. అలాగే కాలనీలో సమస్య మొదలౌతుంది. అచ్చం అలాగే ఉంది ఓ ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆలోచన. డబ్బు ఉంది కదా అని ఆయన చేసిన పని జనాలకు తల తీసినంతలా మారింది. తలపైకెత్తి చూడాలంటేనే అసహ్యం పుట్టేలా తయారైంది. అటుగా వెళ్లే జనం, వాహనదారులు, చివరకు పక్కన నివసించే జనాలు ఇదేం ఖర్మరా బాబు అంటూ తిట్లపురణం మొదలు పెట్టారు. ఇక సోషల్ మీడియాలో నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు. అందుకు కారణమేంటో ఈ ఫోటో చూడండి మీకే అర్ధం అవుతుంది. చూడగానే మీరు కూడా చీ అంటూ తలదించుకుంటారు.
చూశారుగా ఇది ఎవరో పెట్టిన కటౌట్ కాదు.. జూబ్లీహిల్స్ పెద్దమ్మ గుడికి కూతవేటు దూరం.. డైమండ్ హౌస్ ఎదురుగా ఉండే.. సాక్షాత్తు మెగా కృష్ణారెడ్డి మామ, ఎస్ఎస్ రెడ్డి ఇంటి ముందు పెట్టిన అశ్లీల మహిళ బొమ్మ అది. బొమ్మ సరే పైగా దానికి లైట్స్ పెట్టి మరి అందరికి కనిపించేలా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం జనాలకు వెగటు పుట్టేలా తయారైంది. అది చూసిన వాహనదారులు, మహిళలు అంత ఇదేం పోయే కాలం అంటూ తిట్ల పురాణం మొదలు పెట్టారు. చుట్టుపక్కల మహిళలు బయటకు రావాలంటేనే సిగ్గుపడే పరిస్థితులు ఉన్నాయని వెళ్లి ఆ సభ్యకరమైన బొమ్మను తీసేయాలంటూ వేడుకుంటే మా ఇల్లు మా ఇష్టం అంటూ సమాధానం చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక నెటిజెన్ల కామెంట్లు మహిళ సంఘాల మండిపాటు చెప్పాల్సిన పని లేదు. పడకగదికి పర్సనల్ గా మారాల్సిన ఫొటోస్ , బొమ్మలు, కటవుట్లు ఇలా నడిరోడ్డులో దర్శనం ఇస్తుంటే పోలీసులు ఎమ్ చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. వారి ఇంట్లో మహిళలు లేరా వారు అడ్డుచెప్పారా అని నిలదీస్తున్నారు. సినిమాల్లో అశ్లీలత ఉంటే సెన్సార్ బోర్డ్ క్లిప్పింగ్స్ తొలగిస్తుతుంది. మరి అంత భారీ స్థాయిలో ఏర్పాటైన ఆ బొమ్మపై పోలీసులు ఎందుకు చూసి చూసినట్లు వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రముఖ వ్యాపారవేత్త అని వారికి పోలీసులు, అధికారులు వత్తాసు పలికితే సబబు కాదని చెబుతున్నారు. వెంటనే దాన్ని తొలగించాలని కోరుతున్నారు. ఇదిలావుంటే ఇటీవల హైదరాబాద్ లో జరిగిన మిస్ వరల్డ్ పోటీలో పాల్గొన్న అందెగత్తెలకు ఆయన ఇంట్లో ఆతిధ్యం కూడా ఇచ్చారని, అందులో ఎవరి బొమ్మ ఇది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.