అమెరికాలో రోడ్డుప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవదహనం

On
అమెరికాలో రోడ్డుప్రమాదం.. హైదరాబాద్ కుటుంబం సజీవదహనం

అమెరికాలో హైదరాబాద్ కుటుంబం సజీవ దహనమయ్యింది. వెకేషన్ కోసం డల్లాస్ కి వెళ్ళిన కుటుంబం అనుకోకుండా రోడ్డుప్రమాదానికి గురైంది.  హైదరాబాద్  కి చెందిన తేజస్విని,  శ్రీ వెంకట్, దంపతుల తో పాటు ఇద్దరు పిల్లలు ఘటన స్థలంలోనే మృతి చెందారు. సెలవులు ఉండటంతో అట్లాంటలోని బంధువుల ఇంటికి కారులో వెళ్ళిన వెంకట్ వారం రోజుల పాటు అక్కడ ఉండి అనంతరం అట్లాంట నుండి అర్థరాత్రి డల్లాస్ కు తిరుగు ప్రయాణం కాగా గ్రీన్ కౌంటి  ఏరియాలో రాంగ్ రూట్ లో వచ్చి మినీ ట్రక్ కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో మంటలు చెలరేగి అందులో  ప్రయాణిస్తున్న నలుగురు సజీవ దహనం  అయ్యారు. కార్  మొత్తం బూడిద కావడంతో ఎముకలను  ఫోరెన్సిక్ కు పంపిన పోలీసులు,, డిఎన్ఏ  శాంపిల్స్ తీసుకొని మృతి దేహాలను అప్పగించనున్నారు.

Tags:

Advertisement

Latest News