డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గం పిఠాపురంలో పరిస్థితి ఇదా?

By Dev
On
డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గం పిఠాపురంలో  పరిస్థితి ఇదా?

లోకేష్ అభినందిచడం ఓకే కానీ.. టీచరే సమస్యను పరిష్కరిండంలోనే ట్రూ పాయింట్

అయ్యా ఐటీ మంత్రి లోకేశ్ గారు..ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌గారూ! మీరు నిత్యం ఏదో విషయంమీద స్పందిస్తూ..ప్రజల సమస్యలు పరిష్కరిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. లోకేశ్ నియోజకవర్గం మంగళగిరిలో చిన్న సమస్య దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పత్రికల్లో, ఛానళ్లలో, సోషల్ మీడియాలో మిమ్మల్ని ట్యాగ్ చేసి తమ కష్టాలు చెప్పుకుంటున్న వారి గ్రీవెన్స్‌పట్ల పెద్దమనసుతో స్పందిస్తూ ఎంతో మందికి భరోసాగా నిలుస్తున్న ఆయనకు ముందుగా మనసారా అభినందనలు.  "విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించి సొంత ఖర్చులు భరించి బడికి బాట వేసిన ఉపాధ్యాయుడు సీతరామరాజుకి కూడా మన:పూర్వక వందనం. కన్నపిల్లల గురించి కన్నవారే పట్టించుకోని రోజుల్లో ఓ సాధారణ టీచర్ ప్రమాదకర రాకపోకల నుంచి పిల్లల ఇబ్బంది తొలగించాలని లక్ష రూపాయలు వెచ్చించడం చిన్న విషయం కాదు. ఎంతో గొప్ప మనసున్నవారే ఇలాంటి పనులు చేయగలరు. కచ్చితంగా యావత్ సమాజానికి సీతారామరాజు ఆదర్శమే."

https://twitter.com/naralokesh/status/1942198772643324063?t=InpHmbxbbH2LfBwJCp6gzQ&s=08


 కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదైంది. రాష్ట్రమంతటా రూ.వేల కోట్లతో రోడ్లు వేస్తున్నామని ఆర్ అండ్ బీ, పంచాయతీ రాజ్ శాఖ సంబంధిత శాఖ మంత్రులు లెక్కలేనన్ని లెక్కలు చెప్తున్నారు . మరి వారికి ఇంత చిన్న రోడ్డు మార్గం కనపడలేదా?   కాకినాడ జిల్లా గొల్లప్రోలు శివారు సూరంపేట ప్రాథమిక పాఠశాల అంటే ఇది డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు సంబంధించిన నియోజకవర్గంలోని మండలం కూడా. డిప్యూటీ సీఎం తన పర్యటనలో గమనించి మరి అడవుల్లో ఉన్న గిరిజనులకి వేసుకోవడానికి కుప్పలుతెప్పలుగా చెప్పులు పంపిన పెద్దమనసు చూశాం. ఈ మధ్యే పక్క రాష్ట్రం కళాకారిణి పాకీజాకు రూ.2 లక్షల ఆర్థిక సాయం చేసిన ఆయన దాతృత్వం గురించి విన్నాం. అలాగే ఈ మధ్యనే గిరిజన బిడ్డలు తినడం కోసం మధురమైన మామిడిపండ్లు కూడా పంపడం గురించి తెలుసుకున్నాం. మరి తన సొంత నియోజకవర్గంలోని ఓ మండలంలో సరైన దారిలేక విద్యార్థులు స్కూలు వెళ్లడం లేదని ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన ఉపముఖ్యమంత్రికి తెలియలేదా? అని అందరిని ప్నశ్నించే పవన్ ని కొందరు ప్రశ్నిస్తున్నారు.  పాఠశాలకు సరైన దారిలేదని ఆ చుట్టు పక్కల అధికార యంత్రాంగానికి తెలియదా? ఆ మాత్రం నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటన చేసే తీరిక లేదా? మంగళగిరిలో చిన్నవాడైన లోకేశ్ ప్రజాదర్బార్ ప్రజల గ్రీవెన్స్ తెలుసుకుంటున్నారు. ఆ దిశగా డిప్యూటీ సీఎం ఏం చేస్తున్నారు? మంగళగిరి కార్యాలయంలో జనవాణి కార్యక్రమంలో అక్కడ నియమించిన సిబ్బంది వినతులు స్వీకరణ తప్పా ఇబ్బంది పరిష్కరించడం జరిగిందా? సమస్యల పరిష్కారం గురించి ఏనాడైనా రివ్యూ చేశారా? జనసేన పార్టీలో ఆ దిశగా ఒక్క అడుగైనా పడిందా?

   రైల్వే అండర్ పాస్ వద్దనున్న మురుగు కాలువ పక్క నుంచి ప్రమాదకర రాకపోకల గురించి టీచర్ అనిశెట్టి సీతారామరాజుకు చెప్పిన వారు పిఠాపురం ఎమ్మెల్యేకు ఎవరూ చెప్పలేదంటారా? చెప్పే టైం ఇవ్వలేదా?  పసిపిల్లలు హాజరు శాతం కోల్పోయే స్థాయిలో ఓ కాలిబాట వంతెన నిర్మాణం ప్రాముఖ్యత తెలియకుండా కూటమి ప్రభుత్వం నిద్రపోతుందా? ఇపుడు కూడా పత్రికలో వార్తని చూసి తెలుసుకుని ట్వీట్‌తో మెచ్చుకునేందుకు ముందు కచ్చితంగా ప్రభుత్వం ఈ విషయాన్ని లోతుగా ఆలోచించాలి. ఎవరు చేయాల్సిన పని ఎవరు చేశారో ఓసారి విశ్లేషించుకోవాలి. ఇప్పటికైనా అప్రమత్తమై ఇలాంటి చిన్న చిన్న పనులతోనే మంచి పేరు వస్తుందని గుర్తించి ఆయా శాఖల మంత్రులను అప్రమత్తం చేయాలి. ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ ఆ పని చేసుంటే ఆ చిన్నారులంతా "మేం పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా" అని కాలరెగరేసి చెప్పుకునేవారు కాదా? ప్రభుత్వమే స్పందించి పరిష్కరించి ఉన్నట్లయితే  ఇది నిజమైన ప్రజా ప్రభుత్వం, పసిపిల్లల గురించి కూడా ఆలోచించే మనసున్న మన ప్రభుత్వం అని అంతా చెప్పుకునేవారు కారా?  అంతేగానీ అంతా అయిపోయే దశకు వచ్చిన తర్వాత ప్రశంసించడం  కాకుండా ప్రభుత్వాన్ని ప్రజలే ప్రశంసించే ఇటువంటి పనులు చేయాలని కూటమి ప్రభుత్వం మేల్గోరే వారు కోరుతున్నారు.

Tags:

Advertisement

Latest News