అమెరికాలో మూడవ పార్టీకి స్థానం ఉందా?

By TVK
On
అమెరికాలో మూడవ పార్టీకి స్థానం ఉందా?

* యూఎస్ లో ట్రంప్ వర్సెస్ ఎలన్ మస్క్  
* ఎలన్ మస్క్ కొత్తపార్టీపై ట్రంప్ సెటైర్లు
* అమెరికాలో మూడవ పార్టీకి స్థానం ఉందా? 
* 8శాతం నష్టపోయిన టెస్లా షేర్లు 

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రులు ఉండరన్న సామెత మన రాజకీయాల్లోనే కాదు.. అమెరికాలోనూ నిజమవుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రచంచ కుభేరుడు, టెస్లా సంస్థ అధినేత ఎలన్ మస్క్ ఇద్దరూ కలిసి పనిచేశారు. అమెరికాలో ఎన్నికల ముందు నుంచి ట్రంప్ కు అండగా నిలిచిన మస్క్ కు అధికారంలోకి వచ్చాక అసలు విషయం బోధపడుతూ వచ్చింది. అప్పటి వరకు మస్క్ ను పొగడుతూ వచ్చిన ట్రంప్ విమర్శలు చేసే సరికి సహించలేకపోయాడు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. చివరకు ఓ రాజకీయ పార్టీ పెట్టేవరకు వెళ్లింది. మస్క్ ఏకంగా జూలై 5న 'అమెరికా పార్టీ' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కేవలం రెండు పార్టీలే ప్రధానంగా ఉన్న అమెరికా రాజకీయాల్లో ఎలన్ మస్క్ పార్టీ ఇప్పుడో సంచలనం. 

చిచ్చుపెట్టిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్
ట్రంప్, ఎలన్ మస్క్ మధ్య మనస్పర్థలకు, వివాదాలకు కారణం ఇటీవల ప్రవేశపెట్టిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు. ఈ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రంప్‌ పాలనా విభాగం డోజ్‌ నుంచి ఎలన్ మస్క్ బయటకు వచ్చేసి ఎదురుదాడి చేయడం ప్రారంభించారు. కొత్త పార్టీ ప్రారంభిస్తున్నట్టు తన ఎక్స్ వేదికగా ప్రకటించారు. మస్క్ నిర్వహించిన పోల్ లో 65శాతం మంది కొత్త రాజకీయపార్టీకి మద్దతు తెలిపారు.  

అమెరికాలో మూడవ పార్టీకి స్థానం ఉందా?
అమెరికా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే రెండు పార్టీలకు చెందిన వారే అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. అయితే రిపబ్లికన్‌ పార్టీ.. లేదంటే డెమోక్రటిక్ పార్టీ. ప్రజలు ఈ రెండు పార్టీల మధ్యే అధికారాన్ని పంచుతూ వచ్చారు. అలా అని అమెరికాలో మరో పార్టీ లేదా అంటే ఉన్నాయి. కానీ ఆ పార్టీలు పోటీలో ఉన్నా ఈరెండు  ప్రధాన పార్టీలను ధీటుగా ఎదుర్కొని ప్రభావం చేపించలేకపోయాయి. 1912లో థియోడోర్ రూజ్‌వెల్ట్ ప్రోగ్రెసివ్ పార్టీ తరుఫున ఇప్పటివరకు అత్యధిక ఓట్లు (27%) సాధించిన అభ్యర్థిగా రికార్డు సాధించారు. జార్జ్‌ వాషింగ్టన్‌ స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి.. అమెరికాకు అధ్యక్షుడు అయ్యారు. ఈ నేపథ్యంలో ఎలన్‌ మాస్క్‌ కొత్త పార్టీని అమెరికన్లు ఎలా ఆదరిస్తారనేది రాబోయే రోజుల్లో చూడాలి.

టెస్లా షేర్లు భారీగా పతనం  
ఎలన్ మస్క్ కొత్త పార్టీ ప్రకటన అనంతరం ఆయన కంపెనీ టెస్లా షేర్లు దాదాపు 8శాతం పతనం అయ్యాయి. మస్క్‌ గాడి తప్పారని ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో మార్కెట్ లో టెస్లా షేర్లు పతనం అయ్యాయని.. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ తో టెస్లా భారీగా రాయితీలు కోల్పోతుందనే భయాందోళనలో పెట్టుబడిదారులు ఉన్నట్లు సమాచారం. మొత్తం మీద మస్క్ రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం అటు అమెరికాలోనే కాకుండా ఇటు వ్యాపార వర్గాల్లోనూ చర్చనీయాంశమైంది.

Advertisement

Latest News